Bridge Theft in Akron: వార్ని.. ఏకంగా వంతెన్నే ఎత్తుకెళ్లిన దొంగలు, ఇంత కక్కుర్తి ఏంట్రా? ట్విస్ట్ అదుర్స్!
వారు మహా ముదురు దొంగలు.. ఏకంగా ఫుట్ బ్రిడ్జినే ఎత్తుకెళ్లిపోయారు. కానీ, అసలు విషయం తెలిస్తే ఏమైపోతారో!!
‘‘ఎవడైనా.. డబ్బులు దొబ్బెస్తారు.. నగలు ఎత్తేస్తారు.. లేదా ఏదైనా విలువైన వస్తువును మాయం చేస్తారు. వీళ్లేంట్రా.. ఏకంగా వంతెనే ఎత్తుకెళ్లిపోయారు’’ అంటూ పోలీసులు.. ఆ దొంగలు చేసిన ఘనకార్యాన్ని తలచుకుని ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆ దొంగలకు అసలు విషయం తెలిస్తే.. తప్పకుండా షాకవుతారు.
ఒహియాలోని స్మాల్ అక్రాన్ ప్రాంతంలో రాత్రికి రాత్రి 58 అడుగుల పొడవైన ఫుట్ బ్రిడ్జి మాయమైపోయింది. పోనీ.. వరదలు వచ్చి కొట్టుకుపోయిందని సరిపెట్టుకోడానికి కూడా లేదు. ఎందుకంటే.. ఆ పరిసరాల్లో వర్షాలు సైతం కురవలేదు. ఈస్ట్ ఆక్రోన్‌లోని ఓ కాలువపై నిర్మించిన పాలీమర్‌తో నిర్మించిన వంతెన ఉండేది. నవంబరు 3న ఆ వంతెనకు ఉన్న డెక్‌ను ఎవరో దొంగిలించినట్లు గ్రామస్తులు గుర్తించారు. అది జరిగిన వారం రోజుల తర్వాత వంతెన మొత్తం మాయమైంది. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read also: భోజనం మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
10 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు, 58 అడుగుల పొడవు ఉండే ఆ వంతెన తొలగించాలంటే.. భారీ క్రేన్లు అవసరమవుతాయి. అలాంటిది.. దొంగలు గుట్టుచప్పుడు కాకుండా.. కనీసం గ్రామస్తులకు కూడా అనుమానం రాకుండా ఆ వంతెనను ఎలా దొంగిలించారనేది పోలీసులకు పిచ్చెక్కిస్తోంది. బాహుశా.. వారు వంతెనను ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఓ పోలీస్ అధికారి మీడియాలో మాట్లాడుతూ.. 22 ఏళ్ల నా సర్వీసులో ఎప్పుడూ ఇలాంటి దొంగతనాన్ని చూడలేదని తెలిపారు. ఇది తమ చరిత్రలో మిస్టరీగా కేసుగా నిలిచిపోవడం తమకు ఇష్టం లేదన్నారు. వంతెన విలువ సుమారు 40 వేల డాలర్లు (రూ.30.44 లక్షలు) ఉంటుందని తెలిపారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. అది పాలిమర్‌తో తయారు చేసిన వంతెన. దాన్ని అమ్మినా డబ్బులు రావు. పైగా రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగించడం కూడా సాధ్యం కాదు. మరి దాన్ని ఎత్తుకెళ్లిన దొంగలకు ఈ విషయం తెలుసో.. లేదో!!
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
Also Read: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి