Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
పిల్లలతో ఎలా పెంచాలో తెలుసుకున్నాకే వారిని కనమంటారు పెద్దలు. సరిగా పెంచలేకపోతే వారి దారి మారిపోవచ్చు.
పేరెంటింగ్ ఒక కళ. ఆ కళలో నిష్ణాతులు కావడం కష్టం, నిత్యం తల్లిదండ్రులు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలి. పిల్లలను పెంచాలంటే ఎంతో ఓపిక కావాలి. అంతకుమించి ప్రేమ ఉండాలి. వారిని పెంచే క్రమంలో రోజుకో అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది. వాటిని దాటుకుంటూ వెళ్లాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ముందుకు వెళ్లే కాలం ఇది. అవసరాలు తీరాలంటే ఇద్దరి సంపాదన అవసరం. ఉదయమంతా కష్టపడి సాయంత్ర ఇళ్లకు చేరేసరికి పిల్లల అల్లరి మొదలవుతుంది. అమ్మానాన్ని ఇళ్లకు చేరిన ఆనందంలో వారు మరింత అరుస్తారు.నవ్వుతారు, మీ పక్కనే కూర్చోవాలని, మీరు వాళ్లని గారాబం చేయాలని అనుకుంటారు. ఒక్కోసారి పేరెంట్స్ కి ఓపిక లేక నీరసంగా కూర్చుండిపోతారు. ఆ సమయంలో వారు చేసిన అల్లరి చాలా చికాకుగా, విసుగ్గా అనిపిస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వారిని కొట్టడం, తిట్టడం చేస్తుంటారు. కానీ కొట్టినా, తిట్టినా పదేళ్ల లోపు పిల్లలు మీరు నవ్వగానే పరుగెత్తుకుని వస్తారు. తిట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మాటలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆ మాటలు వద్దు
మీరెంతగా కోప్పడినా వారిని తిట్టేటప్పుడు కొన్ని రకాల పదాలు మాట్లాడకండి. అవి వారి మనసులో ఉండిపోతాయి. మీపైనే కాదు సమాజంపైనే ద్వేషభావాన్ని పెంచుతాయి.‘నువ్వుంటే మాకు ఇష్టం లేదు’, ‘నువ్వు పుట్టాలని నేను కోరుకోలేదు’, ‘ప్లానింగ్ లేకుండా పుట్టావు’, ‘ఎందుకు పుట్టావు మాకు’... ఇలాంటి మాటలు వారు పదే పదే వింటే చాలా బాధపడతారు. అంతేకాదు మనసులో కుంగుబాటుకు గురవుతారు. నవ్వుతూ కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దని చెబుతున్నారు చైల్ట్ సైకాలజిస్టులు.
డిప్రెషన్ రావచ్చు
పిల్లలకు తాము ఒంటరి అనే భావన మనసులోకి రానివ్వకూడదు. నువ్వు వద్దు, నువ్వు పో, నువ్వు ఇలా, నీ వల్లే మా జీవితం ఇలా అయింది... ఇలాంటి మాటలు వారిలో నిరాశను పెంచేస్తాయి. డిప్రెషన్ బారిన పడేలా చేస్తాయి. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరి గురించే ఇలా మాట్లాడడం కూడా వారిలో ద్వేషభావం, కోపం, నిరాశ, మానసిక ఆందోళనలను పెంచుతాయి.
Also read: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది