అన్వేషించండి

Weightlifting Benefits: బరువులు ఎత్తితే ఇన్ని లాభాలా? మీరు అస్సలు నమ్మలేరు

రకరకాల వ్యాయామ పద్ధతులు ఉన్నాయి. సాధారణ వాకింగ్ నుంచి యోగా, జిమ్ ప్రాక్టీస్ వరకు ఎన్నో రకాలు. అన్ని వ్యాయామాలు వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ వల్ల కొన్నిఆరోగ్యప్రయోజనాలున్నాయట.

రువులను ఎత్తడం వల్ల హార్మోన్లు సమతుల్యత కోల్పోకుండా ఉంటాయి. నిద్ర నాణ్యత పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మెటిమలు, ఇన్ప్లమేషన్ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చర్మం సౌందర్యం మెరుగవటానికి వెయిట్ లిఫ్టింగ్ బాగా దోహదం చేస్తుందట.

వెయిట్ లిఫ్టింగ్ వంటి శక్తి వినియోగించే వ్యాయామాల ద్వారా కండరాలు బలోపేతం అవుతాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందట. ఇందుకు వెయిట్ లిఫ్టింగ్ ద్వారా రక్తప్రసరణ మెరుగు పడటమే కారణం. చర్మ కణాలకు రక్తం సరిపడినంత ప్రసరించడం వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది.

అంతేకాదు చర్మసౌందర్యానికి అవసరమయ్యే పోషకాలు కూడా తగినంత రక్తప్రసరణ ద్వారా చర్మానికి అందుతాయి. ఫలితంగా చర్మం రంగు సంతరించుకుని నిగనిగలాడుతుంది. బరువులెత్తే ప్రక్రియ శరరీంలో ఎండార్ఫిన్లు విడుదల చేసేందుకు తోడ్పడుతుంది. చెమట తగినంత రావడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.

రక్త ప్రసరణ

వెయిట్ లిఫ్టింగ్ వల్ల శరీరమంతటా రక్తప్రవాహం పెరుగుతుంది. మెరుగైన ప్రసరణ వల్ల చర్మ కణాలకు ఆక్సిజన్ ఇతర పోషకాలు తగినన్ని అందుతాయి. అందువల్ల చర్మం నునుపు తేలి అందంగా తయారవుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది

వెయిట్ లిఫ్టింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల విడుదల పెరగుతుంది. ఒత్తిడి ప్రభావం చర్మం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మెటిమలు, హెక్సిమా వంటి సమస్యలను పెంచుతాయి. ఎండార్ఫిన్ల విడుదల శరీరంలో ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

టాక్సిన్ల విసర్జన

వెయిట్ లిఫ్టింగ్ సెషన్లలో చెమట ఎక్కువ పడుతుంది. చర్మం నుంచి టాక్సిన్లు చమట ద్వారా బయటకు విసర్జితమై చర్మం లోపలి నుంచి శుబ్ర పడుతుంది. ఫలితంగా చర్మంలో బ్రేక్ అవుట్స్ తగ్గిపోతాయి.

హార్మోన్లు

వెయిట్ లిఫ్టింగ్ తో సహా క్రమం తప్పకుండా రోజూ చేసే వ్యాయామాలు హార్మోన్ల పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడిన చర్మ సమస్యలు వెయిట్ లిఫ్టింగ్ తో తగ్గిపోతాయి.

స్కిన్ ఎలాస్టిసిటి

బరువులు మొయ్యడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఇలా కండరాలు బలంగా ఉండడం వల్ల చర్మానికి తగినంత సపోర్ట్ దొరికి ఎలాస్టిసిటి మెరుగ్గా ఉంటుంది. చర్మం మీద త్వరగా ముడతలు రావు.

నిద్ర నాణ్యత

వెయిట్ లిఫ్టింగ్ తో సహా వ్యాయామం క్రమం తప్పకుండా చేసినపుడు స్లీప్ ప్యాటర్న్ సర్దుకుంటుంది. వ్యాయామం వల్ల శారీరక శ్రమ కలిగి నిద్ర నాణ్యత పెరుగుతుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు మెరుగైన నిద్ర చాలా అవసరం.

ఓవరాల్ హెల్త్

వెయిట్ లిఫ్టింగ్ ద్వారా రక్తనాళాలు, గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. రోజు వారీ వ్యాయామంలో వెయిట్ లిప్టింగ్‌ను కూడా చేర్చుకుంటే చర్మం, కండరాలు, రక్తనాళాలు, గుండె, హార్మోన్లు ఇలా అన్ని రకాల జీవక్రియలు మెరుగుపడుతాయి.

Also Read : Coffee: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి

Weightlifting Benefits: బరువులు ఎత్తితే ఇన్ని లాభాలా? మీరు అస్సలు నమ్మలేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget