ఇది విన్నారా? ఏడాదిలో మీ భార్యతో ఇన్నిసార్లు కలిస్తే, మరణాన్ని జయిస్తారట!
మీరు ఏడాదిలో ఎన్నిసార్లు మీ భార్యతో కలుస్తున్నారు? పోనీ నెలలో ఎన్నిసార్లు? అస్సలు గుర్తులేదా? అయితే, మీరు ప్రమాదంలో ఉన్నట్లే.
పెళ్లయిన తర్వాత చాలా మంది ఆ అనుభవానికి దూరమవుతారు. పిల్లలు, బాధ్యతలు, బాధలు.. భార్యభర్తలను ఆ సుఖం నుంచి దూరం చేస్తాయి. దీంతో కాలక్రమేనా ఆ సుఖానికి దూరమై.. జీవితాన్ని చప్పగా సాగిస్తారు. లైంగికంగా కలవకపోవడం వల్ల భార్యభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది. స్పర్థలు కూడా వస్తాయి. ఒకరినొకరు దూరం పెట్టడం వల్ల వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుంది. మీ పార్టనర్లు తమను సుఖపెట్టే సరైన జోడీ కోసం వెతికే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలకు ఆస్కారం ఉంది. కాబట్టి.. తప్పకుండా మీ పార్టనర్‌తో రొమాంటిక్‌గా ఉండాలని నిపుణులు, అధ్యయనకారులు చెబుతున్నారు. దానివల్ల దాంపత్య జీవితం సుఖంగా సాగడమే కాదు.. మీ ఆయుష్సు కూడా పెరుగుతుందట. ముఖ్యంగా త్వరగా చనిపోయే అవకాశాలు తగ్గుతాయాట. అదెలా? అనుకుంటున్నారా? ఇదిగో ఇలా...
ఏడాదిలో 12 కంటే ఎక్కువ సార్లు చేస్తే?
హై బ్లడ్ ప్రెషర్.. (అధిక రక్తపోటు) సమస్యతో బాధపడేవారు ఏడాదిలో 12 సార్లు కంటే ఎక్కువ సార్లు తమ పార్టనర్‌తో బెడ్‌రూమ్‌లో అలా ఎంజాయ్ చేస్తే.. త్వరగా చనిపోయే ప్రమాదం నుంచి బయటపడతారట. ఇటీవల బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో 14 మిలియన్ మందిలో ప్రతి నలుగురిలో ఒకరు ఆ సుఖానికి దూరంగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్‌కు గురవ్వుతున్నారని తేలింది. అంటే, నెలలో కనీసం మీరు ఒకటి రెండు సార్లు మీ భార్యతో బెడ్ రూమ్‌లో కలవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువ కాలం బతకవచ్చు.
చైనాకు చెందిన నిపుణులు సైతం.. ‘బెడ్‌రూమ్’ మిమ్మల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుందని తెలుపుతున్నారు. డాక్టర్ జిహువా లియాంగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘లైంగికంగా చురుగ్గా ఉండేవారి గుండె సురక్షితంగా ఉంటుంది. కలయిక అనేది శారీక వ్యాయమంతో సమానం. ముఖ్యంగా మీ లైఫ్ పార్టనర్‌తో నిత్యం ఆ పనిలో ఉంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది’’ అని వెల్లడించారు.
మీయాజువా హాస్పిటల్‌కు చెందిన ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్స్‌కు చెందిన ఒక టీమ్ ఇటీవల 20 నుంచి 59 ఏళ్ల వయస్సున్న 4,500 మంది అమెరికన్ల లైఫ్‌స్టైల్‌ను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా అతిగా తమ భార్యతో ఆ పనిలో పాల్గొన్న వ్యక్తులు ఎక్కువ రోజులు జీవిస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే, నిత్యం భావప్రాప్తి చెందడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్, టైప్-2 డయాబెటీస్, గుండె జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చని పరిశోధకులు వెల్లడించారు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచి మీరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి. ఒక వేళ మీ భార్యభర్తల మధ్య ఏమైనా స్పర్థలు ఉండి ఉంటే.. కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. లేదా రొమాంటిక్ డిన్నర్‌తో మళ్లీ ఆ నాటి రోజులను గుర్తుచేసుకోండి. ఒక వేళ మీ పార్టనర్ ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్యులను సంప్రదించండి. లేదా ఈ అధ్యయనంలోని విషయాలు గురించి చెప్పి.. ఆరోగ్యం కోసమైనా ఒక్కటి కావాలని ఒప్పించండి. రోజూ బెడ్‌రూమ్‌లో అన్యోన్యంగా గడపడం వల్ల స్త్రీపురుషులు ఇద్దరికీ లాభమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఆరోగ్యం కోసం శ్రమించండి!!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read : నమిలింది చాలు, ఊసేయండి - చూయింగ్ గమ్‌తో ఈ సమస్యల్లో పడతారు జాగ్రత్త!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial