అన్వేషించండి

Diwali Fashion Trends 2024 : దీపావళి సమయంలో లేడీస్​కి ఈ డ్రెస్​లు బెస్ట్.. మగవారు ఈ ట్రెండ్స్ ట్రై చేయొచ్చు

Deepawali 2024 : దీపావళి సమయంలో ఎలాంటి డ్రెస్​లు వేసుకోవాలి? మగవారికి ఏది బెస్ట్.. ఆడవారికి ఏవి నప్పుతాయి? గిఫ్ట్​లుగా ఏవి ఇవ్వొచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

Diwali 2024 Fashion Tips : దీపావళి సమయంలో రంగు రంగుల దీపాలు, ముగ్గుల మధ్య మీరు కూడా అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే మీ దీపావళి షాపింగ్ ఇప్పుడే మొదలుపెట్టేయండి. అక్టోబర్ 30 అయినా.. నవంబర్ 1వ తేదీ అయినా.. దీపావళి ఎప్పుడైనా సరే పండుగ సమయానికి సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడే షాపింగ్ చేసేస్తే మంచిది. ఎందుకంటే ఈలోపు ఫిట్టింగ్​ అయినా.. స్ట్రిచ్ చేయించుకోవాలన్నా గ్యాప్ దొరుకుతుంది కాబట్టి.. పండుగ సమయానికి అన్ని సిద్ధం చేసేసుకోవచ్చు. 

పండుగల సమయంలో ట్రెడీషనల్​గానే కాకుండా ట్రెండీ గానూ.. ఫ్యాషన్​గానూ ఉండే దుస్తులను ఎంచుకుంటే మంచిది. అయితే ఈ దీపావళికి ఆడవాళ్లు ఎలాంటి డ్రెస్​లు వేసుకుంటే బాగుంటుందో.. మగవారికి ఏవి నప్పుతాయో.. డ్రెస్​లను గిఫ్ట్​గా ఇవ్వాలంటే ఏవి బెస్టో ఇప్పుడు చూసేద్దాం. ఏ డ్రెస్​లు దీపావళి శోభను పెంచుతాయో.. మిమ్మల్ని అందంగా కనిపించేలా చేసే దుస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆడవారికి.. (Women's Fashion Trends)

చీరలు : పండుగల సమయంలో ఆడవారికి డ్రెస్​ల విషయంలో ప్రధానంగా ఉండే ఆప్షన్​లలో చీర ఉంటుంది. అయితే మీరు జార్జెట్, సిల్క్, ఆర్గాంజా చీరలను దీపావళికి కట్టుకోవచ్చు. ట్రెడీషనల్ డిజైన్ ఉన్న చీరలను.. ట్రెండీ బ్లౌజ్​లతో సెట్ చేసుకోవచ్చు. లేదా మిర్రర్ వర్క్, అంబ్రాయిడరీ వేయించుకుని మీ శారీ లుక్​ని ట్రెండీగా మార్చుకోవచ్చు. 

అనార్కలీ డ్రెస్​లు : అమ్మాయిలు ట్రెడీషనల్​గా రెడీ అవ్వాలనుకుంటే వారి లిస్ట్​లో కచ్చితంగా అనార్కలీ డ్రెస్​లు ఉంటాయి. ఎందుకుంటే ఇవి మంచి లుక్​ని ఇవ్వడంతో పాటు.. కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. దీపావళి సమయంలో ఇవి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 

లెహంగా : దీపావళి సమయంలో డ్యాన్స్ చేసేందుకు అయినా.. లేదా గ్రాండ్​గా కనిపించాలనుకున్నా లెహంగాలు మంచి ఆప్షన్. హెవీ వర్క్ ఉన్న మిర్రర్ స్టోన్స్ వచ్చిన లెహంగాలు పండుగ శోభను రెట్టింపు చేస్తాయి. అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తాయి. 

పలాజో : కంఫర్ట్​బుల్​గా, స్టైలిష్​గా, సింపుల్​గా ఉండాలనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. పైగా వీటిని మీరు డైలీ వేర్​గా కూడా ఉపయోగించుకోవచ్చు. సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపించాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆప్షన్. 

