Tips to keep your Gut healthy : దీపావళి సమయంలో గట్ హెల్త్‌ని ఇలా కాపాడుకోండి.. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు రాకూడదంటే
Healthy Gut : పండుగ సమయంలో లేదా ఫెస్టివల్ తర్వాత చాలామందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. మరి గట్ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. నిపుణుల సలహాలు ఏంటో చూసేద్దాం.
Gut Healthy tips During Festival Season : దీపావళి 2024 (Diwali 2024) వచ్చేసింది. ఈ సమయంలో పిండి వంటలు, స్వీట్లకు ఎలాంటి కొదువ ఉండదు. ఇంట్లో వండేవి మాత్రమే కాకుండా.. బయట గిఫ్ట్‌గా వచ్చే స్వీట్లు, బంధువుల ఇంటికి వెళ్తే వారు పెట్టే పిండివంటలు ఇలా ఎన్నో ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. మీరు డైట్ చేసినా.. కళ్లముందు కనిపిస్తూ నోరూరిస్తూ ఉంటాయి. పైగా ఇంట్లోవాళ్లు కూడా తినేవరకు ఊరుకోరు. ఆ సమయంలో తిన్నది ఎక్కువై జీర్ణ సమస్యలు రావొచ్చు. మరి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీటిని దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
హైడ్రేషన్..
వివిధ పనుల్లో పడి చాలామంది నీటిని ఇగ్నోర్ చేస్తారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల వివిధ సమస్యలతో పాటు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అందుకే కచ్చితంగా నీటిని లేదా కొబ్బరి నీళ్లు, హెల్తీ జ్యూస్‌లు తాగితే మంచిది. పైగా ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. కాబట్టి మీ ముందు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా.. తక్కువ మోతాదులో తీసుకుంటారు. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి.
నిద్ర..
సరైన నిద్ర లేకుంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. పండుగల సమయంలో బంధువులు, పనులతో లేట్‌గా పడుకుంటారు. ఉదయాన్నే త్వరగా లేస్తారు. దీనివల్ల సరైన నిద్ర ఉండదు. సరైన నిద్ర లేకుంటే ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి మెరుగైన నిద్ర ఉండేలా చూసుకోండి. లేదంటే వీలు చిక్కినప్పుడు రెస్ట్ తీసుకోండి.
టైమ్‌కి తినండి..
పండుగల సమయంలో చేసే మరో తప్పు ఏంటంటే సమయానికి తినకపోవడం. కొందరు పూజలు, అన్ని పనులు అయ్యాక తింటారు. మరికొందరు తినడం మానేస్తారు. లేదంటే లేట్ అయిందని బాగా ఎక్కువగా తింటారు. ఇలా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మలబద్ధకం సమస్య ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. గట్ హెల్తీగా ఉండాలంటే సమయానికి, కంట్రోల్‌గా తినాలి.
అవి అస్సలు వద్దు..
పండుగల సమయంలో కొందరు ఊరికే స్మోక్ చేయడం, మద్యం తీసుకోవడం చేస్తారు. ఇది హెల్త్‌ని అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ అలవాటును దూరం చేసుకోవడం కోసం.. గ్రీన్ టీ, సలాడ్స్, ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవచ్చు. ఇవి హెల్తీ రిప్లేస్మెంట్స్.
వ్యాయామం..
పండుగల సమయంలో చాలామంది వ్యాయామానికి బ్రేక్ ఇస్తారు. ఒకరోజు స్కిప్ చేస్తే పర్లేదు కానీ.. ఎక్కువరోజులు దానికి బ్రేక్ తీసుకోవడం మంచిది. కాదు. కాబట్టి ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్, స్ట్రెచ్‌లు చేయవచ్చు. లేదంటే ఇంట్లోవారితో కలిసి ఏరోబిక్స్, డ్యాన్స్‌లు వంటివి చేయొచ్చు. ఇలా ఏదొక విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
స్వీట్స్ లైట్ తీసుకోండి..
పండుగల సమయంలో స్వీట్స్ తీసుకోవడం స్కిప్ చేయలేము కాబట్టి లైట్‌గా తీసుకోండి. హెల్తీగా కూడా వాటిని తయారు చేసుకోవచ్చు. షుగర్ వాడకుండా సహజమైన పదార్థాలతో టేస్టీ స్వీట్స్ వండుకోవచ్చు. ఎందుకంటే స్వీట్స్ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కడుపు ఉబ్బరం, డయేరియా, తిన్నది అరగకపోవడం, మలబద్ధకం ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి స్వీట్స్ అందరూ లిమిట్‌గా తీసుకుంటేనే మంచిది.
ఇవేకాకుండా ఒత్తిడి పెంచుకోకుండా రిలాక్సింగ్ విషయాలపై ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా శారీరక, మానసికంగా కృంగదీస్తుంది. క్రాకర్స్ వల్ల వచ్చే పొగ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తీసుకుంటే మంచిది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుని.. ఫాలో అయితే జీర్ణ సమస్యలు దరిచేరవు.
Also Read : దీపావళి సమయంలో లేడీస్‌కి ఈ డ్రెస్‌లు బెస్ట్.. మగవారు ఈ ట్రెండ్స్ ట్రై చేయొచ్చు