అన్వేషించండి

Wipro: ఫ్రెషర్స్‌కు 'విప్రో' గుడ్ న్యూస్, కొత్తగా ఐదేళ్ల ప్రణాళిక! ఏంటది?

విప్రో సంస్థ ఫ్రెషర్స్‌ కోసం 5 సంవత్సరాల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లతోపాటు పలు బెనిఫిట్లు కల్పిస్తామని తెలిపింది.

ఫ్రెషర్స్‌కు ఐటీ దిగ్గజం విప్రో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇకపై క్యాంపస్‌ నియామకాల్లో నియమితులైన ఫ్రెషర్స్‌కు 5 సంవత్సరాల వేతన ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. వార్షిక ఇంక్రిమెంట్లు, బోనస్‌లతోపాటు పలు బెనిఫిట్లు కల్పిస్తామని తెలిపింది. ఇప్పటికే మూన్‌ లైటింగ్‌కు పాల్పడుతున్న ఐటీ నిపుణులను గుర్తించి, వారి ఆట కట్టించేందుకు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

మూన్‌ లైటింగ్‌లో స్టార్టప్‌లతో పనిచేస్తున్న నిపుణుల ప్రావిడెండ్‌ ఫండ్‌ వివరాలను చెక్‌ చేస్తున్నట్లు విప్రో సంస్థ పేర్కొంది. మూన్‌ లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను కనిపెట్టేందుకు పలు రకాల పద్దతులు అవలంభిస్తున్నామని విప్రో వెల్లడించింది. కెరీర్‌ను పరిగణనలోకి తీసుకుని చాలా స్పష్టంగా ఐదేళ్ల వేతన ప్యాకేజీ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సంబంధిత క్యాంపస్‌ రిక్రూటీలకు సమాచారం ఇచ్చినట్లు విప్రో స్పష్టం చేసింది.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో నియమితులైన వారి వేతనం వచ్చే 5 సంవత్సరాల్లో ఎలా పెరుగుతుందో వివరిస్తూ ఆఫర్‌ లెటర్లలో పేర్కొంటున్నట్లు విప్రో పేర్కొంది. వేతన ప్యాకేజీపై చాలా నమ్మకంతో కూడిన హామీని ఫ్రెషర్స్‌కు ఇస్తున్నట్లు విప్రో చీఫ్‌ రీసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరవ్‌ గోవిల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విభిన్న బోనస్‌లతోపాటు వేతనాల పెంపు తదితర వివరాలు ఆ ఆఫర్‌ లెటర్లలో ఉంటాయని తెలిపారు. దేశంలోని అత్యధిక ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో క్యాంపస్‌ల్లో కొత్త నియామకాలు చేపడుతుంటాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో సుమారు 15 వేల మందిని విప్రో నియమించుకుంది. సంస్థలో 85 శాతం మంది ఉద్యోగులు 100 శాతం వేరియబుల్‌ పే కాంపొనెంట్‌లోకి వస్తారు. మూన్‌ లైటింగ్‌కు పాల్పడే వారి పట్ల విప్రో కొరడా ఝుళిపిస్తున్నది. ఇప్పటికే 300 మందిని ఇంటికి సాగనంపింది. భవిష్యత్‌లో ఐటీ, డిజిటల్‌, సైబర్‌ సేవలకు గిరాకీ పెరగనుండటం, అట్రిక్షన్లు పెరిగిపోతుండటంతో విప్రో.. కొత్తగా నియమితులయ్యే ఫ్రెషర్స్‌ వేతనాల పెంపునకు ఐదేండ్ల ప్రణాళిక రూపొందిస్తుండటం ప్రాధాన్యం ఏర్పడింది. అన్ని రకాల ఆఫర్లు అందిస్తున్న విప్రో.. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా ఈ ఆఫర్లు అమలు చేస్తుంది. 

:: Also Read :: 

ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు, డిగ్రీ ఏదైనా సరే!
తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో (టీఎస్‌ఆర్టీసీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగానికి; బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉన్నవారు నాన్-ఇంజినీరింగ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 16లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదట నేషనల్ అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. ప్రస్తుతానికి నాన్-ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను మాత్రమే అధికారులు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రకటనలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

DOT: టెలికమ్యూనికేషన్ శాఖలో ఇంటర్న్‌షిప్, ఈ అర్హతలు ఉండాలి!
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సెంటర్‌లో ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15000 ఇంటర్న్‌షిప్‌గా ఇస్తారు. ఇంటర్నిషిప్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు
TEC ఇంటర్న్‌షిప్ స్కీమ్ - ఇంటర్న్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget