By: ABP Desam | Updated at : 15 Feb 2023 06:42 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
మలబద్ధకం సమస్య ఆకలి, మానసిక స్థితికి తీవ్ర అంతరాయం కలిగించే ఆరోగ్య సమస్య. జంక్ ఫుడ్ వినియోగం, ఆల్కహాల్ తాగడం, అతిగా తినడం, ఆహారంలో తగినంత పీచు పదార్థాలు లేకపోవడం, తగినంత నీరు తీసుకోకపోవడం, అధికంగా మాంసం తినడం వంటి వాటి వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. వీటితో పాటు ధూమపానం, వ్యాయామం లేకపోవడం కూడా పొట్టలో సమస్య పెరిగేలా చేస్తుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆయుర్వేద శాస్త్రం పలు నివారణలు సూచిస్తుంది. వాటిని ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మలబద్ధకాన్ని పూర్తిగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం వాత మనసు, శరీరంలోని అన్ని కదలికలని నియంత్రిస్తుంది. పొడి, కాంతి, చల్లని, కఠినమైన వాతావరణం ఉంటే వాత దోష పరిస్థితులు మారతాయి. అందుకే వాత దోషాన్ని సమతుల్యం చేసుకోవడం కోసం తాజాగా వండిన మెత్తని ఆహారాలు తీసుకోవాలి. ఈ ఆహారాల్లో ప్రోటీన్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చల్లని ఆహారాలు, పానియాలకు దూరంగా ఉండాలి. బాగా ఉడికించిన కూరగాయలను తినాలి.
మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని కలిగించే అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద నివారణల్లో త్రిఫల చూర్ణం ఒకటి. వేడి నీటిలో దీన్ని కలుపుకుని త్రిఫల టీని తయారుచేసుకోవచ్చు. అర టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ యాలకులు పొడి చేసుకుని త్రిఫల చూర్ణంతో పాటు ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగొచ్చు. పేగు కదలికలు బాగుండేలా చేస్తుంది.
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వేయించిన లేదా పొడి చేసిన సోంపు గింజలు కలపాలి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్ లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
వెలగక్కాయని బేల్ పండు అని కూడా పిలుస్తారు. ఇది మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. సాయంత్రం భోజనానికి ముందు అరకప్పు బేల్ పండు గుజ్జు, ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తినాలి. బేల్ రసంలో కొద్దిగా చింతపండు నీళ్ళు, బెల్లం కలిపి షర్బత్ లాగా చేసుకుని తీసుకోవచ్చు. డయాబెటిక్ బాధితులైతే ఈ పండు తినే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. ఇది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే కడుపుని మరింత ఇబ్బంది పెడుతుంది.
ఆయుర్వేద మూలిక లిక్కోరైస్ రూట్ కూడా జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఈ రూట్ పొడి వేసుకుని ఒక టీ స్పూన్ బెల్లం కలిపి తాగొచ్చు. క్రమం తప్పకుండా దీన్ని తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీగడతో ఇన్ని లాభాలా? అందాన్నీ పెంచుకోవచ్చు, రుచి కూడా అద్భుతం!
Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్
Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!
Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి
Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి
Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మరడం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి