అన్వేషించండి

Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే

Pink Eye/Conjunctivitis : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో కండ్లకలక కూడా ఒకటి. ఇది రావడానికి కారణాలు ఏంటి.. ఏ లక్షణాలు ఎక్కువైతే వైద్య సహాయం తీసుకోవాలి? పూర్తి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కండ్లకలక వైరస్, బ్యాక్టీరియా, అలెర్జీలతో కంటి వాపు వస్తుంది.
  • కళ్ళు ఎర్రబడటం, దురద, స్రావం వంటివి ప్రధాన లక్షణాలు.
  • ఇది అంటువ్యాధి, వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాప్తి నివారించవచ్చు.
  • తీవ్ర లక్షణాలప్పుడు లేదా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

Conjunctivitis Causes and Symptoms : వర్షాకాలంలో కండ్లకలక కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కంటి తెల్లటి భాగాన్ని కప్పి ఉండే పలుచని పొర వాపునకు గురికావడం వల్ల వచ్చే సమస్య ఇది. వైరస్, బ్యాక్టీరియా, అలెర్జీ లేదా కొన్ని రకాల రసాయనాల వల్ల ఇది రావచ్చు. చాలామందిలో ఇది చిన్న సమస్యగానే ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మరి దీనికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

కండ్లకలకకు ప్రధాన కారణాలు

కండ్లకలకకు అత్యంత సాధారణ కారకం వైరస్. జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ కండ్లకలక చాలా అంటువ్యాధి. అలాగే బ్యాక్టీరియా వల్ల కూడా కండ్లకలక వస్తుంది. ఈ సమయంలో కళ్ల నుంచి పసుపు లేదా ఆకుపచ్చ రంగులో చిక్కటి స్రావం రావచ్చు. దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు లేదా కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల అలెర్జీతో కండ్లకలక రావచ్చు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

Also Read : వేసవి నుంచి వర్షాకాలం మారే సమయంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

చేతులను శుభ్రం చేయకుండా తరచూ కళ్లను రుద్దడం వల్ల క్రిములు కంట్లోకి చేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది. శుభ్రం కాని నీరు, తువ్వాళ్లు, దిండు కవర్లు, మేకప్ వస్తువులు లేదా కాంటాక్ట్ లెన్స్‌లను సరిగా శుభ్రం చేయకపోవడం కూడా కారణమవుతుంది.

కండ్లకలక లక్షణాలు

కండ్లకలక వస్తే కళ్లు ఎర్రగా మారతాయి. కళ్లలో దురద లేదా మంటగా ఉండటం, కళ్ల నుంచి నీరు కారడం, కంటి నుంచి చిక్కటి స్రావం రావడం, ఉదయం లేచినప్పుడు కనురెప్పలు అతుక్కుపోవడం, వెలుతురు చూస్తే ఇబ్బందిగా అనిపించడం, కంట్లో ఇసుక పడినట్లుగా అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 


Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే

ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కండ్లకలక వస్తే చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. అలాగే కళ్లను చేతులతో నులుముకూడదు. ఉపయోగించిన తువ్వాలు, రుమాలు, దిండు ఇతరులతో పంచుకోకూడదు. కంటి నుంచే వచ్చే స్రావాన్ని శుభ్రమైన టిష్యూ లేదా కాటన్‌తో తుడిచి వెంటనే పారేయాలి. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

Also Read : వర్షాకాలంలో దోమల బెడదను తగ్గించేందుకు ఇంట్లో ఇలా చేయండి.. బెస్ట్ హోమ్ టిప్స్ ఇవే

కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారు పూర్తిగా కోలుకునే వరకు వాటిని ఉపయోగించకూడదు. అలాగే కంటి మేకప్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలి. ఇప్పటికే ఉపయోగించిన మేకప్ ఉత్పత్తులను తిరిగి వాడకపోవడం మంచిది. కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. మొబైల్, కంప్యూటర్ వినియోగాన్ని తగ్గించాలి. 

ఇంట్లో ఫాలో అవ్వాల్సిన చిట్కాలు

శుభ్రమైన గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై కొన్ని నిమిషాలు ఉంచితే మంట, వాపు కొంత తగ్గవచ్చు. తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. పోషకాహారం, విటమిన్ ఎ, సి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. కళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

కండ్లకలకకు చికిత్స 

వైరల్ కండ్లకలక అయితే కొన్ని రోజులు నుంచి రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఈ సమయంలో పరిశుభ్రత, కంటి సంరక్షణ చాలా ముఖ్యం. బ్యాక్టీరియా వల్ల కండ్లకలక వస్తే వైద్యుడు సూచించిన యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ లేదా ఆయింట్‌మెంట్ అవసరం కావచ్చు. అలెర్జీకి కారణమైన వాటికి దూరంగా ఉండాలి. అవసరమైతే వైద్యుడు సూచించిన యాంటీ-అలెర్జిక్ ఐ డ్రాప్స్ ఉపయోగించాలి. డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ ఐ డ్రాప్స్‌ను వాడకూడదు. 


Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

కండ్లకలక వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తీవ్రమైన కంటి నొప్పి, చూపు మసకబారడం లేదా తగ్గిపోవడం, వెలుతురు చూడలేకపోవడం, ఎక్కువగా చీము లేదా రక్తస్రావం రావడం, రెండు వారాలకిపైగా లక్షణాలు కొనసాగడం, కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారిలో ఇన్ఫెక్షన్ రావడం గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 

Also Read : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget