అన్వేషించండి

Air Pollution: గాలి కాలుష్యంతో జాగ్రత్త, త్వరగా పక్షవాతం బారిన పడతారు

గాలి కాలుష్యం వల్ల మన శరీరానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతోంది అధ్యయనం.


గాలి కాలుష్యం పెరిగిపోతోంది. వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడం, పరిశ్రమల సంఖ్య పెరగడం వల్ల గాలి, నీరూ రెండూ... కలుషితంగా మారాయి. అలాంటి గాలిని పీల్చుకోవడం వల్ల మానవ శరీరాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. గాలి కాలుష్యం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం పెరిగిపోతోంది. నిజానికి పక్షవాతం రావడానికి ఊబకాయం, పోషకాహారం తినకపోవడం, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి కారణాలుగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు వీటితో పాటూ గాలి కాలుష్యం కూడా కారణంగానే చెప్పుకోవాలి. గాలి కాలుష్యం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశం 30 శాతం పెరిగినట్టు చెబుతోంది కొత్త అధ్యయనం. 

యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ పరిశోధకులు గాలి కాలుష్యానికి, పక్షవాతానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన దాదాపు వంద అధ్యయనాల ఫలితాలను వీరు పరిశీలించారు. ఆ పరిశోధన ఆధారంగా గాలి కాలుష్యం మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు ధ్రువీకరించారు. గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, కళ్లు దెబ్బతింటాయని చాలా మందికి తెలుసు. కానీ గాలిలోని కాలుష్యం మెదడును కూడా దెబ్బతీస్తుంది. గుండె, రక్త నాళాల వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల మనిషి శరీరం మరింతగా అనారోగ్యం పాలవుతుంది. 

పీల్చిన కలుషిత గాలిలోని రసాయనాలను బట్టి పక్షవాతం వచ్చే ముప్పు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. పీల్చిన గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ అధికంగా ఉంటే పక్షవాతం వచ్చే ముప్పు 30 శాతం పెరుగుతుంది. అదే పీల్చే గాలిలో కార్భన్ మోనాక్సైడ్ అధికంగా ఉంటే  26 శాతం పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. అలాగే సల్భర్ డైయాక్సైడ్ ఉన్న గాలిని అధికంగా పీలిస్తే 15 శాతం పక్షవాతం వచ్చే ముప్పు ఉంది. పక్షవాతం మరణించే ముప్పు సల్ఫర్ డైయాక్సైడ్ తో వల్ల 60 శాతం అధికం. అదే నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల 33 శాతం అధికం. గాలిలో ఉండే నుసి లాంటి నల్లని పదార్థాన్ని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లో వాపు వస్తుంది. దీనిల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి పక్షవాతం వచ్చే అవకాశం పెరిగిపోతుంది. గాలి కాలుష్యం వల్ల కేవలం పక్షవాతమే కాదు, అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గాలి కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పరిశ్రమలకు దగ్గరగా ఉండే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

Also read: రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

Also read: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Embed widget