టిప్ : డ్రెస్​లు తీసుకునేప్పుడు దానికి మ్యాచింగ్ జ్యూవెలరీ తీసేసుకుంటే పండుగ సమయానికి హడావుడి లేకుండా త్వరగా రెడీ అయిపోవచ్చు. 

మగవారికి.. (Men's Fashion Trends)

కుర్తా పైజామా : మగవారు పండుగల సమయంలో ప్యాంటు, షర్ట్​లకు బదులు కుర్తా పైజామా వేసుకోవచ్చు. ఇవి చాలా కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. పైగా పండుగ శోభను ఇస్తాయి. 

షేర్వాణి : పార్టీలు, ఫంక్షన్ల తరహాలో దీపావళిని చేసుకోవాలనుకుంటే మీరు షేర్వాణిలు ట్రై చేయవచ్చు. ఇవి మంచి గ్రాండ్ లుక్​ని ఇస్తాయి. 

గిఫ్ట్​లు ఇచ్చేందుకు.. (Gift Ideas)

దీపావళి సమయంలో చాలామంది గిఫ్ట్​లు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే మీరు డ్రెస్​లను కూడా దీపావళి గిఫ్ట్​లుగా ఇవ్చొచ్చు. పటోలా ప్రిటెండ్​ శారీలను ఆడవారికి గిఫ్ట్ చేయవచ్చు. ఓవెన్ ఆర్ట్ సిల్క్ శారీలు కూడా మంచి ఆప్షన్. కుర్తా సెట్స్​, ఓవెన్ దుపట్టాలు మగవారికి ట్రెడీషనల్​ లుక్​ కోసం గిఫ్ట్​గా తీసుకోవచ్చు. మోడ్రన్ జ్యూవెలరీని వారికి గిఫ్ట్​గా ఇవ్చొచ్చు. 

Also Read : దీపావళి షాపింగ్​ను ఇలా ఈజీగా చేసేయండి.. ఇలా షార్ట్ లిస్ట్ చేసుకుంటే సరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free Gas Cylinder: దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
Jaishankar: ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
OnePlus 13: వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఆరోజే - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ!
వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఆరోజే - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్యాడ్స్ కోసం వేల కోట్ల ఖర్చు, ట్రంప్‌ని వెనక్కి నెట్టి కమలా హారిస్వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Gas Cylinder: దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
దీపావళి నుంచి ఏపీలో కొత్త పథకం ప్రారంభం - మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
Road Accident: ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం, అన్నమయ్య జిల్లాలో ఘటన
Jaishankar: ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
ఇవే తగ్గించుకుంటే మంచిది, కెనడాకు విదేశాంగమంత్రి జైశంకర్ చురకలు
OnePlus 13: వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఆరోజే - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ!
వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యేది ఆరోజే - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ!
Lucky Baskhar Trailer : ‘నేను చెడ్డోడ్ని కాదు... అయామ్ జస్ట్ రిచ్’ -  దుల్కర్ సల్మాన్'లక్కీ భాస్కర్' ట్రైలర్ వచ్చేసింది!
‘నేను చెడ్డోడ్ని కాదు... అయామ్ జస్ట్ రిచ్’ - దుల్కర్ సల్మాన్'లక్కీ భాస్కర్' ట్రైలర్ వచ్చేసింది!
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
ఏపీ రాజధాని అమరావతికి రూ.11,000 కోట్లు, ఫలించిన ప్రభుత్వం చర్చలు
Kanguva Second Singile : 'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
'యోలో' సాంగ్ లో ఫుల్ పార్టీ మోడ్ లో సూర్య... పూనకాలు తెప్పిస్తున్న 'కంగువ' సెకండ్ సింగిల్ 
Jio Vs Airtel Vs Vodafone Idea: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందించే బెస్ట్ 365 డేస్ ప్లాన్లు ఇవే - అన్‌లిమిటెడ్ 5జీతో!
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అందించే బెస్ట్ 365 డేస్ ప్లాన్లు ఇవే - అన్‌లిమిటెడ్ 5జీతో!
Embed widget