News
News
X

Sleeping Problems: ఎక్కువగా నిద్రపోతున్నారా? తక్కువ నిద్రపోతున్నారా? ఈ రెండూ గుండెకు ప్రమాదమే

అతిగా నిద్రపోతున్నారా? లేక తక్కువగా నిద్రపోతున్నారా? ఈ రెండూ ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. 

FOLLOW US: 

అసలు నిద్ర సరిపోవట్లేదు.. కనీసం 10 గంటలైనా పడుకోవాలని.. అప్పుడే ప్రశాంతత అనుకుంటున్నారా? తక్కువ కాదు.. ఎక్కువ నిద్రపోయినా.. ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. అతిగా నిద్రపోవడం కూడా.. ఆందోళనను సూచిస్తుంది. ఆరు నుంచి ఎనిమిది గంటలు మధ్య నిద్రపోయే వారి కంటే.. రోజుకు ఎనిమిది గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తులు హార్ట్ స్ట్రోక్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నా్యి. జీవనశైలిలో మార్పుతో స్ట్రోక్ కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులకు కూడా కార్డియాక్ అరెస్టు రావవడం చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 11, 2019న అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ఆన్‌లైన్ ఎడిషన్‌లో సగటున 62 ఏళ్ల వయస్సు ఉన్న 32,000 మంది వ్యక్తులలో స్ట్రోక్ రిస్క్ పై పరిశోధనలు చేశారు.   

రాత్రి ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే.., తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువ అని అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం 90 నిమిషాలు నిద్రపోయే వ్యక్తులు, 30 నిమిషాల కంటే తక్కువసేపు నిద్రపోయే వారితో పోలిస్తే పక్షవాతం వచ్చే అవకాశం 25% ఎక్కువ అని అధ్యయనం చెబుతోంది.  

స్ట్రోక్ వచ్చిన వారు కూడా తర్వాత నిద్రపోయేందుకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిద్ర లేమితో చాలా సమస్యలు వస్తాయి. విచారం ఎక్కువ అవుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలను కూడా వస్తాయి. ఎక్కువ నిద్ర, ఎక్కువసేపు మధ్యాహ్న నిద్రతో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నిద్రతో స్ట్రోక్ రావడానికి ఎలా సంబంధం ఉందని స్పష్టంగా చెప్పలేమని.. అయితే ఎక్కువ నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని.. ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్‌లోని న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ చెప్పారు.

ఆహారం, జీవన శైలిలో నియమాలు పాటిస్తే.. 80 శాతం వరకు స్ట్రోక్ రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మితమైన వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానం మరియు మాదకద్రవ్యాలను దూరంగా పెట్టడం వంటివి చేయాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు సరిగా ఉండేలా చూసుకోవాలి.

Also Read: Pumpkin: నిద్ర సరిగా పట్టడం లేదా... గుమ్మడి కూర తిని పడుకోండి

Also Read: The Rig Theme Park: వావ్.. నడి సముద్రంలో థీమ్ పార్క్.. సౌదీ బాబాయ్‌లది బుర్రే బుర్ర!

Also Read: Puneeth Rajkumar Death: పునీత్‌కు హార్ట్ఎటాక్.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?

Published at : 30 Oct 2021 09:53 AM (IST) Tags: Heart Attack Cardiac Arrest over sleep enough sleep sleeping problmes

సంబంధిత కథనాలు

Telugu Recipe: క్యాబేజీ వడలు, సాయంత్రానికి సింపుల్ స్నాక్ రెసిపీ

Telugu Recipe: క్యాబేజీ వడలు, సాయంత్రానికి సింపుల్ స్నాక్ రెసిపీ

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Cashew: రోజుకు ఎన్ని జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

Honey Pack: మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వేదిస్తున్నాయా? తేనెతో ఇలా చేయండి

World Contraception Day: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

World Contraception Day: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Diabetes: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది

Diabetes: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది

టాప్ స్టోరీస్

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

మీ నిరసన పద్దతి నచ్చింది, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం- మంత్రి కేటీఆర్

మీ నిరసన పద్దతి నచ్చింది, రెండు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం- మంత్రి కేటీఆర్

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా

Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా