అన్వేషించండి

క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

క్వీన్ ఎలిజబెత్ మరణానికి కారణం ఏమిటో తెలుసా? ఆమె చివరి రోజుల్లో ఏం ఎంత బాద పడ్డారో బాంబ్ షెల్ కొత్త పుస్తకం వివరిస్తోంది.

క్వీన్ ఎలిజబెత్ వృద్ధాప్యం వల్లే మరణించిందని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, అధికారిక ప్రకటనలో కూడా అదే విషయాన్ని వెల్లడించారు. కానీ, ఆమె చివరి రోజుల్లో ఎంతో నరకాన్ని అనుభవిస్తూ చనిపోయారు. ఆమెను వేధించిన ఆ వ్యాధి మరేదో కాదు.. బోన్మారో క్యాన్సర్.

జీవిత చరిత్రలో ఆమె మరణానికి వృద్ధాప్యాన్ని కారణంగా చూపుతూ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నప్పటికీ క్వీన్ చివరి రోజుల్లో ఎంతో బాధను అనుభవించినట్టు చెబుతున్నారు. ఆ బాధకు కారణం మల్టీపుల్ మైలోమా అనే ఒక రకమైన బోన్మారో(ఎముకామజ్జ) క్యాన్సర్. బోన్మారో అంటే ఎముక మధ్యలో ఉండే గుజ్జు వంటి అవయవం. ఈ అవయవంలో క్యాన్సర్ మొదలవుతుంది. బోన్మారో రక్తంలో ఎర్ర, తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ రక్త కణాలే తర్వాత కాలంలో ఇమ్యూన్ సిస్టం డెవలప్మెంట్‌కు అవసరమవుతాయి. మల్టీపుల్ మైలోమాలో ప్రాథమిక స్థాయిలో ఏ రకమైన లక్షణాలు కూడా కనిపించవు. క్వీన్ ఎలిజబెత్ విషయంలో సాధారణంగా చేసే బ్లడ్, యూరిన్ టెస్టుల్లో వచ్చిన తేడా వల్ల కనుగొన్నారు. ప్రాథమిక స్థాయిలో కనుగొనడం కష్టం కానీ తర్వాత స్టేజ్ లలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి.

⦿ ఎముకల్లో స్థిరంగా నొప్పి ఉంటుంది. ముఖ్యంగా వెన్ను, పక్కటెముకలు లేదా తుంటి ఎముకల్లో నొప్పి ఉంటుంది.

⦿ చాలా చిన్న కారణాలకే రక్త స్రావం జరుగుతుంటుంది. చర్మం మీద బ్రూయిసెస్ కూడా కనిపిస్తాయి.

⦿ అకారణంగా బరువు తగ్గడం, ఎముకలు బలహీనంగా మారడం ఈ వ్యాధి లక్షణాలు.

ఇవే కాదు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా కనిపిస్తాయి. తరచుగా రక్త హీనత బారిన పడతారు. రక్తహీనత వల్ల నీరసం, అలసట, కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. రక్తం చిక్కబడడం వల్ల దృష్టి లోపం, కళ్లు తిరగడం, స్పృహ కూడా కోల్పోతుంటారు.

హైపర్కాల్సేమియా అనే స్థితి కూడా తరచుగా ఏర్పడుతుంది. హైపోకల్సేమియా అంటే రక్తంలో కాల్షియం ఎక్కువ చేరుతుంది. దీని వల్ల విపరీతంగా దాహం, కడుపు నొప్పి, తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, ఆ సమయంలో నొప్పి ఉండడం, మలబద్దకం, అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అయితే మైలోమాలో సాధారణంగా కణితి ఏర్పడదు కనుక ఇతర క్యాన్సర్ల మాదిరిగా గుర్తించడం కొంచెం కష్టమే.

ఎవరికి రిస్క్?

మల్టిపుల్ మైలోమా పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తుంది. దీనికి పెద్దగా కారణాలు తెలియవు. అయితే మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్ నోన్ సిగ్నిఫికెన్స్ (ఎంజీయూఎస్) అనే ఓ ప్రత్యేక స్థితికి ఈ క్యాన్సర్ కు ఏదో తెలియని సంబంధం ఉందని భావిస్తున్నారు. ఎంజీయూఎస్ అంటే రక్తంలో సాధారణంగా ఉండే ఒక రకమైన ప్రొటీన్.. అధిక స్థాయిలో ఉంటుంది. సాధారణంగా ఈ స్థితి అంత ప్రమాదకరం కాదు. అయితే ఈ స్థితిలో ఉన్న 100 మందిలో ఒకరికి మల్లిపుల్ మైలోమా రావచ్చు.

చికిత్స

మల్టీపుల్ మైలోమాకు ప్రత్యేక చికిత్స ఏదీ అందుబాటులో లేదని చెప్పాలి. చాలా సార్లు  ఈ క్యాన్సర్ బారిన పడిన వారు కోలుకోరు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు, కొన్ని సంవత్సరాల పాటు వ్యాధిని అదుపులో పెట్టేందుకు మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా యాంటీ మైలోమా మందులు ఉంటాయి. వీటి ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంటారు. అనిమియా, నొప్పి వంటి వాటికి సింమ్టామాటిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. బోన్మారో ట్రాన్స్ ప్లాంటేషన్ కొన్ని కేసుల్లో చక్కని పరిష్కారం. అయితే ఇది అందరిలో సాధ్యం కాదు.

Also Read: నిద్ర రావడం లేదా? ఇలా చేసి చూడండి

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Habits : 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బరువు తగ్గేందుకు ఫాలో అయి 5 చిట్కాలు ఇవే
4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బరువు తగ్గేందుకు ఫాలో అయి 5 చిట్కాలు ఇవే
Nonveg Storage Guide : మాంసాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు? చికెన్, మటన్ కుళ్లిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
మాంసాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు? చికెన్, మటన్ కుళ్లిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
Habits to Boost Success : ఒత్తిడి తగ్గి పనితీరు పెరగాలా? సక్సెస్ కావాలంటే ఈ 5 మిలటరీ రూల్స్ ఫాలో అవ్వండి
ఒత్తిడి తగ్గి పనితీరు పెరగాలా? సక్సెస్ కావాలంటే ఈ 5 మిలటరీ రూల్స్ ఫాలో అవ్వండి
Kids Height Growth : పిల్లలు ఎత్తు పెరగడం లేదా? అయితే హైట్ పెరగడానికి హెల్ప్ చేసే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించండి
పిల్లలు ఎత్తు పెరగడం లేదా? అయితే హైట్ పెరగడానికి హెల్ప్ చేసే ఈ సూపర్ ఫుడ్స్ తినిపించండి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget