News
News
X

Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్

Dogfishing : డేటింగ్‌ విషయాల్లో పెట్ డాగ్స్‌ ప్రభావం ఉంటోందని తాజా పరిశోధన వెలుగులోకి వచ్చింది. చిన్న కుక్కపిల్లతో కూడిన ఫోటోలతో ఉన్న ప్రొఫైల్స్‌ పట్ల అమ్మాయిలు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారని పరిశోధనలో తేలింది.

FOLLOW US: 

Dogfishing : అబ్బాయిలకు తగిన జంటను వెతకడంలో కుక్కపిల్లలు కూడా సాయం చేయగలవని ఓ పరిశోధనలో తేలింది. డేటింగ్ యాప్‌లలో అమ్మాయిలను పడేసే చిట్కాల కోసం వెతికే సింగిల్స్‌ను స్పెయిన్‌లోని జేన్ యూనివర్సిటీ పరిశోధన ఆకట్టుకుంటోంది. చిన్న కుక్కపిల్లతో కూడిన ఫోటోలతో ఉన్న ప్రొఫైల్స్‌ పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులు కావడం, సంప్రదించడం జరుగుతోందని ఆ సంస్థ గుర్తించింది. సుమారు 3వందల మంది కాలేజ్ అమ్మాయిల అభిప్రాయాలను విశ్లేషించిన అనంతరం... పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. పరిశోధనలో భాగంగా కుక్కపిల్లతో కూడిన, కుక్కపిల్లతో లేని అబ్బాయిల ఫోటోలను అమ్మాయిలకు చూపించారు. ఈ విధంగా లెక్కలేనన్ని ఫోటోలు చూపించిన తర్వాత,   కుక్కపిల్లతో కూడిన అబ్బాయిల విషయంలో భయపడాల్సిన అవసరం పెద్దగా లేదనే భావన అమ్మాయిల్లో కనిపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. 

డాగ్ ఫిషింగ్ 

అయితే అబ్బాయిలతో పాటు ఉండే కుక్క సైజు కూడా ఇందులో ముఖ్యమైన విషయం. అబ్బాయిలు చిన్న కుక్కను కలిగి ఉన్నపుడు మాత్రమే వారిపట్ల ఎక్కువ సానుకూల భావన ఏర్పడుతోందని గుర్తించారు. డాగ్‌ ఫిషింగ్ అనే అంశం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. డేటింగ్ యాప్‌లలో అబ్బాయిల కోసం వెతికేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఓ యువతి హెచ్చరించింది. వేరేవాళ్ల కుక్కపిల్లతో ఫోటో దిగి కొంతమంది ఏ విధంగా తనను మోసం చేసేందుకు ప్రయత్నించారనేది ఆమె వివరించింది. కుక్కపిల్లను ఉపయోగించుకొని అమ్మాయిలను పడేయాలనే ప్రయత్నాన్ని డాగ్‌ ఫిషింగ్‌గా పేర్కొంది. ఈ క్రమంలోనే డేటింగ్‌ విషయాల్లో పెట్ డాగ్స్‌ ప్రభావంపై తాజా పరిశోధన వెలుగులోకి వచ్చింది.

Also read: చూయింగ్ గమ్ నములుతూ నెలకు రూ. 67,000 సంపాదిస్తోన్న యువతి

Also read: గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? అండం విడుదలయ్యే రోజేదో ఇలా తెలుసుకుంటే, గర్భం ధరించడం సులువు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 15 Aug 2022 10:32 PM (IST) Tags: Dating Dogfishing Dog pics Dating trend

సంబంధిత కథనాలు

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్యలు తప్పవు!

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

Covid-19: కోవిడ్-19, డెంగ్యూ లక్షణాల మధ్య తేడాని తెలుసుకోవడం ఎలా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

ఈ ఆహారాలు తరచూ తిన్నారో, త్వరగా ముసలివాళ్లయిపోతారు జాగ్రత్త

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

World’s Smallest Snake: ప్రపంచంలోనే అతి చిన్న పాము, దీన్ని వానపాము అని ముట్టుకుంటే..

టాప్ స్టోరీస్

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