అన్వేషించండి

Copper Vessel: రాగి పాత్రల్లో నీళ్లు ఉంచి, తాగుతున్నారా? మీ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసా

Health Tips in Telugu | తాగే నీటిని రాగి పాత్రలో 6 నుంచి 8 గంటలు ఉంచడం వల్ల రాగి కొద్దిగా నీటిలో కరిగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని ఒలిగోడైనమిక్ ప్రభావం అంటారు.

ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మహిళలు ఇలా అంతా ఒత్తిడికి చిత్తవుతున్నారు. దాంతో ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్నారు. దీనికోసం రోజువారీ జీవితంలో పూర్వకాలపు ఆరోగ్య పద్ధతులను చేర్చుకుంటున్నారు. వీటిలో ఒకటి చాలా ప్రాచుర్యం పొందింది. అదే రాగి పాత్రల్లో (Copper Vessels)లో మంచి నీళ్లు తాగడం. 

కొందరు ఇంట్లో రాగి బిందెలు, రాగి చెంబులలో నీళ్లు పోసి తాగుతుంటారు. కొందరు పని ప్రదేశాలలో రాగి బాటిల్స్ వినియోగిస్తుంటారు. ఆయుర్వేద సంప్రదాయంలో రాగి పాత్రలలో నీరు నిల్వ ఉంచి త్రాగడాన్ని ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని భావిస్తారు. కానీ శాస్త్రీయ పరంగా సైతం రాగి పాత్రలలో నీళ్లు తాగడం సురక్షితమా? ఇక్కడ తెలుసుకోండి..

రాగి పాత్రలో నీరు తాగడం ఎలా ప్రారంభమైంది?

రాగి పాత్రల్లో తాగునీటిని నిల్వ చేసుకునే ఆచారం ప్రాచీన భారతదేశానికి ఈజిప్టు నుండి వచ్చింది. ఆయుర్వేదంలో దీన్ని తామ్రజలం అంటారు. ఇది శరీరంలోని మూడు దోషాలను (వాతం, పిత్తం, కఫం) సమతుల్యం చేయడంలో దోహదం చేస్తుంది. శరీరాన్ని శుద్ధి చేయడంలో, మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తారు.

నీటిలో రాగి కరుగుతుందా?

నీటిని రాగి పాత్రలో 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా నిల్వ చేసినప్పుడు, కొద్ది మొత్తంలో రాగి అయాన్లు నీటిలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియను ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి.

ఇవి ప్రయోజనాలు

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది: రాగిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వాపు లాంటివి రాకుండా పోరాడటంలో సహాయపడతాయి.
  • జీర్ణక్రియ: రాగి హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. మన కడుపులో వాపు, పుండ్లు, జీర్ణక్రియ సమస్యలు దూరం చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
  • బరువు నియంత్రణ: రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు ప్రతిరోజూ తాగినే మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వును  సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. 
  • ఆరోగ్యకరమైన చర్మం: శరీరంలో రాగి మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని పునరుత్పత్తి చేయడంతో పాటు మచ్చలను తొలగిస్తుంది.
  • థైరాయిడ్ సమతుల్యత: థైరాయిడ్ గ్రంధి పనితీరుకు రాగి కావాలి. దాని లోపం అసమతుల్యతకు దారితీస్తుంది.

రాగి పాత్రలను ఎలా ఉపయోగించాలి?

  • రాగి సీసాను శుభ్రమైన నీటితో నింపాలి. దాన్ని రాత్రంతా లేదా కనీసం 6 గంటలు ఉంచండి.
  • రాగి పాత్రలోని నీటి ద్వారా ఫలితాలు పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి
  • రాగి అధికంగా శరీరంలో చేరకుండా ఉండటానికి, రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆ పాత్రలో పోసిన నీళ్లు తీసుకోవాలి. 
  • ఆమ్ల ద్రవాలను (ఉదాహరణకు నిమ్మరసం) లాంటివి రాగి పాత్రల్లో నిల్వ చేసి తాగవద్దు

ఎంత మోతాదులో రాగి తీసుకోవాలి

అధిక మోతాదులో రాగి శరీరంలో చేరడం సైతం ఇన్‌టాక్సినేషన్ కు దారితీస్తుంది. తద్వారా వికారం, వాంతులు, కడుపు నొప్పి, కాలేయ సమస్యలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. పెద్దలు రోజుకు 0.9 మిల్లీగ్రాముల రాగి శరీరంలోకి చేరినా ఏ సమస్య ఉండదు. దీన్ని ఆహారం ద్వారా సైతం పొందవచ్చు.

గమనిక: వార్తలో పేర్కొన్న సమాచారం కొన్ని వైద్య నివేదికల ఆధారంగా ఇక్కడ అందించాం. ఇందులోని విషయాలకు ఏబీపీ దేశం బాధ్యత వహించదు. మీరు ఏదైనా వైద్య, ఆరోగ్య సలహాను పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget