అన్వేషించండి

Food Storage : స్టీల్ పాత్రల్లో ఈ ఫుడ్స్ ఉంచకపోవడమే మంచిది.. లేదంటే ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు

Steel Bowls Spoil Certain Foods : కొన్ని ఆహారాలను స్టీల్ పాత్రల్లో ఉంచడం ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు. దీనివల్ల రుచి మారడమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందట. కారణాలు ఇవే..

Steel Utensils Are Not Safe for These Foods : వంటగదిలో స్టీల్ గిన్నెలు వాడడం సహజం. చాలామంది ఇళ్లల్లో ఇవి ఉంటాయి. ఎక్కువమందిని వీటిని ఇష్టపడతారు కూడా. ఎందుకంటే స్టీల్ పాత్రలు మన్నికైనవి. శుభ్రం చేయడం కూడా ఈజీనే. కానీ కొన్ని ఆహార పదార్థాలు స్టీల్ పాత్రల్లో ఉంచడం అవి ప్రమాదకరంగా మారుతాయట. కొన్నింటిని స్టీల్ పాత్రల్లో ఉంచితే.. రుచిలో మార్పులు రావడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్తున్నారు.

వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలు స్టీల్‌తో చర్య జరిపే మూలకాలను కలిగి ఉంటాయి. అలాంటప్పుడు ఆహారాలు, స్టీల్ పాత్రల మధ్య రసాయన చర్య జరగవచ్చు. దీని వలన ఆహారం రుచి చెడిపోవచ్చు. పోషకాలను కూడా కోల్పోవచ్చు. దీని వలన ఫుడ్ టాక్సిక్​గా లేదా ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు పెంచుతుంది. కాబట్టి స్టీల్ పాత్రల్లో ఎప్పుడూ కొన్ని ఫుడ్స్ నిల్వ చేయకూడదు. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో.. వాటిని ఉంచడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. 

స్టీల్ పాత్రల్లో పండ్లు వద్దు..

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. స్టీల్ పాత్రల్లో పండ్లను ఉంచడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. వాటి రుచి కూడా చెడిపోతుంది. అంతేకాకుండా స్టీల్ పాత్రలు ఫ్రూట్స్ తేమను పెంచుతాయి. దీనివల్ల పండ్లు త్వరగా కుళ్లిపోతాయి. పండ్లను నిల్వ చేయడానికి గాలి చొరబడని గాజు కంటైనర్లు ఉత్తమ ఎంపికలు. మీరు కావాలనుకుంటే.. మంచి నాణ్యత గల ప్లాస్టిక్ కంటైనర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది పండ్లను ఎక్కువ కాలం తాజాగా, సురక్షితంగా ఉంచుతుంది. 

పచ్చళ్లు అస్సలు పెట్టకండి..

ఊరగాయ ప్రతి ఇంటి వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. ఎక్కువ కాలం వీటిని నిల్వ చేస్తారు. ఊరగాయల్లో సహజ ఆమ్లం ఉంటుంది. ఉప్పు స్టీల్‌తో రసాయన చర్య జరపవచ్చు. ఇది స్టీల్ పాత్రలకు తుప్పు పట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఊరగాయ రుచి కూడా పాడు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రతిచర్య ఆహారానికి కూడా హాని కలిగించవచ్చు. అందువల్ల ఊరగాయలను ఎల్లప్పుడూ గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే నిల్వ చేయాలి. దీనివల్ల నాణ్యత అలాగే ఉంటుంది. ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. 

పెరుగు కూడా వద్దట

పెరుగు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పెరుగును స్టీల్ పాత్రల్లో ఉంచడం మంచిది కాదు. పెరుగులో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి స్టీల్‌తో కలిసి చెడు ప్రతిచర్యను కలిగిస్తాయి. పెరుగు రుచిని పాడు చేస్తాయి. దీనివల్ల పెరుగు త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా స్టీల్ పాత్రల్లో ఉంచడం వల్ల పెరుగు త్వరగా పులిసిపోవచ్చు. దీనివల్ల అది తినడానికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి పెరుగును ఎల్లప్పుడూ గాజు లేదా మట్టి పాత్రల్లో నిల్వ చేయాలి. మట్టి పాత్రలు పెరుగును తాజాగా ఉంచడమే కాకుండా.. పెరుగు రుచిని కూడా అలాగే ఉంచుతాయి. 

కాబట్టి స్టీల్ కంటైనర్స్​లో లేదా పాత్రల్లో వీటిని ఉంచకండి. తినేందుకు స్టీల్ పాత్రలు వాడటం మంచిదే కానీ.. కొన్ని రకాల ఫుడ్స్ కోసం మాత్రం వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget