Arthritis: కీళ్లనొప్పులు వేధిస్తుంటే ఈ ఆహారాలు తినకండి, నొప్పులు ఎక్కువవుతాయి
ఆర్ధరైటిస్‌తో బాధపడే వారిలో చాలా మందికి ఏం తినాలో, తినకూడదో అన్న అవగాహన తక్కువగా ఉంది.
చలికాలంలో ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్నవారికి నొప్పులు మరింత ఎక్కువవుతాయి. వారికి కీళ్ల నొప్పులు, వాపు అధికంగా ఉంటుంది. వాటి పరిస్థితిని బట్టి ఆస్టియో ఆర్ధరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్ధరైటిస్ అనే విషయాన్ని వైద్యులు చెబుతారు. ఈ రెండూ స్థితులు దాదాపు ఒకేలాంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఆర్ధరైటిస్ రావడానికి సరైన కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ ఆహారం కూడా ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నారు వైద్యులు. నొప్పి, వాపు తీవ్రంగా మారడం లేదా తగ్గడం అనేది తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని ఆహారాలు తినడం కీళ్లనొప్పులు, వాపులు మరింత పెరిగే అవకాశం ఉంది.
డీప్‌గా వేయించిన ఆహారాలు
అమెరికాకు చెందిన మాయో క్లినిక్ పరిశోధన ప్రకారం రుమటాయిట్ ఆర్ధరైటిస్‌కు పొట్టలోని చెడు బ్యాక్టిరియాలకు సంబంధం ఉంది. కాబట్టి మంచి బ్యాక్టిరియా అధికంగా ఉండాలి, కానీ చెడు బ్యాక్టిరియా పెరిగిందంటే నొప్పులు అధికమవుతాయి. అందుకే సంతృప్త, ట్రాన్స్‌ఫ్యాట్‌లు అధికంగా ఉన్న ఆహారాలను దూరం పెట్టాలి. ఇవి చెడు బ్యాక్టిరియాను పెంచుతాయి.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఉన్న పానీయాలు ఏ రూపంలో ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచివి కావు. యాంటీఆక్సిడెంట్లు ఉన్న వైన్ మాత్రం మితంగా తాగవచ్చు. బీరు, వోడ్కా, బ్రాందీ లాంటి వాటిని దూరం పెట్టాలి. ఇందులో ఉండే యూరిక్ ఆసిడ్ వల్ల కీళ్ల నొప్పులు మరింత తీవ్రంగా మారుతాయి. తియ్యటి సోడాలు కూడా తాగకూడదు.
ప్రాసెస్డ్ ఆహారం
కీళ్లనొప్పుల కోసం అధికంగా శుధ్ది చేసిన ఆహారాన్ని తినకూడదు. పంచదారతో చేసిన పదార్థాలను పక్కన పెట్టాలి. పంచదారాకు బదులు బెల్లంతో చేసినవి తినవచ్చు. పంచదారను చాలా ప్రాసెస్ చేసి అమ్ముతారు. దీని తినడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
ఈ కూరగాయలు కూడా...
చలి వాతావరణంలోనే ఆర్ధరైటిస్ చాలా బాధపడతాయి. కాబట్టి టమోటాలు, మిరియాలు, బంగాళాదుంపలు, వంకాయలతో వంటి కూరలను తక్కువగా తినాలి. ఇవి మంట లక్షణాలను పెంచుతాయి. అయితే పోషకాహారలోపం తలెత్తకుండా వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు కూడా పొందాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఒక్కరాత్రిలో బరువు పెరిగినట్టు అనిపిస్తోందా? ఇవి కారణాలు కావచ్చు
Also read: రూ.500 పెట్టి కొన్న పాత కుర్చీ... వేలంలో రూ.16 లక్షలకు అమ్ముడుపోయింది, ఇదీ కదా అదృష్టమంటే