Bathua Benefits : బతువా ఆకు తింటే మూత్రపిండాలు, కాలేయ సమస్యలు దూరం.. ఆచార్య బాలకృష్ణ సూచనలివే
Benefits of Bathua : శీతాకాలపు సూపర్ ఫుడ్ బతువా.. మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యానికి మంచిది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు.

Ayurvedic Benefits of Bathua : చలికాలంలో మార్కెట్లు తాజా ఆకుకూరలతో నిండి ఉంటాయి. మెంతి, పాలకూర వంటి వివిధ రకాల ఆకుకూరలతో పాటు.. మరొక చాలా ఉపయోగకరమైన ఆకుకూర కూడా ఒకటి ఉంది. అదే బతువా. ఆయుర్వేద నిపుణుడు ఆచార్య బాలకృష్ణ.. శీతాకాలంలో బతువా తింటే చాలా మంచిదని చెప్తున్నారు. దీనివల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను ఆయన హైలైట్ చేశారు. వెంటనే మీ డైట్లో దీనిని చేర్చుకుని కిడ్నీ, కాలేయ సమస్యలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు.
బతువా ఆకులోని పోషకాలు
బతువాను శీతాకాలపు "సూపర్ ఫుడ్" అంటారు. ఈ చిన్న ఆకుకూరలో అమైనో ఆమ్లాలు, ఫైబర్, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, బి, సిలలో ఇది పుష్కలంగా ఉంటుంది. అదనంగా బతువాలో ఇనుము, పొటాషియం, కాల్షియం, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. దీనిని చల్లని వాతావరణంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
View this post on Instagram
ఆయుర్వేదంలో బతువా
ఆచార్య బాలకృష్ణ ప్రకారం.. బతువా ఒక ఆకుకూర మాత్రమే కాదు.. ఔషధం కూడా. ఇది మూడు దోషాలను — వాత, పిత్త, కఫాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఇది కడుపు, జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.
కిడ్నీ, కాలేయానికి వరం..!?
బతువా ఆకు తింటే వచ్చే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. ఇది శరీరంలోని సహజ వడపోతలకు హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాలు, కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను తొలగించడానికి వీలు కల్పిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా.. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
జీర్ణక్రియతో పాటు.. బోన్స్ హెల్త్‌కి
బతువా ఆకు.. కడుపు సమస్యలు ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోని అధిక ఫైబర్, నీటి కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి. ఇది వాపును తగ్గించడానికి, వైద్యం వేగవంతం చేయడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంది. బతువా దృష్టిని మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం స్క్రీన్లపై చూసేవారికి ఇది బెనిఫిట్ ఉంటుంది.
బతువాను ఎలా తీసుకోవాలి..
బతువాను అనేక విధాలుగా తినవచ్చు. ఖాళీ కడుపుతో దాని రసం తాగడం చాలా ప్రయోజనకరంగా చెప్తారు. దానితో పాటు మీరు దానిని దాల్‌లో కలపవచ్చు. రైతా కూడా చేసుకోవచ్చు. బతువాను పరాఠాల రూపంలో కూడా తీసుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















