Brown Sugar Vs White Sugar: బ్రౌన్ షుగర్ మంచిదా తెల్లని చక్కెర మంచిదా? ఏది ఎంత ఆరోగ్యకరమో తెలుసుకుందాం!
Brown Sugar Vs White Sugar: వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమా? బ్రౌన్ షుగర ప్రయోజనాలు ఏంటీ? వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.

Brown Sugar Vs White Sugar: భారతీయుల జీవితంలో తియ్యదనం పండుగతో సమానం. కానీ చక్కెర విషయానికి వస్తే, ఆరోగ్యం గురించి ఆందోళన కూడా మొదలవుతుంది. గత కొన్ని సంవత్సరాలలో ప్రజలు వైట్ షుగర్గు రించి కొంత అప్రమత్తంగా ఉంటున్నారు. అలాంటి వాళ్లంతా కూడా ఇప్పుడు బ్రౌన్ షుగర్ లేదా గోధుమ రంగు చక్కెరను ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తున్నారు. కానీ నిజంగా బ్రౌన్ షుగర్ తెల్ల చక్కెర కంటే మెరుగైనదేనా? లేదా ఇది కేవలం ఆరోగ్యం పేరుతో మరొక భ్రమనా? వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.
బ్రౌన్ షుగర్, తెల్ల చక్కెర మధ్య తేడా ఏమిటి?
తెల్ల చక్కెరను శుద్ధి చేసే ప్రక్రియతో తయారు చేస్తారు. దీని వలన దానిలోని అన్ని ఖనిజాలు ఫైబర్లు తొలగిస్తారు. బ్రౌన్ షుగర్, తెల్ల చక్కెర కంటే తక్కువ ప్రాసెస్ చేస్తారు. దీనిలో కొద్ది మొత్తంలో బెల్లాన్ని కలుపుతారు. అందుకే ఇది లేత గోధుమ రంగు కలిగి ఉంటుంది. రుచి కూడా భిన్నంగా ఉంటుంది.
బ్రౌన్ షుగర్ ప్రయోజనాలు
బ్రౌన్ షుగర్లో కాల్షియం, పొటాషియం, ఇనుము అండే మెగ్నీషియం వంటి కొన్ని ఖనిజాలు ఉంటాయి, కానీ వాటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ ద్వారా శరీరానికి పుష్కలంగా పోషణ లభిస్తుందని మీరు అనుకుంటే, అది నిజం కాదు.
బ్రౌన్ షుగర్ తక్కువ ప్రాసెస్ చేస్తారు. కాబట్టి దానిలో రసాయనాల పరిమాణం తక్కువగా ఉంటుంది. వైట్ షుగర్‌తో పోల్చుకుంటే కాస్త బెటర్ అంతే కానీ దీని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇదేమీ సూపర్ ఫుడ్ మాత్రం కాదు.
బ్రౌన్ షుగర్‌లో బెల్లం కూడా కలవడంతో దానికి ప్రత్యేక రుచి వస్తుంది. ఇది కొన్ని వంటకాల్లో వాడుకుంటే బాగుంటుంది. కానీ ఇది ఆరోగ్య పరంగా పెద్ద ప్రయోజనం ఇవ్వదు.
బ్రౌన్ షుగర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుందా?
బ్రౌన్ షుగర్ వల్ల బరువు నియంత్రణ అవుతుందని ఒక తప్పుడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది అబద్ధం. నిజం ఏమిటంటే, దీనిలో కేలరీలు తెల్ల చక్కెరలో ఉన్నంత ఉంటాయి. మీరు బరువు తగ్గించాలనుకుంటే, బ్రౌన్ షుగర్ కూడా పరిమిత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. .
డయాబెటిస్ ఉన్నవారికి ఏది మంచిది?
బ్రౌన్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తెల్ల చక్కెరలాగే ఉంటుంది, అంటే ఇది కూడా చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ రెండు షూగర్‌లకు కూడా దూరంగా ఉండాలి.
బ్రౌన్ షుగర్ తెల్ల చక్కెర కంటే కొంత మేరకు మెరుగైనది, కానీ దీన్ని ఆరోగ్యకరమైంది అనడం తప్పు. ఆరోగ్యం నిజంగా ముఖ్యమైతే, ఏ రకమైన చక్కెరనైనా తక్కువగా తీసుకోండి. అది తెల్లగా ఉన్నా లేదా గోధుమ రంగులో ఉన్నా, తియ్యదనం జీవితంలో ఉండాలి, కానీ పరిమిత మొత్తం కూడా ముఖ్యం.
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.





















