News
News
X

Intestine Transplant: ప్రపంచంలోనే తొలిసారిగా పేగు మార్పిడి చేసిన వైద్యులు, అది కూడా 13 నెలల వయసు పాపకి

ప్రపంచంలో తొలిసారి ఒక పాపకి పేగు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి చరిత్ర సృష్టించారు వైద్యులు.

FOLLOW US: 
 
వైద్య చరిత్రలో ఇదొక అద్భుతం. ఇంతవరకు కళ్లు, గుండె, కాలేయం వంటివి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు వైద్యులు. కానీ తొలిసారి పేగులు చేశారు. అది కూడా ఏడాది వయసున్న చిన్నారిలో. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అనే చెప్పుకోవాలి. స్పానిష్ వైద్యులు ఈ అద్భుతమైన అవయవ మార్పిడిని చేశారు. ఈ పాప పేగులను పొందిన తొలి అవయవ గ్రహీతగా రికార్డులకెక్కింది. ఈ చిన్నారి పేరు ఎమ్మా. ఈమెకు గుండె వైఫల్యంతో మరణించిన ఒక దాత నుంచి పేగులను తీసి ఆమె పొట్టలో అమర్చారు. ప్రస్తుతం పాప బాగా కోలుకుంటోంది. ఆమెకు 13 నెలల వయసులో ఈ అవయవ మార్పిడి చికిత్స జరిగింది. ఇప్పుడు ఆమెకు 17 నెలల వయసు. ఇంతకాలం ఆమెను అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఇక బతుకుతుందన్న నమ్మకం రావడంతో ఈ అవయవ మార్పిడి గురించి ప్రపంచానికి తెలియజేశారు. 

అసలేమైంది? 
ఎమ్మా పాప పేగు సమస్యలతో జన్మించింది. చాలా చిన్న పేగులు ఉండడంతో చాలా ఇబ్బందులు పడింది.ఆ పేగులు సరిగా పనిచేయక విఫలం అయ్యాయి. దాంతో ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆమెను ఏడాది వయసు వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ వయసు వచ్చాక అవయవమార్పిడి చేశారు. కొత్త పేగులతో పాటూ ఆమెక కాలేయం, ప్లీహం, ప్యాంక్రియాస్ కూడా కొత్తవి పెట్టారు.  ఈ చిన్నారి బతుకుతుందని వైద్యులు కూడా అనుకోలేదు. కానీ సర్జరీ అయి తేరుకున్నాక సాధారణ జీవితం గడపసాగింది. 

పేగు మార్పిడి ఎప్పుడు అవసరం?
చిన్న పేగు లేదా పెద్ద పేగు మార్పిడి ఎప్పుడు అవసరం పడుతుందంటే అవి తమ పనిని సక్రమంగా పనిచేయనప్పుడు, లేక ఇన్ఫెక్షన్‌తో పాడైనప్పుడు. పెద్ద వాళ్ల చిన్న పేగులోని కొంత భాగాన్ని తీసి పిల్లలకు అమర్చవచ్చు. అదే సమయంలో ఇతర అవయవాల మార్పిడి కూడా చేయవచ్చు. ఎమ్మాకు అలాగే చేశారు. పిల్లలు పేగు వ్యాధితో బాధపడుతున్నప్పుడు వారికి సిరల ద్వారా పోషకాహారాన్ని అందిస్తారు వైద్యులు. దీన్నే టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ (TPN) అంటారు. కానీ TPN చాలా కాలం పాటు చేయవలసి వస్తే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.అందుకే దీన్ని ఎక్కువ కాలం పాటూ కొనసాగించలేం. ఎమ్మా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అందుకే వైద్యులు పేగు మార్పిడిని ఎంచుకున్నారు. చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. 

ఎమ్మా తల్లిదండ్రులు వైద్యులకు, పేగును ఇచ్చిన దాత కుటుంబానికి ధన్యవాదాలు చెబుతూనే ఉన్నారు. అవయవదానంతో ఓ నిండు ప్రాణం నిలబడింది.  చనిపోయాక మనిషి తన శరీరంలో ఉండే  200 అవయవాలు, కణజాలాలను దానం చేయవచ్చు. వాటితో కొన్ని నిండుప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి ఆరు నుంచి ఏడుగురికి ప్రాణం పోయగలడు. అందుకే అవయవ దానంపై అవగాహన పెంచుకోవడం అవసరం. 

News Reels

Also read: ఎక్కువ సమయంపాటూ కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ చూస్తే సైట్ వస్తుందా?

Also read: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

Published at : 13 Oct 2022 11:12 AM (IST) Tags: organ donation world's first intestinal transplant Spanish Baby Emma Emma Intestinal

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam