Patanjali's Cardogrit Gold : పతంజలి మెడిసన్‌తో గుండె జబ్బులు నయం!? ఆయుర్వేద చికిత్సపై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Cardiogrit Gold : పతంజలి పరిశోధన ప్రకారం కార్డియోగ్రిట్ గోల్డ్ అనే ఆయుర్వేద మందు గుండె జబ్బును నయం చేస్తుందని గుర్తించారు. దీనిపై అంతర్జాతీయ పరిశోధనా పత్రిక జర్నల్ ఏమందంటే..

Patanjali Medicine for Heart Disease : పతంజలి ఆయుర్వేదం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల కలయికతో.. తీవ్రమైన వ్యాధులను కూడా నయం చేయవచ్చని నిరూపించింది తాజా అధ్యయనం. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే డోక్సోరుబిసిన్ అనే కీమోథెరపీ ఔషధం వల్ల వచ్చే గుండె జబ్బులను (కార్డియోటాక్సిసిటీ).. ఆయుర్వేద ఔషధమైన కార్డియోగ్రిట్ గోల్డ్‌తో నయం చేయవచ్చని తెలిపింది. ఈ పరిశోధన ప్రపంచానికి ఆయుర్వేద బలాన్ని మరోసారి నిరూపించింది.
అధ్యయన ఫలితాలు
కిమోథెరపీ ఔషదాల వల్ల వచ్చే గుండె సమస్యలను నయం చేసేందుకు అభివృద్ధి చేసిన హెర్బో మినరల్ డ్రగ్ కార్డియోగ్రిట్ గోల్డ్‌పై పతంజలి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ ఆయుర్వేద మందును శాస్త్రీయంగా పరీక్షించి.. ఇది కీమోథెరపీ వల్ల వచ్చే గుండె జబ్బులను దూరం చేస్తుందని నిర్ధారించారు. ఈ పరిశోధనలో కార్డియోగ్రిట్ గోల్డ్ తీసుకున్న తర్వాత గుండె పనిచేసే కండరాల పరిస్థితి మెరుగుపడిందని.. శరీరంలోని హానికరమైన మూలకాల స్థాయిలను (ROS) తగ్గించినట్లు గుర్తించారు.
జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో
ఈ అధ్యయనం సి.ఎలిగాన్స్ పద్ధతిలో చేసినట్లు పతంజలి శాస్త్రవేత్తలు తెలిపారు. కార్డియోగ్రిట్ గోల్డ్ తీసుకున్న తర్వాత ఎలిగాన్స్ అనే సూక్ష్మజీవులలో సానుకూల మార్పులు గుర్తించారు. ఇవి శరీరంలో డోక్సోరోబిసిన్ స్థాయిలు తగ్గించాయని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా పత్రిక జర్నల్ ఆఫ్ టాక్సికాలజీలో ప్రచురించడంతో అందరి దృష్టి దీనిపై పడింది.
పతంజలి కృషికి ఫలితం
పతంజలి కార్డియోగ్రిట్ గోల్డ్‌లో యోగేంద్ర రాస్, అర్జున్, మోతీ పిష్టి, అకీక్ పిష్టి వంటి మూలికలు, భస్మాలు వినియోగించామని.. ఇవి పురాతన ఆయుర్వేద గ్రంథాలలో గుండె జబ్బులకు ప్రభావవంతంగా పనిచేశాయని పతంజలి ఆయుర్వేద్ సీఈఓ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. "ఈ పరిశోధన ఆయుర్వేదంలోని శాస్త్రీయ స్వభావాన్ని మాత్రమే కాకుండా.. పురాతన వైద్య విధానాలను శాస్త్రీయంగా పరీక్షించింది. ఆధునిక వైద్యంలోని సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు ఆయుర్వేదంలో కనుగొనవచ్చని నిరూపించింది" అని వెల్లడించారు.
"ఈ పరిశోధన పతంజలి శాస్త్రవేత్తల కృషికి ఫలితం. ఆయుర్వేదాన్ని పునరుద్ధరించడానికి మేము వేసిన పెద్ద ముందడుగు ఇది. దీనివల్ల ప్రపంచమంతా ఆయుర్వేదాన్ని స్వీకరించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ పరిశోధనను ప్రజలు నమ్మడానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇది సంప్రదాయం, విజ్ఞాన శాస్త్రం కలయిక. మనకి దొరికిన అమూల్యమైన బహుమతి." అని హర్షం వ్యక్తం చేశారు.
ఈ అధ్యయనం ఆయుర్వేద మెడిసన్‌పై ప్రజల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తుందని పతంజలి శాస్త్రవేత్తలు తెలిపారు. ఆధునికమైన పద్ధతిలో కూడా ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో దీనిపై అందరి దృష్టి పడింది.
Also Read : రేబిస్ మరణాలకు ఇక చెక్.. చికిత్సపై ఆశలు పెంచుతోన్న కొత్త అధ్యయం






















