Side Effects OF AC: ఏసీ వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు.. తస్మత్ జాగ్రత్త!
ఈ రోజుల్లో చాలా మంది ఏసీ గదుల్లోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఆఫీస్ కు వెళ్లినా, ఇంట్లో ఉన్నా ఏసీ వేసుకుంటున్నారు. అయితే, ఎక్కువగా ఏసీలో గడపడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
![Side Effects OF AC: ఏసీ వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు.. తస్మత్ జాగ్రత్త! 5 lesser known side effects of staying in an AC room for long hours Side Effects OF AC: ఏసీ వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు.. తస్మత్ జాగ్రత్త!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/ded37046a12c5fb192a2bc4b50c04a781719657250572544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Side Effects OF AC: ఏసీ వాడకం అనేది ఈ రోజుల్లో కామన్ అయ్యింది. ఆఫీస్ లోనే కాదు, చాలా మంది ఇంట్లోనూ ఏసీలు పెట్టించుకుంటున్నారు. ఏసీ ఎండ నుంచే కాకుండా తేమ నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే, కృత్రిమంగా నియంత్రించబడే వాతావరణం కారణంగా ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు నిపుణుల. ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం వల్ల చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, మానసిక అలసట, తలనొప్పి సహా పలు సమస్యల వస్తాయంటున్నారు.
ఏసీలో ఉండటం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలు
1. రోగనిరోధక శక్తి బలహీనపడటం
ఎయిర్ కండీషనింగ్ కు అలవాటు పడటం వల్ల శరీరం సహజ రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల కారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ప్రభావితం అవుతుంది. రోగకారక క్రిములను ఎదుర్కోవడంలో యాంటీ బాడీస్ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపించలేవు. సో, ఈజీగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.
2. శ్వాస సంబంధిత సమస్యలు
ఏసీలు రీసైకిల్ చేసిన గాలిని అందిస్తాయి. ఈ గాలిలో దుమ్ము, ధూళి సహా అలెర్జీ కారకాలు ఉంటాయి. ఏసీ గాలిని ఎక్కువ సేపు తీసుకోవడం వల్ల అలర్జీ సహా శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. ఇప్పటికే శ్వాస సమస్యలు ఉంటే మరింత తీవ్రం అవుతాయి. ఏసీ గాలి కారణంగా గొంతు ఎండిపోవడంతో పాటు శ్వాసకోశంలో అసౌకర్యంగా ఉంటుంది.
3.మానసిక అలసట, తలనొప్పి
ఏసీ గదులలో ఎక్కువగా గడపడం వల్ల మానసిక అలసట ఏర్పడుతుంది. కొద్ది సేపట్లోనే బ్రెయిన్ అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నెమ్మదిగా తలనొప్పి కూడా యాడ్ అవుతుంది. స్వచ్ఛమైన గాలి ప్రసరణ లేకపోవడం, తగినంత లైటింగ్ ఉండకపోవడం వల్ల మెదడుతో పాటు శరీరం మొద్దుబారిన ఫీలింగ్ కలుగుతుంది.
వీలైనంత వరకు ఏసీలో తక్కువగా ఉండేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. సహజ వాతావరణంలోనే ఆరోగ్యంగా ఉంటారని వెల్లడిస్తున్నారు. ఏసీతో చల్లదనం వచ్చినప్పటికీ, కలిగే మేలు కంటే, జరిగే కీడే ఎక్కువగా ఉంటుందంటున్నారు. అత్యవసరం అయితే తప్ప, ఏసీకి దూరంగా ఉండటం మంచిదంటున్నారు.
4. డ్రై స్కిన్, డీ హైడ్రేషన్
ఏసీలు గాలోని తేమను తొలగిస్తాయి. దీంతో ఈజీగా చర్మ పొడిబారుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. గదిలోని పొడిగాలి కారణంగా చర్మం సహజ గుణాన్ని కోల్పోయి దురదకు కారణం అవుతుంది. దురద కారణంగా చికాకు ఏర్పడుతుంది. అటు శరీరం కూడా డీహైడ్రేషన్ కు గురై ఈజీగా అలసిపోతారు.
5. కండరాల పట్టివేత, కీళ్ల నొప్పి
బయట, లోపల ఉష్ణోగ్రతతలో మార్పుల కారణంగా కండరాలు, కీళ్ల సమస్యలు ఏర్పడుతాయి. ఏసీలో చాలా సేపు ఉండటం వల్ల కండరాలు పట్టివేయడంతో పాటు కీళ్ల నొప్పులు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి సమస్య మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
Also Read : అబ్బాయిలూ.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, ప్రొస్టేట్ క్యాన్సర్ కావచ్చు!
Aslo read : ఒత్తిడిలో ఉన్నపుడు జంక్ ఫుడ్ తింటున్నారా? కొత్త అధ్యయనం ఏం చెబుతోందో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)