Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి
కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన రోజువారీ పనులు ఏదైనా చేసుకోగలుతాం. అందుకే కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం.
సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ సేపు స్క్రీన్ కి అతుక్కుపోవడం వల్ల చాలా మంది కంటి సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. శరీరంలోని ఇతర భాగాల మీద చూపించే శ్రద్ద కళ్ళ గురించి అంతగా చూపించరు. చిన్న సమస్యే కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ కంటి ఆరోగ్యాన్ని విస్మరించడం తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు. కళ్ళు పొడిబారడం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి, కళ్ళు ఎర్రగా మారిపోయి నీరు కారడం వంటివి కంటి అనారోగ్యాన్ని సూచిస్తాయి. ఇటువంటి కంటి సమస్యల్ని పోగొట్టుకునేందుకు మూడు అద్భుతమైన ఆయుర్వేద నివారణలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేద వైద్యానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు ఇంగ్లీషు మందులు వచ్చిన తర్వాత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోయింది. కానీ ఈ వైద్యం తీసుకుంటే ఎటువంటి రోగాలు అయినా పూర్తిగా నయం అవుతాయి. అందుకే కళ్ళని సంరక్షించుకోవడం కోసం ఈ ఆయుర్వేద చికిత్స విధానాలు పాటించి చూడండి. మీ కంటి చూపుకి ఎటువంటి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నేత్ర తర్పణ్: నేత్ర తర్పణ్ అని పిలిచే మూలికలతో కూడిన నెయ్యిని కనురెప్పల మీద నెమ్మదిగా పోయడం జరుగుతుంది. దీని వల్ల కంటి అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు కళ్ళకి రక్త ప్రసరణ బాగా జరిగి దృష్టి మెరుగుపడుతుంది. నల్ల శనగలు పేస్ట్ చేసి కళ్ళు చుట్టూ రాసి ఆ తర్వాత దాని మీద వెచ్చని నెయ్యి పోస్తారు. ఇలా చేస్తే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయని అంటారు. ఎరుపు, మంటని తగ్గిస్తుంది. కంటి నరాలు బలంగా మారేలా చేస్తుంది. కళ్ళు పొడిబారిపోకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. కంప్యూటరైజ్డ్ విజన్ సిండ్రోమ్ చికిత్సకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
నాస్యం: ఈ ఆయుర్వేద మార్గాన్ని అనుసరిస్తే మొహంలోని కళ్ళు,ముక్కు, నోరుకి సంబంధించిన అన్ని వ్యాధులను నయం చేస్తుంది. ఇది నాసికా మార్గాన్ని శుభ్రం చేయడానికి ఫాలో అవుతారు. అందుకే చెవి, ముక్కు, గొంతుకి సంబంధించిన వ్యాధులని నివారించడానికి ఒకసారి రెండు నాసికా రంధ్రాలలో రెండు చుక్కల దేశీ నెయ్యి వేయాలి. ఇలా చేయడం వల్ల తల భాగం రిలీఫ్ గా ఉంటుంది. సైనసైటిస్, స్లీపింగ్ డిజార్డర్స్, తలనొప్పి, జుట్టుకు సంబంధించిన అన్నీ సమస్యల్ని ఇది పోగొడుతుంది.
అంజనం: అనేక మూలికల కలయికతో తయారుచేసిన పేస్ట్ ఇది. దీన్ని కనురెప్పల లోపలి భాగంలో రాసుకోవాలి. కళ్ళు దురద, మంట తగ్గించేలా సమర్థవంతంగా పని చేస్తుంది. ఈ చికిత్స కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: అంతమందిని ప్రేమిస్తే ఇంతే - ప్రియుడి పెళ్లిలో మాజీ ప్రియురాళ్ల హంగామా - ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్!