Wooden Chair: రూ.500 పెట్టి కొన్న పాత కుర్చీ... వేలంలో రూ.16 లక్షలకు అమ్ముడుపోయింది, ఇదీ కదా అదృష్టమంటే

అనుకోకుండా చేసిన పనులు ఒక్కోసారి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

FOLLOW US: 

పాత సామానుల దుకాణంలో పడి ఉన్న చెక్కకుర్చీ ఓ మహిళకు నచ్చింది. ఎవరో దాన్ని చెత్తగా భావించి పడేశారు. ఆ కుర్చీని ఆ మహిళ 5 పౌండ్లకు  ఆ కుర్చీని కొని ఇంట్లో పెట్టుకుంది. నిజానికి ఆ కుర్చీ విలువ ఆమెకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ కుర్చీ వేలంలో 16, 250 పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే మన రూపాయల్లో రూ.16 లక్షల రూపాయలు. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది. 

అనుకోకుండా ఆమె ఒక వ్యక్తిని కలిసింది. అతను పాత వస్తువులకు విలువ కట్టి ఎంతకు అమ్మచ్చో చెప్పే వ్యక్తి. ఆయనకు ఈ కుర్చీని చూపించింది. దాన్ని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. అది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉన్న అవాంట్ గార్డ్ ఆర్ట్ స్కూల్‌కు చెందినదని చెప్పాడు. దాని విలువ ఎక్కువగానే ఉంటుందని తెలిపాడు. ఆ కుర్చీని 1902లో ప్రముఖ చిత్రకారుడు కోలోమన్ మోసెర్ రూపొందించినట్టు తెలిపారు. మోసెర్ వియన్నా ఆస్ట్రియాలో ఓ ఉద్యమానికి చెందిన కళాకారుడు. అందరికీ సుపరిచతుడు. 

ఈ కుర్చీ 18వ శతాబ్ధపు పాపులర్ డిజైన్ తో తయారుచేశారు. కుర్చీ వెనుక భాగం నిచ్చెనను గుర్తుకు తెస్తుంది. బ్రిటన్లోనే ఈ కుర్చీని వేలానికి పెట్టింది ఆ మహిళ. ఆస్ట్రియాకు చెందిన ఒక డీలర్ దీన్ని రూ.16 లక్షలకు కొనుగోలు చేశాడు. కనీసం కుర్చీని నేరుగా చూడకుండా ఫోటో చూసే, ఫోనులోనే వేలం పాడాడు. ఆస్ట్రియాలో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడ అధిక ధరకు దీన్ని అమ్మే అవకాశం ఉంది. కానీ ఆస్ట్రియా నుంచి ఈ ఆసనం బ్రటన్‌కు ఎలా చేరిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కొనేముందు కొనుగోలుదారుడు పరిశోధన చేశాకే దాన్ని కొన్నట్టు సమాచారం. 

పాత వస్తువులను వేలం వేసే స్వోర్డర్స్ సంస్థలో నిపుణుడైన జాన్ బ్లాక్ తొలిగా ఈ కుర్చీకి విలువ కట్టాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ కుర్చీ అమ్ముడైన ధర మాకు ఆనందాన్ని కలిగించింది. ఇది తిరిగి ఆస్ట్రియాకు తిరిగి చేరడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ‘1903లో ఆస్ట్రియాలోని ఒక మ్యాగజైన్ ఈ కుర్చీతో సహాతో కొన్ని కొత్త డిజైన్లను ప్రచురించింది. ఈ కుర్చీని 1904లో ఆధునిక ఆస్ట్రియన్ ఫర్నిచర్‌కు అంకితం చేసినట్టు యూకేలోని ఓ పత్రికలో కథనం కూడా వచ్చింది’అని వివరించారు. 

Also read: ఈ పిల్లాడు వెరీ రిచ్... తొమ్మిదేళ్లకే పెద్ద బంగ్లా, సొంత విమానం, సూపర్ కార్లు

Also read: ఊపిరితిత్తుల క్యాన్సర్ కొత్త లక్షణం... దగ్గుతో పాటూ గొంతులో కితకితలు, ఇలా అనిపిస్తే చెక్ చేయించుకోవాల్సిందే

Published at : 28 Jan 2022 08:13 AM (IST) Tags: Auction Old chair Austrian Chair Auction in Britain

సంబంధిత కథనాలు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Skincare Myths: అబ్బాయిలూ ఇది విన్నారా, మీకూ స్కిన్‌కేర్ అవసరమేనట-లేదంటే 30 ఏళ్లకే ముసలోళ్లైపోతారు

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Swallowing Mucus: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

టాప్ స్టోరీస్

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Tax on Petrol, Diesel: పెట్రోల్‌, డీజిల్‌పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Farmer ABV : చెప్పినట్లే వ్యవసాయం - సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !

Farmer ABV  : చెప్పినట్లే వ్యవసాయం  -  సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!