JackFruit Seeds: పనస తొనలు తినేసి పిక్కలు పడేస్తున్నారా? వాటిని ఇలా తింటే ఎన్ని లాభాలో
పనసపండు తింటే ఎంత బావుంటుందో, కానీ దాని పిక్కలంటే మాత్రం చాలా చిన్న చూపు.
![JackFruit Seeds: పనస తొనలు తినేసి పిక్కలు పడేస్తున్నారా? వాటిని ఇలా తింటే ఎన్ని లాభాలో Are you eating the Jackfruit and dropping the seeds? How many benefits if you eat them like this JackFruit Seeds: పనస తొనలు తినేసి పిక్కలు పడేస్తున్నారా? వాటిని ఇలా తింటే ఎన్ని లాభాలో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/2e3d7c3de1165b551fd98a09016be0331657368531_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పనసపండు చూడటానికి వికృతంగా ఉంటుంది. చూడగానే నోరూరేలా ఉండదు. ముళ్ల పండులా ఉంటుంది. దాన్ని చీల్చి, పొట్ట తెరిస్తే అప్పుడు ఉంటాయి ముత్యాల్లాంటి పనస తొనలు. ఆ సువాసనకే నోరూరిపోతుంది. చాలా మంది పనసతొనలు తినేసి పిక్కల్ని పడేస్తారు. నిజానికి పిక్కల్లో ఉండే పోషక విలువలు ఇన్నీ అన్నీ కావు. అవి పడేసేవి కాదు, తినగలిగినవే. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఆ గింజల్లో ఉంటాయి.
ఎన్ని లాభాలో
పసనగింజలు పడేయకుండా తింటే మంచిది. ఉడకబెట్టుకుని, లేదా కాల్చుకుని వీటిని తింటే బావుంటాయి. వీటిలో పోషకాలు అధికం. మెరుగైన జీర్ణక్రియకు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ఇవి మేలు చేస్తాయి. వీటిలో డైటరీ ఫైబర్, బి కాంప్లెక్సు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే మలబద్ధకాన్ని రాకుండా అడ్డుకుంటాయి. పనసగింజలు మధుమేహులకు చాలా మంచిది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
పచ్చిగా తినవద్దు
ఈ గింజలు మంచివే. అయితే వండుకుని తింటేనే. పచ్చివి తినడం వల్ల సమస్యలు రావచ్చు. మందులను శోషించకునే శక్తి శరీరానికి తగ్గిపోవచ్చు. లేదా ఏదైనా దెబ్బ తాకినప్పుడు రక్త స్రావం అయ్యే ప్రమాదం పెరగవచ్చు. అందుకే వీటిని ఉడకబెట్టుకుని, నిప్పుల్లో కాల్చుకుని లేదా కూరలా వండుకుని తినాలి. అలా తింటే బోలెడన్నీ పోషకాలు అందుతాయి.
అధికంగా తినకూడదు..
రోజుకు ఆరేడు గింజలు తినవచ్చు, అంతకుమించి తింటే చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. పోషకాలను శరీరంశోషించుకోలేదు. అజీర్తి లేదా విరేచనాలు కలగవచ్చు. రక్తగడ్డకట్టకుండా అడ్డుకునే లక్షణాలు ఈ గింజల్లో ఉన్నాయి కాబట్టి, దెబ్బ తాకినప్పుడు అధికం రక్తం పోయే అవకాశం ఉంది.
వీరు తినకూడదు
కొంతమందికి ఇవి విషంతో సమానం. ఆస్పిరిన్, ఇబుప్రూఫెన్, నాప్రాక్సెన్, ప్లేట్ లెట్లు తగ్గించే మందులు, బ్లడ్ డైల్యూషన్ మందులు వాడే వారు ఈ గింజలకు దూరంగా ఉండాలి. ఆ మందులు వాడుతున్నప్పుడు వీటిని తినడం వల్ల శరీరంలో అధిక రక్త పోటు పెరుగుతుంది. అలాగే మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో అధికగా పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
Also read: మీరు గలగల మాట్లాడేవారా లేక మూతి ముడుచుకునే టైపా? ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తేల్చేస్తుంది
Also read: శిక్షణ పొందిన పైలెట్ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)