(Source: Poll of Polls)
Red Wine: రోజూ రెడ్ వైన్ తాగితే డయాబెటిస్ ముప్పును తగ్గించుకోవచ్చు, అందంగానూ మారొచ్చు
డయాబెటిస్ వస్తుందేమో అని భయపడేవారికి ఓ శుభవార్త. రెడ్ వైన్ మీ భయాన్ని తగ్గిస్తుంది.
దీర్ఘకాలికంగా వేధించే డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందా, వదలకుండా ఒంట్లోనే ఇల్లు కట్టుకుని కూర్చుంటుంది. అందుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఓ పరిశోధన ప్రకారం రెడ్ వైన్ డయాబెటిస్‌ను అడ్డుకుంటుందని తేలింది. రోజూ రెడ్ వైన్ అరగ్లాసుకు మించకుండా తాగే వారిలో డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని బయటపడింది. ముఖ్యంగా మహిళలకు రెడ్ వైన్ మేలుచేస్తుందని పరిశోధన తేల్చింది. ఒత్తిడి కూడా డయాబెటిస్ రావడానికి కారణం. ఈ ఒత్తిడిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. దీని కారణంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కణాలు దెబ్బతిని మధుమేహం వస్తుంది. రెడ్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ను రాకుండా అడ్డుకుంటుంది. రోజూ రెడ్ వైన్ తాగనివారితో పోలిస్తే, తాగే వారిలో మధుమేహం వచ్చే ఛాన్సు 27 శాతం తగ్గుతుందని గతంలోనూ చాలా అధ్యయనాలు తేల్చాయి. డార్క్ చాక్లెట్లలో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించే గుణాలు అధికం. రోజుకో చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినడం చాలా మేలు.
అధికంగా వద్దు...
అతి అనర్ధానికే దారి తీస్తుంది. అలాగే రెడ్ వైన్ అధికంగా తాగితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోజుకో అరగ్లాసు లేదా గ్లాసు రెడ్ వైన్ దాటకుండా చూసుకోవాలి. రెడ్ వైన్లో రెండు రకాలు నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్ అని ఉన్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఎంచుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు నాన్ ఆల్కహాలిక్ తాగడం ఉత్తమం. ఇక ఆల్కహాలిక్ రెడ్ వైన్లో కొంత శాతం ఆల్కహాల్ కలిసే అవకాశం ఉంది.
ఏ వైన్ మంచిది?
దానిమ్మ, ద్రాక్ష, బ్లాక్ బెర్రీలు, వోట్స్ ఇలా రకరకాల వాటితో వైన్ ను తయారు చేస్తారు. వాటిలో మధుమేహం రాకుండా అడ్డుకునే సత్తా బ్లాక్ బెర్రీలు, వోట్స్‌తో చేసిన వైన్‌కే ఉంది. రెడ్ వైన్ లాగే, వైట్ వైన్ కూడా ఉంటుంది. అది కూడా మంచిదే. అయితే ఏదీ ఎక్కువ మొత్తంలో తాగకూడదు.
అందానికీ...
రెడ్ వైన్ ఆరోగ్యానికే కాదు, అందానికీ మేలు చేస్తుంది. అది ఎక్కువకాలం చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మం ముడతలను రాకుండా అడ్డుకోవడం, ఏజింగ్ లక్షణాలు తగ్గించడం వంటివి చేస్తుంది. దీనివల్ల అందం రెట్టింపు అయినట్టు కనిపిస్తుంది. వైన్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ చర్మకణాలను కాపాడతాయి. ఒకవేళ వైన్ తాగలేకపోతే ద్రాక్ష, బ్లూబెర్రీలు, క్రాన్ బెర్రీలు వంటి పండ్లు రోజూ తినండి. ఎంతో మేలు జరుగుతుంది.
డయాబెటిస్ ఉన్నారు?
టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారు కూడా రెడ్ వైన్ ను తాగొచ్చు. అయితే చాలా పరిమితంగా తాగాలి. వారిలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది రెడ్ వైన్. అంతేకాదు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మధుమేహం ఉన్న వారు రోజుకు అరగ్లాసు మించి తాగకపోవడమే ఉత్తమం
వైన్ చరిత్ర ఇప్పటిది కాదు. ఆరు వేల ఏళ్ల క్రితమే మొదలైంది. అప్పట్లో వైన్ ను రోజూ తాగేవారని చెబుతారు. మంచి నీళ్లలా వైన్ అప్పట్లో పారేదట. ఇళ్లల్లో నిండుగా వైన్ పీపాలు ఉండేవట.అప్పట్లో ఈజిప్షియన్లు దీన్ని ఔషధంలా ఉపయోగించేవారని చెబుతారు చరిత్రకారులు.
Also read: ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తే కంపెనీలకు ఖర్చు తగ్గదా? టీసీఎస్ ఛైర్మన్ తగ్గదని ఎలా తెగేసి చెప్పారు?
Also read: ఇంట్లో బొద్దింకలు, పురుగులు వేధిస్తున్నాయా? ఇలా చేయండి దెబ్బకి పారిపోతాయి