Beauty Tips: ఈ చెత్త అలవాట్లు మీ అందాన్ని చెడగొట్టేస్తాయ్
అందం పెంచుకోవడమే కాదు దాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. రోజువారీ ఈ అలవాట్లు అందాన్ని పోగొడతాయి.
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడం కోసం సరైన సౌందర్య ఉత్పత్తులు ఎంచుకోవాలని అనుకుంటారు. కానీ ఇదే కాదు మనం రోజూ చేసే కొన్ని పనులే మనకి తెలియకుండానే చర్మానికి హాని కలిగిస్తాయి. వాటి గురించి తెలుసుకుని విస్మరిస్తే చర్మాన్ని మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేసుకోవచ్చు. అవేంటంటే..
మేకప్ వేసుకుని నిద్రపోవడం
రోజంతా మేకప్ వేసుకుని ఉండటం మంచి అలవాటు కాకపోవచ్చు. పడుకునే ముందు తప్పని సరిగా దాన్ని తొలగించాలి. లేదంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇది రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడు చర్మం ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఉండేందుకు పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ ని తొలగించడం అలవాటు చేసుకోండి.
మాయిశ్చరైజర్
నిద్రవేళకు ముందు మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం చాలా మంది చేసే తప్పు. కానీ నిద్రపోయే ముందు చర్మానికి మాయిశ్చరైజర్ చేయడం వల్ల తేమను లాక్ చేస్తుంది. హైడ్రేటెడ్, మృదువుగా ఉండే చర్మం కోసం ఈ దశ చాలా ముఖ్యమైనది. చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్యలో దీన్ని భాగం చేసుకోవాలి.
రాత్రిపూట జుట్టుకి నూనె రాయడం
జుట్టుకి నూనె రాసుకుని మసాజ్ చేసుకోవడం మంచిది. కానీ రాత్రిపూట రాసుకుని అలాగే వదిలేయడం మాత్రం మంచి అలవాటు కాదు. జుట్టులో నూనెను 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. హెయిల్ ఆయిల్ రాత్రంతా ఉంచితే అది చర్మంలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల రంధ్రాలు మూసుకుపయి మొటిమలు ఏర్పడటానికి దారి తీస్తుంది. నిద్రవేళకు కొన్ని గంటల ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసి శుభ్రంగా కడిగేయాలి.
మద్యం సేవించడం
పడుకునే ముందు ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ తో పాటు మొహం కూడా ఉబ్బిపోతుంది. నిర్జలీకరణానికి కారణమవుతుంది. నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆల్కహాల్ పరిమితం చేయాలి.
మురికి దిండ్లు, దుప్పట్లు
మురికిగా ఉండే బెడ్ షీట్స్, దిండ్లు చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి చర్మాన్ని చికాకు పెట్టేస్తాయి. మృదువుగా ఉండే నాణ్యమైన నూలుతో చేసిన షీట్లు, దిండ్లు ఎంచుకోవాలి. ఫాబ్రిక్ నుంచి మలినాలు ముఖం మీదకి చేరకుండా ఉండాలంటే ప్రతి 4-5 రోజులకు ఒక సారి దిండు కవర్లు మార్చుకోవాలి.
తగినంత నిద్రపోవడం
ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. నిద్రలేకపోవడం వల్ల మొహం నీరసంగా, కలల కింద నల్లటి వలయాలు పెరగడం, చర్మం మంటగా అనిపిస్తుంది. నిద్రపోతున్నప్పుడు కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. మెరుగైన రక్తప్రసరణ జరగకపోతే కళ్ళ కింద సంచులు ఏర్పడతాయి. రాత్రి కనీసం 7-9 గంటల పాటు నిద్ర చాలా అవసరం.
ఎక్కువగా ఎక్స్ ఫోలియేట్
చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే అతిగా చేస్తే ఎక్కువ హాని కలుగుతుంది. కఠినమైన స్క్రబ్ ఉపయోగించి రుద్దడం వల్ల చర్మం దెబ్బతింటుంది. మచ్చలు, పిగ్మెంటేషన్ కి దారి తీస్తుంది. చర్మ రకానికి తగిన సున్నితమైన ఎక్స్ ఫోలియేటర్లు ఉపయోగించాలి. అధిక స్క్రబ్బింగ్ నివారించాలి. ఇది ముఖంలోని ముఖ్యమైన నూనెలను తొలగిస్తుంది. పొడి బారిపోయేలా చేస్తుంది.
సన్ స్క్రీన్ రాసుకోకపోవడం
ఎండ లేదని సన్ స్క్రీన్ రాసుకోకుండా అసలు ఉండకూడదు. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో, సన్ బర్న్ నివారించడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సన్ స్క్రీన్ తోడ్పడుతుంది. చల్లగా ఉన్న వాతావరణంలో కూడా 30 లేదా అంతకంటే ఎక్కువ SPFతో సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు