Angry Bride Video: పెళ్లిలో వధువు లొల్లి, అన్నీ గాల్లోకి విసిరేస్తూ వరుడితో ఫైట్, వీడియో వైరల్
పెళ్లిలో వధువుకు కోపం వచ్చింది. వరుడు తినిపిస్తున్న స్వీటును విసిరిపడేసింది. చివరికి గ్లాసును కూడా అతిథులపైకి విసిరేసింది.
పెళ్లయిన కొత్తలో భార్యభర్తలు బాగానే ఉంటారు. చూడగానే వీరంత అనోన్యంగా మరెవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది. కానీ, కొన్నాళ్ల సావాసం తర్వాత.. ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. స్పర్థలు పెరుగుతాయి. అయితే, వధువరులు అంత టైమ్ తీసుకోలేదు. పెళ్లి మండపంలోనే గొడవపడుతూ.. తమ ఫ్యూచర్ ఏమిటో పెద్దలకు ఉచితంగా చూపించేశారు. ముఖ్యంగా ఆ వధువు కోపాన్ని చూస్తే.. వరుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అనే సందేహం కలగకమానదు. ఇక విషయంలోకి వచ్చేస్తే..
సోషల్ మీడియాలో ఈ మధ్య పెళ్లి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వధువును చూడగానే వరుడు భావోద్వేగానికి గురై ఏడ్చేయడం వంటి అతి ప్రేమ వీడియోల నుంచి వధువరులు పెళ్లి పీటల మీద వింతగా ప్రవర్తించడం వరకు ఇలా చాలా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఓ మచ్చుతునక ఈ వీడియోనే.
Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!
ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వధువరులు పెళ్లి వేదికపై నిలబడి ఉన్నారు. వరమలా కార్యక్రమం తర్వాత వరుడిని వధువుకు స్వీట్ తినిపించాలని పెద్దలు కోరారు. దీంతో వరుడు స్వీటు ఆమె నోట్లో పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె దాన్ని తీసుకుని అతిథులపైకి విసిరేసింది. ఆమె చేసిన పనికి వరుడికి ఆగ్రహం కలిగింది. ఆ తర్వాత పెద్దలు వరుడికి నీళ్లు తాగించాలని గ్లాస్ ఇచ్చారు. వరుడు ఆ నీళ్లు తాగనన్నాడు. దీంతో మళ్లీ వధువుకు ఆగ్రహం వచ్చింది. ఈ సారి ఆమె చేతిలోని గ్లాసు అతిథులపైకి విసిరేసింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘చిల్ దీదీ చిల్’’ అని అంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే ఆమె అలా ప్రవర్తిస్తుంది కాబోలు అని మరికొందరు అంటున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందనేది తెలియరాలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి మరి.
View this post on Instagram