Congestive Heart Failure: దగ్గు - గుండె సమస్యలకు లింక్ ఉందా.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటీ? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేని పరిస్థితిలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సమస్య తలెత్తుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, కాళ్లు, పొత్తికడుపులో వాపు ఏర్పడుతుంది.
![Congestive Heart Failure: దగ్గు - గుండె సమస్యలకు లింక్ ఉందా.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటీ? డాక్టర్లు ఏం చెబుతున్నారు? Chronic cough could be a sign of heart failure Congestive Heart Failure: దగ్గు - గుండె సమస్యలకు లింక్ ఉందా.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటీ? డాక్టర్లు ఏం చెబుతున్నారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/c1c2145b7cd28d97290938ade095beae1721215591332544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congestive Heart Failure: దగ్గు అనేది ఊపిరితిత్తుల సమస్య అని చాలా మంది భావిస్తారు. కానీ, దీర్ఘకాల దగ్గు కారణంగా గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్లు. దగ్గు ఎక్కువగా రావడం వల్ల కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (CHF) అనేది ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. గుండె సమస్యలకు తోడు దగ్గు యాడ్ అయినప్పుడు CHF సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి?
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు ఏర్పడుతుంది. రక్తపోటు, గుండె కవాటాల వ్యాధి కారణంగా ఈ సమస్య తెల్తుతుంది. గుండె కండరాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఒక్కోసారి ఊపిరితిత్తుల నుంచి రక్తం తిరిగి గుండెకు చేరే సమయంలోనూ తీవ్రమైన దగ్గు ఏర్పడుతుంది. ఆ సమయంలోనూ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఏర్పడుతుంది. కొరోనరీ ఆర్టరీ వ్యాధి(CAD), మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్(గుండెపోటు), రక్తపోటు, కార్డియోమయోపతి, గుండె కవాట సమస్యలు, పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో CHF ఏర్పడుతుంది.
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు
1. గుండె సంబంధ సమస్యలు, విపరీతమైన దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. పరిస్థితి తీవ్రం అయినప్పుడు నురుగుతో కూడిన కఫం, నోటి నుంచి రక్తం వస్తుంది.
2. పడుకున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోకపోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.
3. దగ్గినప్పుడు తెల్లగా లేదంటే గులాబీ రంగులో ఉండే రక్తంతో కూడిన కఫం వస్తుంది.
4. ఊపిరితిత్తుల్లో ద్రవం ఏర్పడటం, కాళ్లు, చీలమండలు, పొత్తికడుపులో వాపుతో పాటు బరువు పెరుగుతారు.
5. రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం తగ్గిపోవడం వల్ల బలహీనత, అలసట ఏర్పడుతుంది.
6. గుండె దడ, క్రమరహిత హృదయ స్పందన ఏర్పడుతుంది.
7. పని చేస్తున్న సమయంలో విపరీతమైన నీరసం ఏర్పడుతుంది.
8. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అధిక హృదయ స్పందన రేటు.
9. మెదడుకు రక్త ప్రవాహం తగ్గి మతిమరుపు, ఏకాగ్రత కోల్పోతారు.
10. ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గడం, విసుగు ఏర్పడుతాయి.
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కు చికిత్స
1. ఆహారపు అలవాట్లు: ఫ్లూయిడ్స్ తగ్గించేలా తక్కువ సోడియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. ఉప్పు వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.
2. తరచుగా వ్యాయామం: కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ను తగ్గించుకోవాలంటే శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిది.
3. వైద్య చికిత్స: కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నవాళ్లు తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాలి. సమస్యను ముందుగానే గుర్తిస్తే చికిత్స మరింత ఈజీ అవుతుంది.
Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త
Read Also: 5 రోజులు, 6 మరణాలు - చండీపురాను వణికిస్తున్న వైరస్, చికిత్స లేని ఈ వ్యాధి లక్షణాలేంటో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)