News
News
X

అయోడిన్ లోపం ఉంటే గర్భం ధరించడం కష్టమవుతుందా?

ఆరోగ్యానికి అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ లోపం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.

FOLLOW US: 
Share:

సంపూర్ణ ఆరోగ్యానికి అయోడిన్ తీసుకోవడం చాలా అవసరం.అయోడిన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే అయోడిన్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఉప్పు. ఉప్పు తగ్గించమని ఎప్పట్నించో ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు అధికంగా తినడం వల్ల హైబీపీ వంటి సమస్యలు వస్తాయని, హైబీపీ వల్ల ప్రధాన అవయవాలు దెబ్బతింటాయని చెబుతున్నారు వైద్యులు. ఉప్పు తగ్గిస్తే మరి అయోడిన్ సంగతి? అప్పుడు అయోడిన్ లోపం వస్తుంది కదా? అని ఎంతో మంది సందేహం. అయోడిన్ లోపం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు అయోడిన్ మనకు ఎందుకు అత్యవసరమో తెలుసుకోవాలి. 

అయోడిన్ లోపిస్తే...
హార్మోన్ల పనితీరుకు థైరాయిడ్ చాలా ముఖ్యం. థైరాయిడ్ పనితీరు బావుండాలంటే అయోడిన్ అనే సూక్ష్మ పోషకం అవసరం. అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సరిగా పనిచేయలేదు. దీనివల్ల హైపో థైరాయిడిజం అనే సమస్య మొదలవుతుంది. ఈ సమస్య బారిన పడిన స్త్రీలు గర్భం ధరించడం కష్టం అవుతుంది. హైపో థైరాయిడిజం సమస్యకు రోజూ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అయోడిన్ లోపిస్తే పిల్లలు కనడం కష్టంగా మారుతుంది. 

రోజుకెంత అవసరం?
గర్భం ధరించే వయసులో ఉన్న స్త్రీలకు రోజుకు 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భం ధరించిన స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు అయోడిన్ ఎక్కువ అవసరం. ఎవరైతే రోజుకు 50 మైక్రో గ్రాముల కన్నా తక్కువ తీసుకుంటారో వారు అయోడిన్ లోపం బారిన పడతారు. అంటే పిల్లలు కలగడం కష్టంగా మారుతుంది. ఆహారం ద్వారా తీసుకున్న అయోడిన్... గర్భాశయంలోని అండాశయాలు, ఎండోమెట్రియం పొర గ్రహిస్తాయని ఓ కొత్త పరిశోధన చెప్పింది. పరోక్షంగా అండోత్సర్గాన్ని ప్రోత్సహిస్తుంది అయోడిన్. 

పురుషుల్లో కూడా...
థైరాయిడ్ సమస్య అనగానే అందరూ చూపు స్త్రీలపైనే పడుతుంది కానీ, పురుషులకు కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం పురుషులలో అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది.  దీనివల్ల గర్భం ధరించడం కష్టమవుతుంది. అయోడిన్ అధికంగా తీసుకుంటే మాత్రం అంగస్తంభన , స్పెర్మాటోజెనిక్ అసాధారణతలు, స్పెర్మ్ చలనశీలత సమస్యలు, తక్కువ స్పెర్మ్ చలనశీలత వంటివి కలుగుతాయి. 

ఏం తినాలి?
కేవలం ఉప్పు ద్వారానే అయోడిన్ వస్తుందనుకోకండి. అధికంగా ఉప్పు తింటే ఇతర ప్రాణాంతక సమస్యలు రావచ్చు. 
1. సముద్రపు ఆహారం (చేపలు, రొయ్యలు)
2. గుడ్లు
3. పాలు, చీజ్, పెరుగు
4. చికెన్

వీటిని తరచూ తింటే అయోడిన్ లోపం రాకుండా ఉంటుంది. 

Also read: మహిళలూ జాగ్రత్త, శానిటరీ పాడ్స్‌ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 26 Nov 2022 08:39 AM (IST) Tags: Iodine deficiency Iodine Food Iodine rice foods Iodine and conceive

సంబంధిత కథనాలు

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

Relationshipe: సహోద్యోగులతో స్నేహబంధం బలపడాలంటే ఐదు మార్గాలు ఇవిగో

టాప్ స్టోరీస్

Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?