అన్వేషించండి

Dengue: డెంగ్యూతో పోరాడుతున్నారా? ఇంట్లో తయారుచేసిన ఈ పానీయాలు తాగండి

డెంగ్యూ జ్వరం ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

వాతావరణం కాస్త చల్లబడితే చాలు దోమలు రెచ్చిపోతాయి. డెంగ్యూ వంటి  వ్యాధులను సులువుగా వ్యాపించేలా చేస్తాయి. డెంగ్యూ సోకిన తరువాత జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఆ సమయంలో పౌష్టికాహారంతో పాటూ, శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి. ప్రొటీన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. డెంగ్యూ సోకిందంటే గంటల్లో రక్తంలోని ప్లేట్‌లెట్స్ తీవ్రంగా పడిపోతాయి. దీనివల్ల తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, దద్దుర్లు వస్తాయి. మనిషి నీరసించిపోతాడు. ప్లేట్ లెట్స్ మరీ పడిపోతే దాతల నుంచి రక్తాన్ని సేకరించి ఎక్కించాల్సి వస్తుంది. అందుకే డెంగ్యూ సోకాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల కషాయాలు తాగడం ద్వారా ఆ జ్వరంతో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

నీళ్లు
డెంగ్యూ సోకాక నాలుగు లీటర్ల నీళ్లకు తగ్గకుండా తాగాలి. ఆసుపత్రిలో చేరితో వాళ్లే సెలైన్ ఎక్కిస్తారు. ఇంటి దగ్గరే ఉన్నట్టయితే మాత్రం విపరీతంగా నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్ల 

వేప కషాయం 
కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి మరిగించాలి. మరిగించాక ఆ నీటిని వడకట్టి, ఆకులను పారేసి నీటిని తాగేయాలి. ఇలా రోజులో రెండు సార్లు చేయడం వల్ల నొప్పి తగ్గడంతో పాటూ శరీరంలో డీ హైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. 

బొప్పాయి ఆకులు 
బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా, యాంటీ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి రక్తంలో పేట్లు లెట్లు పడిపోకుండా కాపాడతాయి. వాటి సంఖ్యను పెంచుతాయి కూడా. ఇందుకోసం రెండు తాజా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి రసం తీయాలి. రెండు మూడు స్పూను రసానికి, ఒక కప్పు నీళ్లు కలుపుకుని తాగేయాలి. 

కాకర రసం
కాకర కాయను ముక్కలు చేసి జ్యూస్ చేయాలి. ఆ జ్యూస్ లో కాస్త నీరు కలుపుకుని తాగేయాలి. లేదా ఒక గ్లాసు నీటిలో కాకర ముక్కలను ఉడికించి, వడకట్టి ఆ నీటిని తాగేయాలి. 

తులసి
తులసి ఆకులతో చేసిన టీ కూడా ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ కాచేటప్పుడు అందులో తులసి ఆకులను కూడా కలిపి మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగేయాలి. పాలు కలుపుకోకూడదు. లేదా నీటిలో తులసి ఆకులు మరిగించుకుని ఆ నీటిని తాగేసినా చాలు. కావాలంటే ఇందులో కాస్త నిమ్మరసం కలుపుకోవచ్చు. 

మెంతి పొడి
మెంతి పొడిని రాత్రంతా నానబెట్టి, ఉదయం లేచి గ్లాసుడు నీళ్లలో కలుపుకుని తాగేయాలి. రుచి చేదుగానే ఉన్నా డెంగ్యూ నుంచి తేరుకోవడానికి ఇది సహాయపడుతుంది. 

విటమిన్ సి
విటమిన్ సి అధికంగా ఆహారాలు తినడం వల్ల రోగనిరోధకశక్తిప పెరుగుతుంది. బొప్పాయి, ఉసిరి, నారింజ, పసుపు, చికెన్ సూప్ వంటివి తరచూ తింటూ ఉండాలి. 

Also read: పురుషుల కంటే మహిళలకే నిద్ర ఎక్కువ అవసరం, ఎందుకో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget