News
News
X

Salt: ఉప్పు డబ్బాతో ముప్పే - కాస్త చప్పగా ఉన్నా ఫర్వాలేదు తినేయండి

ఉప్పుతో ఆరోగ్యానికి ఎంతో ముప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పట్నించో చెబుతోంది. అయినా ఉప్పుని దట్టించుకుని తింటున్నా వారు ఎంతో మంది.

FOLLOW US: 
Share:

రుచికరమైన భోజనం అంటే అందులో సరిపడినంత ఉప్పు ఉండాలి. కానీ ఒక్కోసారి ఉప్పు తగ్గుతుంది. అయినా అలా తినేయకుండా పక్కనున్న ఉప్పు డబ్బా తీసి కూరల్లో, అన్నంలో వేసుకుని కలుపుకుని తింటారు. ఇలా అదనంగా వేసుకున్న ఉప్పే ప్రాణాల మీదకు తెస్తోంది. వంటల్లో ఉప్పు తక్కువైనా సర్దుకుపోయి తినేయడం మంచిది. కానీ ఇలా పచ్చి ఉప్పును అన్నంపై, కూరపై చల్లుకుని తినకూడదు. నాలిక రుచి కోసం చూసుకుంటే, మీ గుండె ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే భోజనం తినేటప్పుడు ఉప్పు డబ్బాను దగ్గర్లో ఉంచుకోకండి. పెరుగన్నంలో కూడా ఉప్పు లేకుండా తినేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి వ్యాధుల బాధలు లేకుండా జీవించనంత కాలం ప్రశాంతంగా ఉంటారు.  

ఇది ఫలితం
బ్రిటన్లో ఇలా అదనంగా ఉప్పు వేసుకునే వారిపై అధ్యయనం నిర్వహించారు. దాదాపు  1,76,750 మందిపై అధ్యయనం నిర్వహించారు. వీరిలో అదనంగా అన్నంలో ఉప్పు వేసుకుని కలుపుకుని తింటున్న ఏడు వేల మందికి గుండె పోటు వచ్చినట్టు తేలింది. అలాగే మరో రెండు వేల మంది పక్షవాతం బారిన పడినట్టు గుర్తించారు. వండేటప్పుడు కాకుండా తినేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకున వారిలో గుండె జబ్బులు, అధికరక్త పోటు అధికంగా ఉన్నట్టు చెప్పారు పరిశోధకులు.  

ఎంత తినాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు అయిదు గ్రాముల ఉప్పుకు మించి తినకూడదు. కానీ మనం అంతకు మూడింతలు తింటున్నాం. ఒక సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు పది గ్రాముల ఉప్పు తింటున్నట్టు తేలింది. ఉప్పులో సోడియం 40 శాతం, క్లోరిన్ 60 శాతం ఉంటాయి. సోడియం అధికంగా రక్తంలో చేరడం వల్ల నీటిని అధికంగా ఆకర్షిస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. 

ఉప్పును తక్కువగా తినే డ్యాష్ డైట్ ను అందరూ పాటిస్తే మంచిది. అధిక రక్తపోటును ఆపేందుకు దీన్ని తయారుచేశారు. ఇందులో పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలు తినడం తగ్గిస్తారు. పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం అధికంగా తింటారు. 

Also read: క్రిస్పీగా గోబి పకోడి, చల్లని సాయంత్రం వేళ పర్‌ఫెక్ట్ స్నాక్స్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 12 Dec 2022 06:54 AM (IST) Tags: Salt risks Salt is Danger Salt High BP Avoid salt

సంబంధిత కథనాలు

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

Fatty liver Disease: కాలేయం ఆరోగ్యంగా ఉందా? లేక కొవ్వు పేరుకుపోయిందా? తెలుసుకోవడం ఎలా

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్