Escaped From Cow Bum: అరే ఏంట్రా ఇదీ? ఆ స్టంట్ కోసం ఏకంగా ఆవు కడుపులోకి దూరాడు, చివరికి..
పాపులర్ అయ్యేందుకు కొంతమంది ఏమైనా చేస్తారు. ఇతడైతే ఏకంగా ఆవు కడుపులోకే దూరాడు. మరి బయటకు ఎలా వచ్చాడు?
అతడికి స్టంట్స్ అంటే పిచ్చి.. ఎలాంటి స్టంట్‌నైనా అవలీలగా చేసేస్తాడు. ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తాడు. చేతులకు సంకెళ్లు వేసి బంధించినా.. సరే విడిపించుకుని వచ్చేస్తాడు. నింగి.. నేల.. గాలి.. ఇలా ఎక్కడైనా సరే అతడిని బంధించలేరు. అందుకే, అతడు డేర్ డెవిల్‌గా పేరుగాంచాడు. అయితే, వివిధ టీవీ షోస్‌లో కూడా పాపులర్ అయ్యాడు. అయితే, అతడు ఇటీవల ఎవరూ గుర్తించని ఓ భయానకమైన స్టంట్ గురించి ఓ మీడియా సంస్థకు తెలియజేశాడు. ఆ సాహసం కోసం అతడు ఆవు కడుపులోకి దూరానని చెప్పాడు.
ఔను, మీరు విన్నది నిజమే! అతడు ఆవు కడుపులోకి దూరాడు? అయినా, అదేలా సాధ్యం? అలా చేస్తే ఆవు చనిపోతుందనేగా మీ సందేహం? అందుకే, అతడు చనిపోయిన ఆవు కడుపులోకి దూరాడు. అయితే, అతడు ఆవు కడుపులోకి ఎలా దూరాడనే విషయం చెప్పలేదు. కానీ, ఎలా బయటకు వచ్చేడనేది మాత్రం చెప్పాడు. ఈ స్టంట్ చేసిన ఆ ఎస్కేప్ ఆర్టిస్ట్ పేరు జోనాథన్ గుడ్విన్.
వాస్తవానికి గుడ్విన్.. ఓ తిమింగలం కడుపులోకి దూరాలని ప్లాన్ చేశాడు. ఆ తిమింగలం కడుపుకోసి, చేతిని సంకెళ్లతో కట్టుకుని, తాళాలు వేసుకుని అతడు అందులోకి దూరాలి. ఆ తర్వాత అతడిని లోపల పెట్టి కుట్టేస్తారు. అక్కడి నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. నిర్ధారిత సమయంలో అతడు సంకెళ్లు విడిపించుకుని బయటకు రావాలి. అయితే, ఈ స్టంట్ చేయడానికి అతడికి ఎక్కడా తిమింగలం దొరకలేదు. దీంతో ప్లాన్‌ను మార్చుకున్నారు. ఏదైనా ఆవు కడుపులోకి దూరాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సందర్భంగా అతడు వధించడానికి సిద్ధంగా ఉన్న ఆవు కళేబారాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులోకి దూరాడు (ఎలా దూరాడనేది తెలియజేయలేదు). ఆ తర్వాత అతడు విజయవంతంగా సంకెళ్లు విడిపించుకుని బయటకు వచ్చేశాడు. అయితే, ఈ స్టంట్‌ను ప్రసారం చేయడానికి మొదట్లో ఓ టీవీ చానెల్ అంగీకరించింది. అయితే, దానివల్ల వీక్షకుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని, పైగా అలాంటివి ప్రసారం చేయడానికి రూల్స్ ఒప్పుకోవని భావించి.. తిరస్కరించారు. దీంతో అతడి స్టంట్‌ను పబ్లిక్ వీక్షించలేదు. అయితే, ఆవు కడుపులో ఉన్నప్పుడు తన కళ్లకు ఏమీ కనిపించలేదని, లోపల చాలా చీకటిగా ఉందని, తాను చేసిన స్టంట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన, భయానకమైన సాహసం ఇదేనని అతడు వెల్లడించాడు. కానీ, స్టంట్ కోసం ఆవులోకి దూరడమనేది చాలా జుగుప్స కలిగించే విషయం. ఈ విషయం తెలిసి నెటిజన్స్ అతడిని తిట్టిపోస్తున్నారు. ‘‘నీకు స్టంట్ చేయడానికి ఆవే దొరికిందా? అది చనిపోయిన జంతువైనా సరే, వాటితో అలా ప్రవర్తించకూడదు’’ అని అతడికి తలంటు పోస్తున్నారు. అది కూడా నిజమే కదండి!! (ప్రస్తుతం గుడ్విన్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌ఛైర్‌కు పరిమితమయ్యాడు. స్టంట్స్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు).
Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!
Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?
View this post on Instagram