World Record: ఈమె పేరున 27 ప్రపంచ రికార్డులు, తినడంలో ఈమె కన్నా ఫాస్ట్ ఎవరూ ఉండరు
ఏదో ఒక అంశంలో స్పెషల్ ఉండాలి. ఇదిగో ఈమె రికార్డులు నెలకొల్పడంలో స్పెషల్.
ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిటికెన వేలు కదపాలన్నా శక్తి కావాలి, ఆ శక్తిని ఇచ్చేది ఆహారమే కదా. కొందరు బతకడం కోసం తింటారు, మరికొందరు తినడం కోసమే బతుకుతారు. దీనిలో రెండో కోవకు చెందుతుంది లియో.ఆమెరు తినడమంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పట్నించి సమయం దొరికినప్పుడల్లా తినేది. తినడంలో కూడా వెరీ స్పెషల్. అందరూ రెండు ముద్దలు తినేలోపు ఈమె తన భోజనం ముగించేసేది. ఆ టాలెంట్ తోనే ఇప్పుడు 27 ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. అన్నీ కూడా తిండి కేటగిరీలోనే. తాజాగా ఆమె అతి వేగంగా భారీ బ్రేక్ ఫాస్ట్ ను అతి తక్కువ సమయంలో తిని కొత్త రికార్డు సాధించింది. పెద్ద ప్లేటు నిండా ఉన్న బాహుబలి అల్పాహారాన్ని కేవలం 8 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ బ్రేక్ ఫాస్ట్ మొత్తం 8 వేల కేలరీలకు సమానం. అంతకు ముందు రెండు వారాల క్రితమే ఓ వ్యక్తి ఈ రికార్డును సాధించాడు. అతను 12 నిమిషాల్లో ఈ అల్పాహారాన్ని తిన్నాడు. కానీ లియో కేవలం 8 నిమిషాల్లో తిని, రికార్డును తిరగరాసింది.
ఎవరీ లియో...
బ్రిటన్లోని బర్మింగ్ హామ్ లో జన్మించింది లియో షుట్ కేవర్. ఆమెకు రికార్డులు నెలకొల్పడం ఇష్టం. ఆమె తిన్న బ్రేక్ ఫాస్ట్ లో అయిదు గుడ్లు, అయిదు టమోటాలు, అయిదు కప్పుల పుడ్డింగ్లు ఇలా చాలా ఉన్నాయి. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వాటిని మనం ఇక్కడ తినం కాబట్టి పేర్లు కూడా సరిగా తెలిసే అవకాశం లేదు.
">