అన్వేషించండి

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్

Cocoa Powder Overnight Oats : బరువు తగ్గాలనుకునేవారు.. స్వీట్స్ కంట్రోల్ చేసుకోవాలనుకునేవారు టేస్టీగా, హెల్తీగా తినాలనుకుంటే ఓవర్ నైట్ ఓట్స్ ట్రై చేయవచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కోకో ఓవర్​నైట్ ఓట్స్ రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం, రాత్రి సిద్ధం.
  • ఓట్స్, కోకో పౌడర్, పాలు, చియా సీడ్స్ రాత్రంతా నానబెట్టండి.
  • అరటిపండు, నట్స్ కలిపి ఉదయం తింటే కడుపు నిండుగా ఉంటుంది.
  • బరువు తగ్గడానికి ఓట్స్ మాత్రమే కాక, జీవనశైలి కూడా ముఖ్యం.

Overnight Oats With Cocoa Powder : బరువు తగ్గాలని అనుకున్నప్పుడు చాలామంది ముందుగా ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అయితే దీనిలో భాగంగా రుచిగా ఉండే ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్థాలతో టేస్టీ ఫుడ్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో కోకో పౌడర్‌తో చేసే ఓవర్‌నైట్ ఓట్స్ కూడా ఒకటి. టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ కోసం మీరు హ్యాపీగా ట్రై చేయవచ్చు. రాత్రే సిద్ధం చేసుకుంటే ఉదయాన్నే ఎలాంటి హడావుడి లేకుండా తినేయవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

కోకో పౌడర్ ఓవర్‌నైట్ ఓట్స్‌కు కావాల్సిన పదార్థాలు

ఓట్స్ - అర కప్పు

పాలు - అర కప్పు

కోకో పౌడర్ - 1 టీస్పూన్

చియా సీడ్స్ - 1 టీస్పూన్

అరటిపండు - సగం

బాదం లేదా వాల్‌నట్స్ - కొద్దిగా

తేనె - 1 టీస్పూన్ 

Also Read : మహిళలు రోజూ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటోన్న నిపుణులు.. మానేస్తే వచ్చే ప్రధాన సమస్యలు ఇవే

కోకో పౌడర్ ఓవర్‌నైట్ ఓట్స్ తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె లేదా మూత ఉన్న గాజు జార్ తీసుకోవాలి. అందులో ఓట్స్ వేసుకోవాలి. వీలైతే రోల్డ్ ఓట్స్ తీసుకోండి. ఇవి పాలను పీల్చుకుని రాత్రంతా నానిన తర్వాత మెత్తగా మారతాయి. ఈ ఓట్స్‌లో కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. దీనివల్ల ఓట్స్‌కు చాక్లెట్ రుచి వస్తుంది. అదనపు చక్కెర ఎక్కువగా కలపకుండా కూడా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు, చియా సీడ్స్ వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకోండి.

ఇప్పుడు జార్‌కు మూత పెట్టి ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచండి. పగలు చేసుకుంటే కనీసం 6 గంటలు ఫ్రిజ్​లో ఉంచాలి. ఈ సమయంలో ఓట్స్, చియా సీడ్స్ పాలను పీల్చుకుని మెత్తగా మారతాయి. ఉదయాన్నే దీన్ని ఫ్రిజ్‌లో నుంచి తీసి బాగా కలపాలి. ఆ తర్వాత అరటిపండు ముక్కలు, బాదం లేదా వాల్‌నట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. స్వీట్ కావాలనుకుంటే తక్కువ పరిమాణంలో తేనె కలుపుకోవచ్చు. అంతే.. టేస్టీ కోకో ఓవర్‌నైట్ ఓట్స్ రెడీ.

Also Read : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే నిజంగానే బరువు తగ్గుతారా? ఎవరు అస్సలు మానకూడదు

బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందా?

ఈ ఓవర్​ నైట్​ ఓట్స్ కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఓట్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించవచ్చు. దీంతో కొందరికి క్రేవింగ్స్ తగ్గుతాయి. పాలలో ప్రోటీన్ ఉంటుంది. యోగర్ట్ లేదా చియా సీడ్స్‌ను కలిపి తీసుకుంటే మరిన్ని పోషకాలు అందుతాయి. కోకో పౌడర్ వల్ల చాక్లెట్ రుచి వస్తుంది. కాబట్టి స్వీట్లు తినాలనిపించినప్పుడు హెల్తీగా దీనిని తీసుకోవచ్చు. 

గుర్తించుకోవాల్సిన విషయాలు 

ఓవర్‌నైట్ ఓట్స్ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అయినప్పటికీ.. వీటిని తినడం వల్ల మాత్రమే బరువు తగ్గరని గుర్తించుకోవాలి. రోజంతా మీరు తీసుకునే మొత్తం క్యాలరీలు, శారీరక శ్రమ, నిద్ర వంటి అంశాలు కూడా బరువుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తేనె, చక్కెర, నట్స్‌ను అధికంగా కలపకుండా మీ అవసరానికి తగిన పరిమాణంలో తీసుకోవాలి.

Also Read : ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి, అందానికి కలిగే లాభాలు ఏంటి? రోజుకు ఎన్ని తినాలి?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget