ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

వరుడు తన స్నేహితులు, బంధువులతో కలిసి ఊరేగుతూ పెళ్లి మండపానికి వచ్చేసరికి.. వధువుకు వేరే వ్యక్తితో పెళ్లయిపోయింది.

FOLLOW US: 

రికొద్ది సేపట్లో పెళ్లి. వరుడు అల్రెడీ ఊరేగింపులో మండపానికి బయల్దేరాడు. స్నేహితులతో ఎంతో ఉత్సాహంతో చిందులేశాడు. అయితే, మండపానికి చేరుకొనేలోపే.. అతడికి ఊహించని షాక్ ఎదురైంది. అప్పటికే వధువు మరొక యువకుడిని పెళ్లి చేసేసుకుంది. 

ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. రాజ్గారా తహసీల్‌లోని చెలానా గ్రామానికి చెందిన యువతికి మరో గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. మే 15న పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వరుడు తన ఇంటి నుంచి రాత్రి 9 గంటలకే ఊరేగింపుతో మండపానికి బయల్దేరాలి. కానీ, వరుడు తన స్నేహితులు, బందువులతో కలిసి మద్యం తాగుతూ బిజీగా గడిపాడు. చిందులేస్తూ సందడి చేశాడు. 

వరుడు ఎంతకీ పెళ్లి మండపానికి చేరుకోకపోవడంతో వరుడి బంధువులకు ఫోన్ చేశారు. ముహూర్తం దగ్గర పడుతున్నా వరుడు ఇంకా ఊరేగింపులోనే ఉన్నాడని, అతడు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలుసుకున్నారు. దీంతో వధువు తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వధువుతో మాట్లాడి అప్పటికప్పుడు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. అనుకున్న ముహూర్తానికి ఆమెకు ఆ యువకుడితో పెళ్లి చేశారు. 

Also Read: ఏంటమ్మా ఏంటీ? సింధూరం పెట్టుకుంటే శృంగార కోరికలు పుడుతాయా?

ఊరేగింపుగా మండపానికి చేరుకున్న వరుడి కుటుంబికులు షాకయ్యారు. వధువు కుటుంబికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వధువు కుటుంబికులపై ఫిర్యాదు చేశారు. అప్పటికే వరుడు మద్యం మత్తులో తూగుతున్నాడు. దీంతో పోలీసులకు కూడా సీన్ అర్థమైంది. పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. పెళ్లికైన ఖర్చులను వధువు కుటుంబికులు తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబికులు డిమాండ్ చేశారు. అయితే, చివరికి ఏమైందనేది మాత్రం తెలియరాలేదు. 

Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?

Published at : 18 May 2022 12:00 PM (IST) Tags: Bride Marries Another Man Bride marries another Rajasthan Wedding Rajasthan Bride

సంబంధిత కథనాలు

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Fight With Wife: భార్యతో గొడవ, చర్చికి నిప్పంటించిన భర్త - అసలు కారణం తెలిసి షాకైన జనం!

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Lottery: అధ్యక్షా, లక్కంటే ఇట్టా ఉండాల! ట్రక్కు డ్రైవర్‌కు ఊహించని జాక్‌పాట్, ఒకేసారి..

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Whistling Scrotum: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!

Cow Dung Car: కారును ఆవు పేడతో అలికేసిన యజమాని, ఎందుకో తెలిస్తే ఔరా అంటారు!

Cow Dung Car: కారును ఆవు పేడతో అలికేసిన యజమాని, ఎందుకో తెలిస్తే ఔరా అంటారు!

Love With Boyfriend Father: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

Love With Boyfriend Father: ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి, ఇద్దరికీ 24 ఏళ్లు గ్యాప్!

టాప్ స్టోరీస్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల