Shocking: ఈ పిల్లాడు వెరీ రిచ్... తొమ్మిదేళ్లకే పెద్ద బంగ్లా, సొంత విమానం, సూపర్ కార్లు
తొమ్మిదేళ్ల పిల్లాడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు. కారణం అతని రిచీ రిచ్ లైఫ్ స్టైల్.
మొహమ్మద్ అవల్ ముస్తఫా... ఈ పిల్లాడికి తొమ్మిదేళ్ల వయసు. అతని లైఫ్ స్టైల్ చూస్తే ఎవరికైనా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆరేళ్ల వయసుకే ఇతని పేరున పెద్ద బంగ్లాను కొన్నాడు తండ్రి. అంతేకాదు బోలెడన్నీ సూపర్ కార్లు కూడా ఉన్నాయి. అతడి కోసం ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఎక్కడికైనా వెళ్లాలంటే ఆ ప్రైవేట్ జెట్ లోనే వెళతాడు ఈ బుడ్డోడు. ఇవన్నీ ఇతగాడు ఏం ఉద్యోగం చేసి సంపాదించాడు అనుకుంటున్నారా? అతని తండ్రి పెద్ద మల్టీ మిలియనీర్. వీళ్లది నైజీరియా. పేద దేశమే అయినా ఇలాంటి మిలియనీర్లు అక్కడా ఉన్నారు. అతని తండ్రి పేరు ఇస్మాలియా ముస్తఫా. ఇతడిని అక్కడ ముద్దుగా మోంఫా అని పిలుస్తారు. అతని కొడుకు మోంఫా జూనియర్ అంటారు.
తండ్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఇక కొడుక్కి 26వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంతవరకు కేవలం తొమ్మిది పోస్టులే పెట్టినప్పటికీ అతడికి వేల మంది ఫాలోవర్లు వచ్చారు. అతడి తండ్రి పెట్టే పోస్టులను బట్టి తరచూ నైజీరియా నుంచి దుబాయ్ దేశాలకు ప్రయాణం చేస్తూ ఉంటాడని తెలుస్తోంది. చేతిలో కట్టల కొద్దీ డబ్బుతో ఫోటోలు దిగడం, పెద్ద హోటళ్లలో బస చేయడం వంటివి చేస్తారు. సూపర్ కార్లను డైవ్ చేయడం కూడా వారికి చాలా ఇష్టం.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also read: ఆయన 129 మంది పిల్లలకు తండ్రి... ఉచిత వీర్యదాత, ఫేస్‌బుక్‌లో వినూత్న సేవ