అన్వేషించండి

Postpartum Depression: బాలింతల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వారు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడినట్టే

ప్రసవించాక కొంతమంది తల్లులు పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు.

గర్భం ధరించాక తొమ్మిది నెలల ప్రయాణం ఒక ఎత్తు. ప్రసవించాక బిడ్డను చూసుకుంటూ తన పై తాను శ్రద్ధ తీసుకోవడం మరో ఎత్తు. ప్రసవానంతరం తల్లిలో ఎన్నో మార్పులు వస్తాయి. వారు తమతో పాటు మరొక ప్రాణి బాగోగులు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ గర్భధారణ సమయంలో జరిగిన మార్పులు, ప్రసవం సమయంలో పడిన నొప్పులు కలిసి ఆమెను మానసికంగా చాలా కుంగ దీస్తాయి. ఈ మార్పు ప్రసవించాక ఆమెపై పడే అవకాశం ఉంది. అందుకే కొంతమంది తల్లులు డిప్రెషన్ బారిన పడుతుంటారు. బాలింతల్లో కనిపించే ఈ డిప్రెషన్‌ను పోస్టుపార్టమ్ డిప్రెషన్ అంటారు. ఇది ఒక మానసిక వ్యాధి. దీనికి ముఖ్యంగా కావలసింది కుటుంబ సభ్యుల మద్దతు. ఇది మరీ తీవ్రంగా ఉంటే చికిత్స అందించాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా దీని లక్షణాలు ఎలా ఉంటాయో అందరూ అవగాహన పెంచుకోవాలి.

పోస్టుపార్టమ్ డిప్రెషన్‌కు గురైన తల్లిలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి ఏడుస్తారు. హార్మోన్లలో చాలా మార్పులు వస్తాయి. నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఏదో ఆందోళన పడుతూ కనిపిస్తారు. ఏ పని చేయడానికి అయినా శక్తి హీనంగా అనిపిస్తారు. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతూ ఉంటారు. ఆహారం తినేందుకు ఇష్టపడరు. ఇవన్నీ కూడా ఈ పోస్టుపార్టమ్ డిప్రెషన్ బారిన పడిన తల్లిలో కనిపిస్తాయి. అందుకే ఈమెకు కుటుంబ సభ్యులు మద్దతు చాలా అవసరం.

కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ డిప్రెషన్ బారిన పడిన అనుభవం ఉంటే వారసత్వంగా కూడా ఇది ఆ కుటుంబంలోని ఆడపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమంది బాలింతలు ప్రసవానంతరం బై పోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధుల బారిన కూడా పడవచ్చు. అందుకే వారిపై ఎలాంటి మానసిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సమయానికి ఆహారాన్ని అందిస్తూ వారిని చంటి పిల్లలా చూడాలి, బిడ్డ ఆలనా పాలనా వాళ్ళ మీద వదిలేయకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి వారు ఆ డిప్రెషన్ లో బిడ్డకు హాని కలిగించే అవకాశం ఉంది. ఇది తల్లీ బిడ్డల అనుబంధంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లీ... తన బిడ్డను చూసుకునేందుకు ఇష్టం చూపించదు. కొంతమంది తల్లులు పోస్టుపార్టమ్ సైకోసిస్ అనే తీవ్ర మానసిక రుగ్మతకు గురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో వారు బిడ్డను చంపవచ్చు కూడా. అమెరికాలో ప్రతి లక్ష మంది జననాల్లో ఇలా పోస్టుపార్టమ్ సైకోసిస్ బారినపడిన తల్లులు కారణంగా ఎనిమిది మంది శిశువులు హత్యకు గురవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ప్రసవానంతరం తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యులకు ఉంది.

పోస్టుపార్టమ్ డిప్రెషన్ లక్షణాలు మరీ తీవ్రంగా కనిపిస్తే మానసిక వైద్యులను సంప్రదించాలి. వారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకో డైనమిక్ థెరపీ, ఇంటర్ పర్సనల్ సైకో థెరపీ వంటివి సూచిస్తారు. అలాగే కొన్ని మందులను కూడా అందిస్తారు. 

Also read: చీజ్ పౌడర్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget