సమ్మర్​లో వేడిని తగ్గించుకునేందుకు చాలామంది ఏసీలను కొనుక్కుంటారు.

కానీ ఏసీలు లేని వారు కూడా కొన్ని టిప్స్​తో ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. అవేంటంటే..

కిటికీలకు, డోర్స్​ దగ్గర బ్లైండ్స్​ పెట్టుకోండి. దీనివల్ల ఎండ నేరుగా ఇంట్లోకి రాకుండా ఉంటుంది.

ఇంటి ప్రాంగణంలో వేపచెట్టుని పెంచుకోండి. ఒక వేప చెట్టు 10 ఏసీలతో సమానం అంటారు.

అపార్ట్​మెంట్స్​లో ఉండేవారు ఎక్కువగా మొక్కలను పెంచుకుంటూ ఉంటే రూమ్ చల్లగా ఉంటుంది.

ఇంటి పైకప్పు మీద వైట్ పెయింట్ వేయించుకుంటే వేడి ఇంట్లోకి రాదు.

పగటివేళ ఇంటి కిటికీలను మూసివేసినా.. సాయంత్రం మాత్రం తెరిచి ఉంచడం వల్ల ఇల్లు సహజంగా చల్లారుస్తుంది.

ఫ్యాన్​ కింద చల్లని గాలి కోసం ఐస్ బ్రిక్స్ ఉంచవచ్చు. వీటివల్ల గాలి చల్లగా మారుతుంది.

సీలింగ్ ఫ్యాన్లు మీకు గాలిని అందిస్తాయి. ఇంటి ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తాయి.

కొన్నిరకాల బల్బులు ఇంట్లో వేడిని కలిగిస్తాయి. LED లైట్లు ఖర్చు తగ్గిస్తాయి. వేడినియ్యవు.