By: ABP Desam | Updated at : 27 Jan 2023 08:07 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pexels
ఢిల్లీలో 14 సంవత్సరాల జార్జియా గ్రీన్ అనే బాలిక ఇటీవల తన గదిలో డియోడరెంట్ స్ప్రే చేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె గుండె ఆగి చనిపోయింది. మొదట్లో అందుకు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఆ తర్వాత ఆమె స్ప్రే చేసిన డియోడరెంటేనని తెలిసింది. జార్జియాకు ఆటిజం ఉందని, ఆమెకు సువాసనలంటే ఇష్టమని, అందుకే ఆమె ఉపయోగించే దుప్పట్లపై డియోడరెంట్లను స్ప్రే చేసుకొనే అలవాటు ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఈ నేపథ్యంలో డియోడరెంట్‌ను ఉపయోగించడం ప్రమాదకరమా అనే విషయంపై చర్చ జరుగుతోంది.
కొన్ని రకాల డియోడరెంట్లలో వాడే రసాయనాలు వాటి నుంచి వచ్చే వాయువులు చాలా ప్రమాదకరం. డియోడరెంట్‌లో ఉండే ఏరోసోల్ అనే రసాయనం వల్లే జార్జియా చనిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో డియోడరెంట్లు ఎంచుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ఇలాంటి ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉంచాల్సి ఉంటుందని, లేదా పరిమితులను తెలియజేయడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డియోడరెంట్లకు బదులుగా టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించవచ్చు.
డియోడరెంట్లలోన ఏరోసోల్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. ఈ వాయువులు ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. పిల్లలకు మాత్రమే కాదు ఈ విషయాల గురించిన అవగాహన పెద్దవారిలో కూడా సాధారణంగా తక్కువే ఉంటుంది. ఈ విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. డియోడరెంట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిమితుల గురించి తెలుసుకుని ఉపయోగించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏరోసోల్ వాసనను మోతాదుకు మించి పీల్చడం వల్ల ఆమె శరీరంలోకి విషవాయువు ప్రవేశించి ఉండవచ్చని, ఆ వెంటనే ఆమె కార్డియాక్ అరెస్టుకు గురై ఉండొచ్చని చెబుతున్నారు.
గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల బాధితుడు క్షణాల్లో కుప్పకూలతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి.
⦿ ఛాతి లో నొప్పి
⦿ విచిత్రంగా వినిపించే గురక
⦿ శ్వాస ఆడకపోవడం
⦿ స్పృహ కోల్పోవడం
⦿ తల తిరగడం
⦿ గుండె లయ తప్పడం
⦿ గుండె దడగా ఉండడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్పందించి డాక్టర్ ను సంప్రదించడం లేదా ప్రథమ చికిత్స చెయ్యడం చాలా అవసరం.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడి కలిగే సమస్యే హార్ట్ ఎటాక్. దీన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చల్లని చెమటలు పట్టినా అప్రమత్తం కావాలి. కొందరిలో తలనొప్పి, వికారం కూడా లక్షణాలు కూడా కనిపిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవాలంటే రోజూ ఆ పదార్ధం తినాల్సిందే
Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం
World Autism Awareness Day: ఆటిజం అంటే ఏమిటి? పిల్లల్లో ఆటిజం ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
నాకూ, నా భర్తకు మధ్యలో మా అత్తగారు - ఆవిడ ప్రవర్తన నాకు నచ్చడం లేదు
Summer Foods: వేసవిలో కచ్చితంగా తీసుకోవలసిన ఆహారాలు ఇవే, బరువు తగ్గడం ఖాయం
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం