అన్వేషించండి

Blood from Tree: వీడియో - ఓ మై గాడ్, ఈ చెట్టు నుంచి రక్తం కారుతోంది, మీ కళ్లను మీరే నమ్మలేరు!

ఈ చెట్టును కోస్తే రక్తం వస్తుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే మీరు యెమెన్‌లోని ఈ దీవిని సందర్శించాల్సిందే.

దైనా చెట్టు లేదా మొక్కను కోస్తే తెల్లని పదార్థం లేదా నీరు, జిగురులాంటి పదార్థం వస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చెట్టును కొడితే మాత్రం రక్తం.. ప్రవాహంలా కారిపోతోంది. అదేం చిత్రం.. అలా ఎందుకు జరుగుతోందనేగా మీ సందేహం? అయితే, మీరు ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ గురించి తెలుసుకోవల్సిందే. 

ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ నుంచి రక్తం కారడాన్ని చూసి చాలామంది.. దాన్ని దెయ్యాల చెట్టుగా భావించేవారు. ఆ చెట్టుకు ముట్టుకుంటే చనిపోతారని చెప్పేవారు. దీంతో చాలామంది ఆ చెట్టును ముట్టుకోలేదు. అయితే, మరికొందరు మాత్రం అలాంటి చెట్లు తమ ప్రాంతంలో ఉండటం ప్రమాదకరమనే ప్రచారం చేశారు. దీంతో చాలామంది ఆ చెట్లను కొట్టేశారు. ఫలితంగా ఆ చెట్లు అరుదైన వృక్ష జాతుల్లో ఒకటిగా మిగిలిపోయాయి. 

అది రక్తమేనా?: ఎర్రగా ఉండే ద్రవాలన్నీ రక్తం కాదనే సంగతి మనకు తెలిసిందే. కానీ, ఆ చెట్టు నుంచి వచ్చే ఎర్రని ద్రవాన్ని చూస్తే మీరు అదే అనుకుంటారు. ఓ మై గాడ్ చెట్టేంటి రక్త కన్నీరు కారుస్తుందని అంటారు. వాస్తవానికి ఆ చెట్టు నుంచి వచ్చేది రక్తం కాదు. అది ఆ చెట్టులో ఉండే ఎర్రటి జిగురు. అయితే, అది ఎక్కువ పలుచగా ఉండటం వల్ల.. కత్తిరించగానే రక్తంలా కారుతుంది. శాస్త్రీయంగా Dracaena cinnabari అని పిలుస్తారు. ఈ చెట్టు అరేబియా సముద్రంలో యెమెన్ తీరంలో సోకోట్రా ద్వీపసమూహంలో మాత్రమే పెరుగుతుంది. 

ఔషద గుణాలు పుష్కలం: ‘డ్రాగన్ బ్లడ్ ట్రీ’లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయట. పూర్వికులు దీన్ని ‘సిన్నబార్’ అని పిలిచేవారట. క్రీస్తు శకం 60వ శతాబ్దం నుంచి ఈ చెట్టుతో అనేక వ్యాపారాలు చేసేవారట. ఈ చెట్టు నుంచి వచ్చే సహజమైన ఎరుపు జిగురును లిప్‌స్టిక్, వయోలిన్ వార్నిష్‌ల కోసం ఉపయోగించేవారు. ఈ చెట్టు 18 మీటర్లు (60 అడుగులు) కంటే ఎక్కువ పొడవు, 6 మీటర్లు (20 అడుగులు) వెడల్పుతో పెరుగుతుంది. ఇది 650 సంవత్సరాల వరకు జీవించగలదు. డ్రాగన్ చెట్ల కొమ్మలు ఒక పెద్ద పుట్టగొడుగు లేదా గాలి గొడుకు తరహాలో ఉంటాయి. 

రూపాన్ని కోల్పోతున్న చెట్లు: ఈ చెట్టు నుంచి విడుదలయ్యే ఎరుపు రసాన్ని లేదా రెసిన్‌ను డ్రాగన్ రక్తం అని పిలుస్తారు. మీరు ఈ చెట్టును కత్తిరించినట్లయితే ఎర్రటి రెసిన్ బయటకు వస్తుంది. ఇది రక్తస్రావం తరహాలోనే ఉంటుంది. అంతేకాదు ఈ చెట్టుకు కాసే పండ్లు కూడా చాలా విలువైనవి. వాటిని ‘డ్రాగన్ బ్లడ్ ట్రీ బెర్రీస్’ అంటారు. పశువులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ బెర్రీలు ఉపయోగపడతాయట. ప్రస్తుతం ఈ జాతి చెట్లు ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఈ చెట్లు క్రమేనా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్న చెట్లు గొడుగు ఆకారంలో ఉండటం లేదు.  

అంతరించి పోయే స్థితిలో..: 2008లో ఈ చెట్లు పెరుగుతున్న సోకోత్రా ద్వీపసమూహ ప్రాంతాన్ని యునెస్కో  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. కానీ, ఈ ప్రాంతంలోని చెట్లు దాదాపు ఎండిపోతున్న పరిస్థితిలో ఉన్నాయి. గ్లోబల్ ట్రీస్ నివేదికల ప్రకారం.. డ్రాగన్ బ్లడ్ చెట్టు 2080 నాటికి 45% వరకు నశించిపోయే అవకాశం ఉంది. స్కుండ్ నేచర్ అభయారణ్యం విస్తరించినట్లయితే ఈ చెట్లు మరింత కాలం జీవించే అవకాశం ఉంది. లేకపోతే ఈ రక్తం కారే చెట్టు గురించి పుస్తకాల్లో చదువుకోవలసి వస్తుంది. 

Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Andhra Pradesh Group 2 Exam: 23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
23న ఏపీలో గ్రూప్‌ 2 - హైదరాబాద్‌లో అభ్యర్థుల ధర్నా- మద్దతు ప్రకటించిన షర్మిల  
Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టినాదిరో' సాంగ్ ప్రోమో రిలీజ్ - పవర్ స్టార్‌ ఫ్యాన్స్ మనసులు కొల్లగొట్టేస్తుందిగా..
Sourav Ganguly Biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..
Embed widget