New Study on Nails Abnormalities : గోళ్లలో ఈ మార్పులుంటే జాగ్రత్త.. గోరు రంగును బట్టి మీకు క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయొచ్చంటున్న న్యూ స్టడీ
Genetic Predisposition : గోళ్లని రంగు బట్టి ఆరోగ్యం గురించి.. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పోయొచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇంతకీ తాజా అధ్యయనం ఏమి చెప్పిందంటే..
Nail Colour Signal Cancer Risk : టెక్నాలజీ పెరిగేకొద్ది శారీరక సమస్యలను గుర్తించడం మరింత సులభమవుతుంది. తాజాగా గోళ్ల రంగుతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇంతకుముందు వివిధ టెస్ట్‌ల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తే.. ఇప్పుడు గోళ్ల ద్వార కూడా క్యాన్సర్ రాకను గుర్తిస్తున్నారు. ఇది ట్యూమర్లను గుర్తించి.. వాటిపై అవగాహన పెంచి.. మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇంతకీ దీనిపై ఎలాంటి పరిశోధనలు చేశారు? గోళ్లు ఏ రంగులో ఉంటే లేదా ఏ విధంగా మారితే క్యాన్సర్ వచ్చినట్లు అర్థమో.. దీనిపై నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో చూసేద్దాం.
గోళ్ల రంగులో మార్పులు
మీ గోళ్లలో లేదా.. ఇతరులు గోళ్లలో ఎప్పుడైనా మార్పులు గమనించారా? మార్పులు అంటే అవి పెరిగాయా? ఏ కలర్ నెయిల్ పాలిష్ వేశారు అని కాదండి.. గోళ్లపై గాయాలు.. మరకలు, రంగు మారడం వంటివి చూశారా? సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గోళ్లు పచ్చగా, లేదా నల్లగా మారి కనిపిస్తాయి. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. కానీ గోళ్ల రంగులో లేదా గోళ్లలో అసాధారణ మార్పులనేవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గుర్తని చెప్తున్నాయి తాజా పరిశోధనలు. గోళ్లలోని మార్పులు క్యాన్సర్ ప్రమాదానికి హెచ్చరికలని చెప్తున్నాయి.
ట్యూమర్‌ను గుర్తించేందుకు
గోళ్ల ద్వారా ట్యూమర్‌ను గుర్తించడాన్ని నాన్ ఇన్వాసివ్ ఎర్లీ డిటెక్షన్ పద్ధతి అంటారు. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH)కి చెందిన శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. కొన్ని క్యాన్సర్లను ఎలా గుర్తించాలో, నిర్ధారించాలో తెలుసుకునేందుకు ఓ కనెక్షన్‌ను కనుగొన్నారు. గోళ్లు.. BAP1 ట్యూమర్ ప్రిడిస్పోజిషన్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి ఉనికి సూచిస్తుందని కనుగొన్నారు. BAP1 జన్యువులోని మార్పుల వల్ల చర్మం, కళ్లు, కిడ్నీ, ఛాతీ, ఉదరంలోని కణజాలతో సహా శరీరంలోని వివిధ భాగాల్లో క్యాన్సర్ కణితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని తెలిపారు.
అధ్యయనం ఏమి తేల్చిందంటే..
గోళ్లకు, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి.. జరిపిన ఈ అధ్యయనం గురించి.. JAMA డెర్మటాలజీలో ప్రచురించారు. సొసైటీ ఫర్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ వార్షిక మీటింగ్‌లో ఈ ఫలితాలను సబ్మీట్ చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా BAP1 ట్యూమర్ ప్రిడిస్పోజిషన్ సిండ్రోమ్‌తో ఉన్న 35 కుటుంబాలపై అధ్యయనం చేశారు. ఈ ట్యూమర్‌ను గుర్తించడానికి.. నెయిల్ స్క్రీనింగ్‌ల సామర్థ్యాన్ని గుర్తుచేసే విధంగా హైలైట్ అయింది. ఏటా వారికి స్కిన్, నెయిల్ స్క్రీనింగ్ చేశారు. దానిలో వారికి ఆసక్తికరమైన ఫలితాలు లభించాయి. వారిలో ఎక్కువమందికి ఒనికోపాపిల్లోమా (Onychopapillomas) అనే గోరు సమస్య ఉన్నట్లు గుర్తించారు.
ఆ రంగు కనిపిస్తే..
ఒనికోపాపిల్లోమా అంటే గోరు పొడవుతో పాటు.. గోరు, అంతర్లీనంగా ఉండే రంగు.. తెలుగు లేదా ఎరుపు రంగు కనిపిస్తుంది. ఈ కణితి సాధారణంగా ఒక గోరును మాత్రమే ప్రభావితం చేస్తుంది. వీరు నిర్వహించిన అధ్యయనంలో BAP1 ట్యూమర్ ప్రిడిస్పోజిషన్ సిండ్రోమ్‌తో 30 ఏళ్లు పైబడిన వయసు కలిగి.. పాల్గొన్నవారిలో.. 88 శాతం గోళ్లపై ఒనికోపాపిల్లోమా ఉన్నట్లు గుర్తించారు. ఇది వ్యక్తిగత, కుటుంబ నేపథ్యంలో ఈ తరహా క్యాన్సర్ ఉన్నవారిలో BAP1 ట్యూమర్ ప్రిడిస్పోజిషన్ సిండ్రోమ్‌గా రోగనిర్ధారణ చేయవచ్చని తెలిపారు.
BAP1 ట్యూమర్ ప్రిడిస్పోజిషన్ సిండ్రోమ్ ప్రభావిత గోళ్లు.. ఒనికోపాపిల్లోమాను నిర్ధారించాయి. దీనిని BAP1 మార్పులకు అనుసంధానం చేసి.. అనంతరం కాలంలో వారికి అందించాల్సిన చికిత్సపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఈ తరహా క్యాన్సర్ వ్యక్తిగత లేదా కుటుంబంలో ఉన్న రోగిలో నెయిల్ స్క్రీనింగ్ చాలా విలువైనదిగా చెప్తున్నారు. ఈ తరహా మార్పులను గుర్తిస్తే వైద్య చికిత్సను మరింత ముందుగానే ప్రారంభించి.. మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. దీనివల్ల క్యాన్సర్ అభివృద్ధి కాకుండా ఎదుర్కోగలమని తెలిపారు.
Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.