Secrets: అన్ని విషయాలు అందరితో చెప్పేయకండి... వీటిని రహస్యంగా ఉంచండి
కొందరు భోళాగా ఉంటారు. తమ గురించి అన్ని విషయాలు బయటకు చెప్పేసి, ఆ తరువాత ఇబ్బంది పడుతుంటారు.
మీకు సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకోవడం మంచి పద్ధతి కాదు. మీ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి రహస్యంగా ఉంచాలి. పనిచేసే చోట, నివాసముండే ప్రాంతంలో చాలా మంది స్నేహితులుగా దగ్గరవుతారు. వారితో ముఖ్యంగా కింద చెప్పిన విషయాలను పంచుకోకూడదు.
మీ జీవితభాగస్వామి అలవాట్లు
చాలా మంది తమ స్నేహితులతో భర్త లేదా భార్య గురించి మాట్లాడుతుంటారు. వారికున్న అలవాట్లు, ఫోబియాల గురించి చెబుతారు. అవి మీరు బయటి వారితో పంచుకోకూడదు. అవి మీ ఇద్దరి మధ్యే రహస్యంగా ఉండాలి.
మీ లక్ష్యాలు
మనలో చాలా మందికి కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉంటాయి. వాటిని సాధించే దిశగా పనిచేయాలే తప్ప, వాటి గురించి అందరితోనూ పంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. అది కాకుండా మీరు సాధించలేని సమయంలో ఎదుటివారే మిమ్మల్ని ప్రశ్నించడమో, సాధించలేకపోయారని ఎగతాళి చేయడమో జరుగుతుంది.
సాయం చేస్తే చెప్పకండి
మీలో ఉన్న దాతృత్వగుణం గురించి కూడా ఇతరులతో పంచుకోవద్దు. మీరు చెప్పినది విన్న వారు మరొకరితో ఆ విషయాన్ని చెప్పి విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇతరులకు మీ గురించి మాట్లాడే ఛాన్సును ఇవ్వకండి.
బ్యాంకు బ్యాలెన్స్
మీ జీత భత్యాలు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తి వివరాల్లాంటివి పంచుకోవద్దు. స్నేహానికి, పరిచయానికి వాటితో పనిలేదు.
మీ బలహీనత
ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో బలహీనత ఉంటుంది. మీ వీక్‌నెస్ గురించి ఇతరులకు చెప్పుకుంటే మీరింకా బలహీనంగా తయారవుతారు. బలహీనత చిన్నదైనా, పెద్దదైనా దాన్ని మీలోనే దాచుకోండి. లేదా ఇంట్లోని భర్త లేదా భార్యతో, తల్లిదండ్రులతో, అక్కాచెలెళ్లతో షేర్ చేసుకోండి.
ఫ్యామిలీ గొడవలు
ప్రతి ఇంట్లోను గొడవలు జరగడం సహజం. మీరు వాటి వల్ల బాగా ఎఫెక్ట్ అయితే థెరపిస్టుతో మాట్లాడండి. లేదా మీ ఆప్త మిత్రుడుతోనో చర్చించండి. అంతేకాదు పనిచేసే చోట, నివసించే చోట వారితో పంచుకుంటే... ఆ విషయాలు ఒకరి నుంచి ఒకరికి ప్రచారం జరిగిపోతాయి. ఇంటి విషయాలు రచ్చకీడ్చుకుంటే ఇంకా సమస్యలు పెరుగుతాయి.
Read Also: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...
Read Also: కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు
Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి
Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి