అన్వేషించండి

New trend: మీ కారే.. మీ రెస్టరెంట్.. కరోనా నేపథ్యంలో మెట్రో నగరాల్లో పెరుగుతున్న న్యూ కల్చర్‌

మీకు కారు ఉందా? అయితే మీకు నచ్చిన రెస్టరెంట్ భోజనాన్ని కారులోనే కూర్చుని హాయిగా ఆరగించొచ్చు. ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్.

ఆహారప్రియులకు కరోనా jకష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇష్టమైన రెస్టరెంట్లకు వెళ్లలేక చాలా నెలల పాటూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, జనం మధ్యలో వెళ్లి కూర్చోవాలంటే ఇప్పటికీ  బెదురుగానే ఉంది. అందుకే కొన్ని రెస్టారెంట్లు ఆహారప్రియుల కోసం కొత్త ట్రెండ్ మొదలుపెట్టాయి. అదే ‘డ్రైవ్ ఇన్ రెస్టరెంట్’. 

New trend: మీ కారే.. మీ రెస్టరెంట్.. కరోనా నేపథ్యంలో మెట్రో నగరాల్లో పెరుగుతున్న న్యూ కల్చర్‌

ఈ ట్రెండ్ 1970వ దశకంలో దేశంలోని చాలా చోట్ల ఉండేది. తరువాత క్రమేపీ కనుమరుగయ్యింది. మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ దేశవ్యాప్తంగా మొదలవుతోంది. కాన్పూర్, చెన్నై, ఢిల్లీ, ముంబైలలోని కొన్ని రెస్టరెంట్లు ఈ డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ను నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ అనంతరం రెస్టరెంట్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక కూడా చాలా చోట్ల హోటళ్లు నష్టాల బాట పట్టాయి. కరోనా భయంతో రెస్టరెంట్లు లోపలికి వచ్చి కూర్చునేందుకు చాలా మంది సంకోచించారు. దీంతో ఇలా డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు కాన్పూర్ డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ యజమాని మల్హోత్రా. ‘డ్రైవ్ అండ్ డైన్’ పేరుతో తాము ఓపెన్ పార్కింగ్ రెస్టారెంట్ మొదలుపెట్టామని, వినియోగదారులు భారీగా వస్తున్నారని చెప్పారాయన. తమ రెస్టరెంట్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనే కారులు పార్క్ చేసేందుకు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

ప్రారంభించిన తొలివారంలోనే దాదాపు 60 కార్లు డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ను వచ్చాయని తెలిపారు మల్హోత్రా. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ప్రతి వారం రకరకాల థీమ్ లతో అలంకరిస్తూ వినియోగదారులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నట్టు తెలిపారు. కొంతమంది దాదాపు మూడు కార్లు పట్టే ప్రదేశాన్ని ముందే బుక్ చేసుకుని,  ఆ ప్రదేశంలో తమ కుటుంబాలతో కూర్చుని రకరకాల ఆటలు ఆడుతున్నారని చెప్పారు. 

డ్రైవ్ ఇన్ పార్టీస్ కూడా....

చెన్నైలో అర్జున్ గార్డెన్ కేఫ్ నడిపిస్తున్నారు శ్యామ్ సుందర్. ఈయన తన కేఫ్ ముందు డ్రైవ్ ఇన్ బర్త్ డే పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు.  అంటే పార్క్ చేసిన కార్లలోనే బర్డ్ డేకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఫ్లాష్ మాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. దాదాపు ఎకరాల స్థలంలో ఆయన ఈ కేఫ్ ను నడిపిస్తున్నారు. డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ట్రెండ్ కోసం ఆయన 30,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. అక్కడ 45 నుంచి 50 కార్లు పడతాయి. అంతేకాదు వినియోగదారులను ఆకర్షించేందుకు క్రికెట్, ఫుట్ బాల్ మ్యాచులను కూడా పెద్ద స్క్రీనులపై ప్రదర్శిస్తున్నారు. కారుల్లో కూర్చుని తింటూనే, మ్యాచులను తిలకించవచ్చు. 

చెన్నైలోని మరో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ‘శ్రీ కమచి మెస్’. కరోనాకు ముందు ఇదొక సాధారణ మెస్. లాక్డౌన్ తరువాత దీన్ని డ్రైవ్ ఇన్ మెస్ కింద మార్చారు. కార్లలోనే కూర్చుని కంఫర్ట్ గా తినేలా చెక్కతో చేసిన చిన్న బెంచీలు కూడా ఏర్పాటు చేశారు.  దాదాపు ఈ మెస్ ముందు ఒకేసారి 40 కార్లు పార్క్ చేసే వీలుంది. 

కరోనా తరువాత హోటల్ బిజినెస్ భారీగా దెబ్బతింది. ఆ బిజినెస్ పై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లు నడుస్తున్నప్పటికీ ఆశించినంత లాభాలు లేకపోవడంతో హోటలియర్లు ఇలాంటి కొత్త ట్రెండ్లను సెట్ చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget