News
News
X

Covid-19: ఒమిక్రాన్ వల్ల నిద్రలేమి సమస్య? భయపెడుతున్న కొత్త లక్షణం

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. దానికి సంబంధించిన కొత్త వేరియంట్లు, కొత్త లక్షణాలు బయటకి వచ్చి కలవరపెడుతున్నాయి.

FOLLOW US: 
 

నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అది మామూలే అని నిర్లక్ష్యం వహిస్తున్నారా? కానీ దాని వెనుక ఉన్న కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిద్రలేమి కోవిడ్-19 లేదా ఒమిక్రాన్ వల్ల కూడా కావచ్చు. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించి ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది. సాధారణంగా కోవిడ్ వల్ల సాధారణ జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం జరుగుతుంది. కానీ అభివృద్ధి చెందుతున్న వైరస్ లక్షణాల వల్ల నిద్రలేమి సమస్య కూడా ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఇప్పుడు ప్రజలని భయాందోళనకి గురి చేస్తుంది. ఒమిక్రాన్ కంటే ఈ BA.5 వేరియంట్ మరింత ప్రమాదరకరమని ఇప్పటికే కొంతమంది నిపుణులు వెల్లడించారు. ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ BA.5 సోకుతున్నట్టు గుర్తించారు. ఈ వేరియంట్ ను అడ్డుకోవడానికి ఆ టీకాల సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదని ఒక తాజా అధ్యయనం చెప్పింది. అన్ని వేరియంట్ల కన్నా ఈ వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.

కొత్త లక్షణం నిద్రలేమి

ఇప్పుడు ఈ ఒమిక్రాన్ వేరియంట్ లో కనిపించే కొత్త లక్షణం మరింత భయపెడుతుంది. రాత్రి వేళ చెమటలు పట్టడం ఒమిక్రాన్ సరికొత్త వేరియంట్ BA.5 తో ముడి పడి ఉందని ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ ఇమ్యూనాలజిస్ట్ ప్రొఫెసర్ నీల్ చెప్పుకొచ్చారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి ఒమిక్రాన్ BA.4, BA.5 వేరియంట్లో ఈ కొత్త లక్షణం కనిపిస్తుంది. కోవిడ్ స్నోమియా(నిద్రలేమి) ఒత్తిడి, ఆందోళన పెరగడం వల్ల సంభవిస్తుంది. సాయంత్రం వేళ నిద్ర రావడం జరుగుతుంది.

కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు లేదా సుదీర్ఘమైన కోవిడ్ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తులు నిద్రకి ఆటంకంగా మారుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె, జీవ క్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒమిక్రాన్ మహమ్మారి కారణంగా 52% మంది భారతీయులు తమ నిద్ర అలవాట్లను మార్చుకున్నారని ఇటీవలి పరిశోధన  వెల్లడైంది.

News Reels

నిద్రలో కనిపించే సాధారణ లక్షణాలు

నిద్రపోతున్న సమయంలో కొంతమందికి విపరీతమైన చెమట పట్టడం వల్ల తీవ్రమైన భయాందోళనలకి గురవుతారు. ఒమిక్రాన్ వల్ల స్లీప్ అప్నియా, నిద్ర మధ్యలో లేవడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కువ సేపు నిద్ర పోవాలని అనిపించడం వంటి కోరికలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాల వల్ల రోజంతా మగతగా అనిపిస్తుంది. దీని వల్ల ఏ పని మీద ధ్యాస లేకపోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం, అలసట, కళ్ళు మంటలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. టీకాలు, బూస్టర్ డోస్ తీసుకోవడం ఒక్కటే ఈ లక్షణాలని అధిగమించడానికి ఉన్న ఏకైక మార్గం.

కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. అందుకే ఏమవుతుందిలే అని అందరూ నిర్లక్ష్యం వహిస్తూ మాస్క్ లు లేకుండా బయట తిరుగుతున్నారు. గతంలో వచ్చిన కరోనా కంటే ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. . ఈ కొత్త వేరియంట్లు దక్షిణాఫ్రికాలోని ఏడు నగరాలతో పాటూ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, చైనా, ఇజ్రాయెల్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, పాకిస్థాన్, యూకే, యూఎస్, స్విట్జర్లాండ్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లో బయటపడ్డాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఈ ఐదు ఆహారాలు మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాయ్ జాగ్రత్త !

Also Read: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే

Published at : 03 Oct 2022 02:34 PM (IST) Tags: Omicron Coronavirus COVID 19: Sleepless Nights Sleep Disturbance Covidsomnia Omicron Pandemic Sleep Apnea

సంబంధిత కథనాలు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

Diabetes: శీతాకాలంలో మధుమేహ రోగులు  కచ్చితంగా తినాల్సిన కూరగాయలు ఇవే

టాప్ స్టోరీస్

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!