Best Phones Under 5000 : పేరెంట్స్ కోసం 5 వేలలోపు వచ్చే బెస్ట్ ఫోన్లు.. నోకియా 2660 ఫ్లిప్ నుంచి లావా A5 వరకు
Best Phones Under 5000 for Parents : 5000 లోపు అందుబాటులో ఉన్న ఫోన్లు ఏంటో.. వాటిలోని ఫీచర్స్ ఏంటో.. ఏవి పేరెంట్స్ కోసం అనువైనవో చూసేద్దాం.

Best Phones Under 5000 : కొన్ని సంవత్సరాలుగా 5,000 రూపాయల లోపు బెస్ట్ ఫోన్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అందరూ స్మార్ట్ ఫోన్స్ ఎంపిక చేసుకుంటున్నారు. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికే ఫోన్స్ గురించి చాలా తక్కువగా తెలుస్తుంది. మంచి ఫీచర్లతో, 5వేల లోపు వచ్చే ఫోన్స్ మీరు వాడాలనుకున్నా.. మీ పేరెంట్స్ కోసం తీసుకోవాలనుకున్నా.. బెస్ట్ అనుభూతినిచ్చే ఫోన్స్ ఇక్కడున్నాయి. స్మార్ట్ యాప్స్, పేమెంట్ ఆప్షన్, మ్యూజిక్, వివిధ అధునాతన యాప్స్‌తో మార్కెట్లో అందుబాటులో ఉన్న మొబైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
4,499కే నోకియా 2660 ఫ్లిప్..

రెట్రో స్టైల్ ఇష్టపడేవారికి నోకియా 2660 ఫ్లిప్ పర్ఫెక్ట్. దీని ఫ్లిప్ డిజైన్ బిగ్ టచ్ బటన్‌లు, డ్యూయల్ డిస్‌ప్లేలతో వస్తుంది. ఎమర్జెన్సీ బటన్ ఐదుగురు కాంటాక్ట్‌లకు హెచ్చరికను పంపిస్తుంది. ఇది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బాగా ఉపయోగపడుతుంది. నోకియా దీనిని “పెద్ద బటన్‌లు, పెద్ద సౌండ్, పెద్ద డిస్‌ప్లే” కలిగిన ఫోన్‌గా హైలైట్ చేస్తుంది. సేఫ్టీతో పాటు స్టైలిష్‌గా కూడా ఆకట్టుకుంటుంది.
జియో ఫోన్ ప్రిమా

జియో వినియోగదారుల కోసం.. ప్రిమా-2.. మూడువేలలోపు(2,799) లోపు అందుబాటులో ఉంది. KaiOSలో రన్ అవుతుంది. ఇది YouTube, Facebook, JioTV, Google అసిస్టెంట్ వంటి యాప్‌లతో వస్తుంది. UPI లావాదేవీల కోసం JioPayకి కూడా మద్దతు ఇస్తుంది. ఇది క్వాల్‌కామ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇది జియో నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఇటెల్ ఫ్లిప్ వన్

ఇటెల్ ఫ్లిప్ వన్ పాకెట్-ఫ్రెండ్లీ 2,119 రూపాయలకే అందుబాటులో ఉంది. స్టైల్, మన్నికను ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఫాక్స్ లెదర్ ఫినిష్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, టైప్-సి ఛార్జింగ్‌తో.. ఆధునికంగా అందుబాటులో ఉంది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. రోజువారీ వినియోగానికి అనువైనదిగా చెప్తున్నారు.
లావా A5 (2025)

లావా A5 ఈ లైనప్‌లో అత్యంత చవకైనది ఈ మోడల్. కేవలం 1,222కే ఇది అందుబాటులో ఉంది. దీనితో UPI చెల్లింపులు, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా కూడా ఉంది. BOL కీప్యాడ్తో వస్తుంది. దృష్టి లోపం ఉన్న వినియోగదారులకు కూడా అనువైనది.
సెప్టెంబర్ నెలలో 5,000 రూపాయల లోపు ఈ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం చవకైనవే కాదు.. బోరింగ్ లేకుండా పెద్దలకు ఉపయోగపడుతుంది. ఫోన్స్ ఉపయోగించడం పెద్దగా తెలియనివారికి కూడా ఇవి మంచిగా హెల్ప్ అవుతాయి. అలాగే బ్లైండ్ వారికి కూడా ఉపయోగపడేలా డిజైన్ చేశారు.






















