Dandruff: చుండ్రుని శాశ్వతంగా వదిలించుకోగలమా? ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
చుండ్రు వల్ల తల ఎప్పుడు దురదగా ఉంటుంది. ఇంకేముంది మన చేతులు ఎప్పుడు తల మీదే ఉంటాయి. చాలా చికాకు కలిగించేస్తుంది. అంతగా ఇబ్బంది పెట్టె చుండ్రుని పోగొట్టుకోవడం కోసం ఇలా చేసి చూడండి.
జుట్టుకి ఎటువంటి నష్టం కలిగించకుండా దాన్ని కాపాడుకోవడం అంటే కాస్త కష్టమే. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు నిత్యం ఎదుర్కొంటూనే ఉంటారు. కొంతమందికి చుండ్రు పోయినట్టే పోతుంది. కానీ మళ్ళీ రెండు మూడు రోజులకే వచ్చేస్తుంది. ఇది జుట్టు అందాన్నే దెబ్బతీస్తుంది. చుండ్రు వల్ల తల మీద దురద, తెల్లటి పొట్టు, పొడిబారిపోవడం వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం, తల పరిశుభ్రత సరిగా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల చుండ్రు సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలని అనుసరిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చుండ్రుని నియంత్రించుకోవచ్చు. చుండ్రుని వదిలించుకోవడానికి సమయం ఎక్కువగా పడుతుంది.
తలని శుభ్రంగా ఉంచుకోవాలి
చుండ్రు అనేది హెయిల్ ఫోలికల్స్ బెస్ చుట్టూ మలాసెజియా అనే ఈస్ట్ పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ ఫంగస్ స్కాల్ఫ్ సెబమ్ ని దెబ్బతీస్తుంది. అపరిశుభ్రమైన స్కాల్ఫ్ ఫంగస్ కి ఆవాసంగా మారుతుంది. దీని వల్ల చుండ్రు వచ్చేస్తుంది. దీన్ని దూరం చేసుకోవాలంటే స్కాల్ఫ్ ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కెటోకానజోల్, జింక్ పైరిథియోన్, సెలీనియం సల్ఫైడ్, పిరోక్టోన్ ఒలమైన్ తో కూడిన షాంపూ ఉపయోగించాలి. వాటిని కనీసం 5-10 నిమిషాల పాటు తలపై ఉంచి ఆ తర్వాత స్కాల్ఫ్ ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చుండ్రు తగ్గించుకోవడానికి వారానికి 2-3 సార్లు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఫాస్ట్ ఫుడ్, చక్కెర, ప్రాసెస్ చేయబడిన ఆహారాల వినియోగం వల్ల ఈస్ట్ పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. ఇది చుండ్రుని మరింత పెంచుతుంది. విటమిన్ బి, జింక్, ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు చుండ్రుని నివారించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, గుడ్లు, గింజలు, చిక్కుళ్ళు, అరటిపండ్లు, కొవ్వు చేపలు, పెరుగు వంటివి తలపై సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి. స్కాల్ఫ్ ని తేమగా ఉంచుతాయి.
నూనె రాసుకోవద్దు
తలకి నూనె లేకపోవడం వల్లే చుండ్రు పెరిగిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నూనె చుండ్రుని తగ్గించడంలో సహాయపడదు. నిజానికి నూనె రాసుకోవడం వల్ల చుండ్రు మరింత తీవ్రతరం అవుతుంది. తలపై ఉండే ఫంగస్ కి బలాన్ని ఇస్తుంది. అందుకే చుండ్రు ఉన్నప్పుడు నూనె రాయకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
హెయిర్ కేర్ ముఖ్యం
జుట్టుని సంరక్షించుకోవాడానికి అధికంగా హెయిర్ ఉత్పత్తులు ఉపయోగించొద్దు. డ్రై షాంపూ, హెయిర్ స్ప్రే చేయడం తగ్గించుకోవాలి. ఇది చుండ్రుకి కారణమవుతుంది. అటువంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి
అనేక వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. ఇది చుండ్రుకి కూడా వర్తిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో ఫంగల ఇన్ఫెక్షన్లని ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్వాస వ్యాయామాలు, శారీరక శ్రమ, ధ్యానం వంటివి చేయడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్