Hair Care: ఈ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? రివర్స్ షాంపూ ట్రై చేయండి
జుట్టు సంరక్షణ కఠినమైన సవాలు. దీన్ని ఎదుర్కొనేందుకు ఇదొక చక్కని పరిష్కారం.
జుట్టు సంరక్షించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలు ట్రై చేస్తూనే ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్ కొనేసి వాడతారు. కానీ జుట్టు రాలే సమస్య మాత్రం తగ్గదు. పైగా మరింత ఎక్కువగా రాలిపోతుంది. అందుకే ఈ సమస్య నుంచి బయట పడటం కోసం రివర్స్ షాంపూ ట్రై చేసి చూడండి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకు ఇది పరిష్కారిస్తుంది.
రివర్స్ షాంపూ అంటే ఏంటి?
సాధారణంగా షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకుంటారు. అలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు సహజ నూనె, తేమ చెక్కుచెదరకుండా చేస్తుంది. అయితే షాంపూ చేసుకునే ముందు కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడాన్ని రివర్స్ షాంపూ అని కూడా అంటారు. అలా చేస్తే షాంపూలోని కఠినమైన రసాయనాలు జుట్టులోకి ప్రవేశించలేవు. ఇవే కాదు షాంపూకి ముందుగా కండిషనర్ పెట్టడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు..
☀ ఇది జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది. స్టైలింగ్ లేకుండానే మీ జుట్టు మీ మాట వినేస్తుంది. చక్కగా మీకు నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవచ్చు.
☀ నిస్తేజమైన, పేలవమైన జుట్టు ఉంటే షాంపూకి ముందు కండిషనర్ చక్కని పరిష్కారం. జుట్టు కడిగే ముందు దీన్ని అప్లై చేసుకుంటే నిగనిగలాడుతుంది.
☀ వెంట్రుకలకు నూనె ఎక్కువగా ఉంటే కండిషనర్ పెట్టడం వల్ల దాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత షాంపూ చేస్తే శుభ్రంగా ఉంటుంది.
☀ కండిషనర్ జుట్టుని ఫ్లాట్ గా కనిపించేలా చేస్తే రివర్స్ షాంపూ చేస్తే జుట్టు జిడ్డుగా కనిపించదు. కానీ పోషణ మాత్రం అందుతుంది.
☀ చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. తల దువ్వుకున్న ప్రతిసారి దువ్వెనలో రాలిపోయిన జుట్టు చూసి బాధపడిపోతూ ఉంటారు. ఆ సమస్య నుంచి బయట పడాలంటే రివర్స్ షాంపూ ట్రై చేసి చూడండి. షాంపూకి ముందు కండిషనర్ పెట్టడం వల్ల తలస్నానం చేసేటప్పుడు జుట్టు గట్టిగా లాగడం, చిక్కు పడటం వంటివి జరగవు. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా మారి చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
☀ రివర్స్ కండిషనింగ్ వల్ల జుట్టు మరింత మెరిసేలా చేసేందుకు సహాయపడుతుంది. జుట్టు రెపరెపలాడిపోతుంది.
☀ కండిషనర్ ముందుగా పెట్టడం వల్ల జుట్టుకు పట్టిన మురికి చాలా వరకు తొలగిపోతుంది. దీని వల్ల తక్కువ షాంపూ పడుతుంది. జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో షాంపూ పెట్టాల్సిన అవసరం ఉండదు.
☀ జుట్టు చిట్లిపోకుండా చేస్తుంది. హెయిర్ క్యూటికల్స్ ని శాంతపరుస్తుంది. జుట్టుకి మరింత పోషణ అందిస్తుంది.
☀ షాంపూకి ముందు కండిషనర్ చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న రంధ్రాలను అన్ లాగ్ చేస్తుంది.
☀ జుట్టునిహైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు