Gut Health: క్యాన్సర్‌కు గట్ హెల్త్ కు లింకుందా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే!
పేగులు దెబ్బతింటే పలు లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్, క్యాన్సర్, అల్జీమర్స్ కు చెక్ పెట్టొచ్చంటున్నారు.
Gut Health: గట్ ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పేగులలో ఏర్పడే సమస్యల కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుని, వ్యర్థాలను బయటకు పంపించడంలో గట్ కీలక పాత్ర పోషిస్తుంది. పేగులు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. క్యాన్సర్, డయాబెటిస్, అల్జీమర్స్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. పేగుల ఆరోగ్యం దెబ్బతినే సమయంలో చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గట్ హెల్త్ బాగా లేకపోతే కనిపించే లక్షణాలు
1. చర్మం, జుట్టు, గోర్లు పెళుసుగా మారడం
గట్ ఆరోగ్యం దెబ్బతినప్పుడు చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. జుట్టు పొడిబారినట్లు అనిపిస్తుంది. గోర్లు పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి. ఈ లక్షణాలు ఉంటే గట్ హెల్త్ సరిగా లేదని అర్థం చేసుకోవచ్చు.
2. ఎముకలు సులభంగా విరగడం
ఎముకలు కూడా బలహీనంగా మారి విరిగిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చిన్న పేగులలో సమస్య ఏర్పడటం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం తీసుకోలేదు. దీంతో ఎముకలు అనారోగ్యానికి గురై విరిగిపోతాయి.
3. మలబద్ధం ఏర్పడటం
ప్రతి రోజూ సరిగ్గా మల విసర్జన కలిగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ, గట్ సమస్య ఉంటే తక్కువగా మల విసర్జన జరుగుతుంది.
4. గ్యాస్, ఉబ్బరం
పేలవమైన గట్ ఆరోగ్యం కారణంగా అధిక ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కలుగుతాయంటున్నారు నిపుణులు.
5. అలసట
గట్ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఈజీగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలసట అనేది గట్ సమస్యకు హెచ్చరికగా భావించవచ్చు.
6. డిప్రెషన్
గట్ హెల్త్ అనేది మెదడు పని తీరు మీద ఆధారపడి ఉంటుంది. పేగుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మెదడుకు ప్రతికూల సంకేతాలు వెళ్తాయి. ఫలితంగా డిప్రెషన్ ఏర్పడుతుంది.
7. తరచుగా దగ్గు, జలుబు ఏర్పడటం
గట్ ఆరోగ్యంగా ఉంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతంగా ఉంటుంది. గట్ సమస్య ఏర్పడితే తరచుగా దగ్గు, జలుబు ఏర్పడే అవకాశం ఉంది.
గట్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
1. లంచ్, డిన్నర్ లో మూడో వంతు కూరగాయలు తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే రకమైన కూరగాయాలు కాకుండా అన్ని రకాల ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.
2. రోజుకు 30 గ్రాములు లేదంటే అంతకంటే ఎక్కువ ఫైబర్ తినడానికి ప్రయత్నించాలి. పలు అధ్యయనాలు రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ పైబర్ తీసుకోవడం వల్ల చాలా లాభం కలుగుతుంది. గంజి, వోట్స్, తృణధాన్యాలు, చిలగడదుంప, బంగాళదుంపలు, హోల్‌గ్రెయిన్ బ్రెడ్, బీన్స్, పప్పులు, కూరగాయలలో ఎక్కువగా పైబర్ ఉంటుంది.
3. ఆహారాన్ని తీసుకునేటప్పుడు, నెమ్మదిగా నమిలి మింగాలి. లేదంటే పెద్ద పెద్ద ఆహారం ముక్కలను ప్రాసెస్ చేయడానికి పేగులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
4. అతిగా తినకుండా అవసరం అయిన మేరకే ఆహారం తీసుకోవాలి. అతిగా తినడం వల్ల ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గట్ ఆరోగ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అంతేకాదు, గట్ బ్యాక్టీరియా మరింత యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
6. చక్కగా నిద్రపోవడం వల్ల గట్ ఆరోగ్యం బలోపేతం అవుతుంది. కనీసం 9 గంటలు నిద్రపోవడం మంచిదంటున్నారు నిపుణులు.
Read Also : నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారా ? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు