Happy Birthday Nagarjuna: హ్యాపీ బర్త్‌డే నాగ్‌మామ.. 66 ఏళ్లలోనూ యంగ్‌గా ఉండటానికి నాగార్జున ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇవే
Akkineni Nagarjuna : ఆగస్టు 29తో అక్కినేని నాగార్జున 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మునుపటి కంటే ఎక్కువ ఛార్మ్తో, రోజు రోజుకి యంగ్‌గా మారిపోతున్న నాగ్ మామ ఇస్తోన్న ఫిట్నెస్ టిప్స్ చూసేద్దాం.

Happy Birthday King : కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) రియల్ కింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. 66వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నా.. ఏ మాత్రం తన ఛార్మ్ తగ్గకుండా.. ఇప్పటికీ యవ్వనంగా ఉంటూ యంగ్ హీరోలకు కాంపిటేషన్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన అంటే.. నాగ్ 65 ఏళ్ల వయసులో చేసిన కూలీ (Coolie) సినిమాలో విలన్ పాత్రలో కనిపించి మెప్పించారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. నాగ్ మామ అందానికి మాత్రం అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు. ముఖ్యంగా చెన్నైలో ఈ సినిమాతో నాగార్జున క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
తెలుగు ప్రేక్షకులు కింగ్, మన్మథుడు (Manmadhudu) అని ముద్దుగా ఎందుకు పిలుస్తారో.. నాగార్జున లేటెస్ట్ లుక్ చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. మరి ఈ అందం, ఫిట్నెస్ వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. చాలా సందర్భాల్లో.. పలు ఇంటర్వ్యూల్లో నాగార్జున ఈ విషయం తెలిపారు. అన్ని పుష్టిగా తినాలి.. హెల్తీగా ఉండాలంటే కొన్ని విషయాలు స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతానని చెప్తారు. మరి ఆరు పదుల వయసులో కూడా యంగ్‌గా ఉండేందుకు నాగ్‌మామ ఎలాంటి డైట్, ఫిట్నెస్ రొటీన్ (Nagarjuna Diet and Fitness Routine) ఫాలో అవుతారో ఇప్పుడు చూసేద్దాం.
డైట్ రొటీన్..
రోజూ భోజనం చేస్తారు. కానీ వైట్ రైస్ తినరు. బ్రౌన్ రైస్ తింటారు. మూడు ఆకు కూరలు, ఆ మీల్లో ఉంటాయట. అలాగే చికెన్ లేదా చేప తీసుకుంటారట. ఎక్కువగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటానని తెలిపారు. అంటే ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్ ఉండే ఆహారాన్ని డైట్లో తీసుకుంటారు. అలాగే పెరిగే వయసుకు అనుగుణంగా డైట్లో నుంచి కొన్ని ఫుడ్స్ తీసేయాలని నిపుణులు సూచిస్తారు. వాటికి కచ్చితంగా నేను దూరంగా ఉంటానని తెలిపారు. అలా వయసుతోపాటు డైట్ కూడా మారుతూ వస్తుందని తెలిపారు.
ఫుడ్ విషయంలో ఎక్కువ కంట్రోల్ పెట్టుకోను. కానీ లిమిటెడ్‌గా తీసుకుంటానని తెలిపారు. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఏదొక స్వీట్ తీసుకుంటానని తెలిపారు. డిన్నర్ త్వరగా ముగించేయడం కూడా తన రొటీన్లో భాగమని తెలిపారు. పెరుగు కూడా తన డైట్లో ఉంటుందని తెలిపారు నాగార్జున.
వ్యాయామం..
ఆహారం మంచిగా, నచ్చింది తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వ్యాయామం చేయాలంటున్నారు నాగ్. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయమం చేసేస్తాని.. దీనివల్ల తన మెటబాలీజం హైలో ఉంటుందని.. ఖాళీగా కూర్చొన్నా బాడీ తాను చేసే పని చేసుకుపోతుందని.. కేలరీలు బర్న్ చేస్తుందని తెలిపారు. ఈ వ్యాయామం అనేది 35 ఏళ్లుగా తన లైఫ్స్టైల్లో భాగమైపోయిందని చెప్తున్నారు నాగ్. వ్యాయామం చేయలేకపోతే కనీసం రన్నింగ్, స్విమ్మింగ్ అయినా చేస్తానని తెలిపారు.
అసలైన రహస్యం ఇదే..
నాగ్‌మామ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే ఓ సింపుల్, ఎఫెక్టివ్ టిప్ ఏంటి అంటే.. ఎక్కువగా ఆలోచించకపోవడమేనట. అవును ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించను అని జరిగేది జరుగుతుందని.. అలా అనుకోవడం వల్ల స్ట్రైస్ తగ్గుతుందని ఓ సందర్భంలో తెలిపారు నాగ్. మైండ్ క్లియర్‌గా ఉంటే చాలా రిలాక్స్‌గా, సంతోషంగా ఉండగలమని అంటున్నారు. అలాగే తన ఫ్యామిలీ జీన్స్ కూడా తనకి హెల్ప్ చేస్తాయని.. వాటిని నేను కాపాడుకుంటున్నట్లు కూలీ ప్రమోషన్స్‌లో తెలిపారు నాగ్.
నాగార్జునలా 66 ఏళ్లలో ఉండాలనుకుంటే.. మీరు ఇప్పటినుంచే మీ డైట్లో మార్పులు చేయండి. ఫిట్నెస్ రొటీన్ అలవాటు చేసుకోండి. వాళ్లు సెలబ్రెటీలు వారు ఏమి చేసినా కుదురుతుంది అనుకోకండి. వయసు పరంగా డైట్లో చేయాల్సిన మార్పులు చేస్తూ.. చిన్న చిన్న వ్యాయామలు చేస్తు సింపుల్ ఫిట్నెస్ రొటీన్ బిల్డ్ చేసుకోండి. కనీసం వాక్ చేయండి. ఇవి మీకు కచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి తీరుతాయి. అప్పుడు మీరు కూడా నవ యువ మన్మథుడిగా మారిపోవచ్చు.






















