Hair Care: జుట్టు తెల్లబడి రాలిపోతుందా? ఈ అద్బుతమైన నూనెతో దానికి చెక్ పెట్టేయండి
జుట్టు సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల మేలు కంటే జుట్టు రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది. కానీ దీన్ని వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా ఉండే జుట్టుని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. జుట్టుని సంరక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్నీ చేస్తూనే ఉంటారు. జుట్టు రక్షణ కోసం కొన్ని శతాబ్దాలుగా వస్తున్న అద్భుతమైన ఔషధం బృంగరాజ్. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి మరెన్నో ముఖ్యమైన పోషకాలు కలిగిన మొక్క బృంగరాజ్. ఈ మూలిక రారాజుని కేషరాజ్ అని కూడా పిలుస్తారు. జుట్టుకి పుష్కలంగా పోషకాలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పొడి, చుండ్రు వంటి సమస్యలతో పోరాడుతుంది. బలహీనమైన మూలాలు జుట్టు రాలడానికి దారితీస్తాయి. కానీ ఈ ఔషధ గుణాలు ఉన్న భృంగరాజ్ వల్ల ఆ సమస్యలన్నీ అరికట్టవచ్చు.
పొద్దు తిరుగుడు కుటుంబానికి చెందిన ఇది భారత్, థాయిలాండ్, బ్రెజిల్ లోని తెమతో కూడిన ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. రెండు రకాల బృంగరాజ్ మొక్కలు ఉన్నాయి. ఒకటి పసుపు రంగు పువ్వులు ఉన్నదయితే మరొకటి తెలుపు రంగు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు రకాల పువ్వుల నుంచి నూనె తీయడానికి మంచిగా ఉంటాయి. జుట్టు సంరక్షణ కోసం ఎన్నో ఆయుర్వేద గుణాలున్న దీన్ని కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్నారు. వృద్ధాప్య సంకేతాలు కూడా ఇది దూరం చేస్తుంది.
జుట్టు పెరిగేలా చేస్తుంది
బృంగరాజ్ నూనె తల, చర్మం మూలాలకు వెళ్ళి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను దోహదపడుతుంది. ఈ నూనె వల్ల వెంట్రుకల కుదుళ్లు ఉత్తేజితమవుతాయి. ఈ నూనెని వారానికి రెండు సార్లు వృత్తాకార కదలికలతో పడి నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
పొడి చర్మం, చుండ్రు నివారణ
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా బృంగరాజ్ ఆయిల్ చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ సోరియాసిస్ సంకేతాలు, లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యని బృంగరాజ్ నూనె తగ్గిస్తుంది. ఈ నూనె మనసుని ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు సహాయపడుతుంది. ఈ హెర్బల్ నూనెలో విటమిన్స్, ఖనిజాలు మెండుగా ఉన్నాయి. నిద్రపోయే ముందు తలపై కొద్దిగా నూనెను మసాజ్ చేయండి. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు అభివృద్ధిని ప్రోత్సహించెందుకు అవసరమైన పోషకాలు అందిస్తుంది.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్ పోగొడుతుంది
బృంగరాజ్ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాల కారణంగా వివిధ స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ నయం చేసేందుకు సహాయపడుతుంది. సోరియాసిస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టినియా ఇన్ఫెక్షన్లు, అనేక రకాల ఫోలిక్యులర్ ఇన్ఫెక్షన్లు ఈ నూనెతో తగ్గించవచ్చు. ఈ నూనె క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల స్కాల్ప్ పెయిన్, హెయిర్ ఫోలికల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
జుట్టు నెరిసిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది
హెయిర్ ఆయిల్‌లోని యాక్టివ్ కాంపోనెంట్స్‌లో హరితాకీ, జాతమాన్సీ జుట్టు సహజ రంగును సంరక్షించి జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. ఉసిరి నూనెతో పాటు కొద్దిగా బృంగరాజ్ నూనె కలిపి రోజు రాసుకోవచ్చు. జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. రెగ్యులర్ మసాజ్‌లు జుట్టు మూలాలకు చేరి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పిల్లలు భయం, బెరుకుగా ఉంటున్నారా? వారిలో ఆత్మవిశ్వాసం ఇలా పెంచండి
Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు